Padma Awards 2026: భారతదేశంలో అత్యున్నత పౌర గౌరవాలుగా గుర్తింపు పొందిన పద్మ అవార్డులు (Padma Awards) 2026 సంవత్సరానికి గానూ కేంద్రం ప్రకటించింది. కళలు, క్రీడలు, సాహిత్యం, విద్య, వైద్యం, శాస్త్ర సాంకేతిక రంగాలు, సామాజిక సేవ, ప్రజాపాలన వంటి అనేక రంగాల్లో విశేష సేవలందించిన వారికి ఈ అవార్డులు ప్రదానం చేయబడతాయి. ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం (జనవరి 26) సందర్భంగా పద్మ అవార్డు గ్రహీతల జాబితాను ప్రకటిస్తారు. అనంతరం అవార్డ్స్ ను రాష్ట్రపతి భవన్‌లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ అవార్డులు అందజేస్తారు.
SA20 2026 Winners: ముచ్చటగా మూడోసారి ఛాంపియన్గా సన్‌రైజర్స్..!
పద్మ అవార్డులు మూడు విభాగాలుగా ఉంటాయి. అసాధారణమైన, అత్యున్నత సేవలకు గాను ‘పద్మ విభూషణ్’ (Padma Vibhushan), ఉన్నత స్థాయి విశిష్ట సేవలకు పద్మ భూషణ్ (Padma Bhushan), ఇంకా ఏ రంగంలోనైనా ప్రతిభావంతమైన సేవలకు పద్మశ్రీ (Padma Shri) అవార్డ్స్ అందచేస్తారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రకారం 2026 సంవత్సరానికి మొత్తం 131 పద్మ అవార్డులు గెలుచుకున్నారు. ఇందులో పద్మ విభూషణ్ 5, పద్మ భూషణ్ 13 , పద్మశ్రీ 113 మందికి అందించనున్నారు.
ఈ ఏడాది పద్మ అవార్డుల జాబితాలో క్రీడా రంగానికి చెందిన ప్రముఖులకు ప్రాధాన్యం లభించింది. ముఖ్యంగా క్రికెట్ అభిమానులకు పండుగ లాంటి వార్త అని చెప్పవచ్చు. మాజీ భారత క్రికెట్ కెప్టెన్ రోహిత్ శర్మ, ప్రస్తుత భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్లకు ‘పద్మశ్రీ’ అవార్డులు ప్రకటించారు. భారత పురుషుల క్రికెట్‌లో విజయవంతమైన కెప్టెన్లలో రోహిత్ శర్మ ఒకరు. విధ్వంసకర బ్యాటింగ్‌తో అన్ని ఫార్మాట్లలో భారత జట్టుకు అనేక విజయాలు అందించాడు. అతని కెప్టెన్సీలో భారత్ T20 వరల్డ్ కప్ 2024, చాంపియన్స్ ట్రోఫీ 2025 గెలుచుకుంది. ఈ క్రమంలో అతడికి పద్మశ్రీ లభించడం క్రికెట్‌కు చేసిన సేవలకు తగిన గౌరవంగా నిలిచింది.
HYDRA DRF Rescue: అర్ధరాత్రి ఆపద.. తొమ్మిది మంది ప్రాణాలని కాపాడిన హైడ్రా DRF బృందం
అలాగే హర్మన్‌ప్రీత్ కౌర్ భారత మహిళా క్రికెట్‌కు కొత్త దిశ చూపిన నాయకురాలిగా గుర్తింపు పొందింది. ఆమె నాయకత్వంలో భారత మహిళా జట్టు స్వదేశంలో చారిత్రాత్మక వరల్డ్ కప్ టైటిల్‌ను సాధించి చరిత్ర సృష్టించింది. బ్యాటింగ్, దృఢమైన కెప్టెన్సీతో యువతరానికి ఆదర్శంగా నిలిచిన హర్మన్‌ప్రీత్‌కు పద్మశ్రీ తెచ్చి పెట్టింది. ఇక భారత టెన్నిస్ దిగ్గజం విజయ్ అమృత్ రాజ్ కు ఈసారి ‘పద్మ భూషణ్’ ప్రకటించారు. ఆటగాడిగా, క్రీడా నిర్వాహకుడిగా, అంతర్జాతీయ స్థాయిలో భారత టెన్నిస్‌కు అంబాసిడర్‌గా చేసిన సేవలకు ఈ గౌరవం దక్కింది.
భారత మహిళా హాకీ జట్టు గోల్‌కీపర్ సవితా పునియాకు పద్మశ్రీ లభించింది. అలాగే భారత రెజ్లింగ్ ఎదుగుదలలో కీలక పాత్ర పోషించిన జార్జియన్ కోచ్ వ్లాదిమిర్ మెస్ట్విరిష్విలికి మరణానంతరం పద్మశ్రీ ప్రకటించారు. ఆయన సుశీల్ కుమార్, యోగేశ్వర్ దత్, బజ్రంగ్ పునియా, రవి దహియా వంటి స్టార్ రెజ్లర్లను తయారు చేశారు.