అమీర్ ఖాన్ సన్ జునైద్ ఖాన్‌తో ఏక్ దిన్ అనే బాలీవుడ్ డెబ్యూకి రెడీ అయ్యింది సాయిపల్లవి. తొలుత గత ఏడాది నవంబర్ 7న రిలీజ్ డేట్ అని ఎనౌన్స్ చేశారు. కానీ సడెన్లీ ఈ సినిమా టైటిల్‌తో పాటు పలు మార్పులు చోటుచేసుకున్నాయి. ఏక్ దిన్ టైటిల్ కాస్త ‘మేరీ రహో’గా మార్చి సినిమాను నవంబర్ నుండి డిసెంబర్ 12కి విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న చడీ చప్పుడు చేయలేదు టీం. వాయిదా పడినట్లు ఎనౌన్స్ కూడా చేయలేదు. మళ్లీ ఏమనుకున్నారేమో కొత్త టైటిల్ మార్చి పాత టైటిల్ ఏక్ దిన్‌నే ఫిక్స్ చేసి.. మే 1న రిలీజ్ చేస్తామని తాజాగా ఎనౌన్స్ చేసింది టీం.
మూవీ టైటిల్ ఛేంజ్, వాయిదాల వెనకు అమీర్ ఖాన్ ఉన్నట్లు బాలీవుడ్ టాక్. కొడుకు హిట్ కోసం ఈ ప్రాజెక్ట్స్‌లో వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్స్‌గా జాయినై మార్పులు చేర్పులు చేశాడు మిస్టర్ ఫర్ ఫెక్ట్. జునైద్ ఫస్ట్ ఫిల్మ్ లవ్యాపా డిజాస్టర్ కావడంతో నెక్ట్స్ సినిమా విషయంలో అలా కాకూడదని స్వయంగా అమీర్ ఖాన్ రంగంలోకి దిగాడు. 2016లో వచ్చిన థాయ్ మూవీ వన్ డే ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించినట్లుగా తెలుస్తోంది. ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్నట్లు రీసెంట్ రిలీజ్ చేసిన టీజర్ చూస్తే అర్థమౌతుంది. టీజర్ వచ్చాక.. థాయ్ మూవీకి కాపీ క్యాట్ అంటూ నెట్టింట్లో చర్చ స్టార్టైంది. జపాన్‌లోని సప్పోర్ సిటీలో స్నో ఫెస్టివల్లో చిత్రీకరించిన సన్నివేశాలు ఈ సినిమాకు హైలెట్ కాబోతున్నాయట. మే1న రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న ఏక్ దిన్.. అదే రోజు వస్తున్న రితేశ్ దేశ్ ముఖ్ యాంబిసియస్ పీరియాడిక్ డ్రామా రాజా శివాజీతో పోటీ పడుతోంది. ఇక జునైద్ ఖాన్ లాంటి ప్లాప్ హీరోతో జోడీ కట్టడమంటే సాయి పల్లవి తన కెరీర్‌ని రిస్క్‌లో పెడుతున్నట్లే లెక్క. ఇప్పటి వరకు నో ఎక్స్ పోజింగ్, నో రొమాంటిక్ థీరిని పాలో అయిన డ్యాన్సింగ్ క్వీన్.. హిందీలోనూ అదే మెయిన్ టైన్ చేస్తున్నట్లే కనిపిస్తోంది.