Madhusudhana Chary: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల పెంపుపై శాసన మండలిలో చర్చ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, మండలిలో ప్రతిపక్ష నేత మధుసూధనాచారి మాట్లాడుతూ.. గతంలో మీరు (కాంగ్రెస్) ఇచ్చిన హామీలు ఎక్కడా అమలు చేయలేదు అని విమర్శించారు. మీ చిత్తశుద్ధి విషయంలో మాకు అనేక అనుమానాలు ఉన్నాయి.. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొదటి సారి కులగణన జరగుతుంది అంటే కాంగ్రెస్ పార్టీని తప్పు పట్టాల్సిందే.. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఉన్న పార్టీ పట్టించుకోకపోవడం వల్లే నిర్లక్ష్యం జరిగింది.. నియోజక వర్గాల పునర్విభజన అంశంపై అన్ని పార్టీలు ఏకం కావాలి అని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ నియంత్రణ పాటించడం వల్ల జనాభా తగ్గి పార్లమెంట్ స్థానాలు తగ్గిపోయే అవకాశముంది అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.. బీసీ బిల్లుకు బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతుంది అని మధుసూధనాచారి వెల్లడించారు.
Read Also: Supritha : నన్నెవరూ అరెస్ట్ చేయలేదు.. సేఫ్ గా ఉన్నా: సుప్రీత
ఇక, వెనకబడిన కులాలకు రిజర్వేషన్లు కల్పించాలి అని టీజేఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండ రామ్ తెలిపారు. బీసీలు 56 శాతం ఉండాలి.. కానీ, ఏ లెక్క ప్రకారం చేశారో కానీ 42 శాతం చేశారు.. ఇప్పటికీ సమానమైన భాగస్వామ్యం లేదు.. బీసీలకు అవకాశాలు రావడం లేదన్నారు. దానికి రిజర్వేషన్ చేయడమే మార్గం అని ఆయన పేర్కొన్నారు.