Telangana Budget: తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రెండో బడ్జెట్‌ను ప్రవేశ పెట్టేందుకు రెడీ అయింది. మరికొన్ని గంటల్లో డిప్యూటీ సీఎం, ఆర్ధిక మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు. ఈసారి సుమారు 3. 20 లక్షల కోట్లతో బడ్జెట్‌ను ఆయన ప్రవేశ పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. సంక్షేమం, అభివృద్ధి మేళవింపుగా కేటాయింపులు ఉంటాయన్న టాక్ వినిపిస్తోంది. విద్య, వైద్యం, వ్యవసాయం, ఆరు గ్యారంటీలు, ఆర్ఆర్ఆర్, ఫ్యూచర్ సిటీ, మెట్రో విస్తరణతో పాటు మూసీ పునరుజ్జీవానికి అవసరమైన నిధులను ఈ బడ్జెట్‌లో కేటాయించే అవకాశం ఉంది.
Read Also: Aditya 369 : రీ-రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ‘ఆదిత్య 369’
అయితే, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలులో భాగంగా మిగిలిపోయిన పథకాలను పట్టాలెక్కించాలని రేవంత్ రెడ్డి సర్కార్ భావిస్తోంది. అందులోభాగంగానే.. ప్రస్తుతం 2 వేలుగా ఉన్న ఆసరా పెన్షన్‌ను కనీసం 3 వేలకు పెంచాలని చూస్తుంది. దానికి ఏడాదికి సుమారు 4 వేల కోట్ల రూపాయల ఖర్చు పెరనున్నట్లు అంచనా వేశారు. ఇక, మహాలక్ష్మీ పథకానికి అయ్యే ఖర్చును ఈ బడ్జెట్‌లో ప్రవేశ పెట్టనున్నారు?.. అలాగే, కొత్తగా ప్రకటించిన రాజీవ్ యువ వికాసం పథకానికి కూడా కేటాయింపులుండే అవకాశం ఉంది.. వీటన్నింటికీ తోడు ఇందిరమ్మ ఇళ్లకు భారీగానే నిధులను కాంగ్రెస్ సర్కార్ కేటాయించనుంది.
Read Also: Basangouda Patil Yatnal: రన్యా రావుపై అవమానకరమైన వ్యాఖ్యలు..బీజేపీ ఎమ్మెల్యేపై ఎఫ్ఐఆర్ నమోదు
ఇక, రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల నిర్మాణం, మెట్రో విస్తరణ, ఫ్యూచర్ సిటీకి కూడా నిధులను సైతం కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించనుందని తెలుస్తుంది. ఈ సారి పీఆర్సీని ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా, ఈసారి బడ్జెట్ 3.20 లక్షల కోట్లుగా ఉండనున్నట్లు తెలుస్తుంది. గత కొన్నేళ్లుగా తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ను పరిశీలిస్తే.. ఒక్క కరోనా ఏడాది మినహాయిస్తే.. ప్రతి సంవత్సరం 25 వేల కోట్ల నుంచి 35 వేల కోట్ల మేర బడ్జెట్ పెరిగిపోతుంది. మొత్తంగా.. ఈసారి బడ్జెట్ ఎలా ఉండబోతోందనేది ఆసక్తిగా మారింది.