Bhatti Vikramarka: తెలంగాణ బడ్జెట్ లో విద్యకు అధిక ప్రాధాన్యం ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రస్తుతం ఉన్న గురుకుల పాఠశాలలను సమర్థవంతంగా నిర్వహించడంతో పాటు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు చేయబోతున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. తెలంగాణలో 58 యంగ్ ఇండియా స్కూల్స్ నిర్మాణం, నిర్వహణ కోసం 11 వేల 600 కోట్ల రూపాయలను కేటాయిస్తుండటం.. చారిత్రాత్మకం అని ప్రకటించారు డిప్యూటీ సీఎం భట్టి.
Read Also: Delhi: పార్లమెంట్‌ను సందర్శించిన బిల్‌గేట్స్
ఇక, ఒక్కో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ను 20 నుంచి 25 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా విద్యను అందించే విధంగా వీటిలో ఆధునిక వసతులు కల్పిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఆడిటోరియాలు, డైనింగ్ హాల్స్, డిజిటల్ క్లాస్ రూమ్స్, క్రీడా మైదానాలు, క్రికెట్, ఫుల్ బాల్ గ్రౌండ్స్ లాంటి అనేక సదుపాయాలు ఈ పాఠశాలల్లో ఉంటాయన్నారు. ఈ స్కూల్స్ ఆవరణలోనే టీచర్లు, ఇతర ఇబ్బంది ఉండే విధంగా వాళ్లకు క్వార్టర్స్ కూడా నిర్మిస్తున్నట్లు తెలియజేశారు. ఈ స్కూళ్లలో విద్యుత్ కోసం సోలార్, విండ్ పవర్ ప్లాంట్లు ఏర్పాట్లు చేస్తున్నట్లు భట్టి విక్రమార్క చెప్పుకొచ్చారు.
Read Also: Lokesh vs Botsa: మేం క్షమాపణ చెప్పాలనడమేంటి?.. లోకేష్ వ్యాఖ్యలపై బొత్స ఫైర్!
అయితే, కుల మతాలతో సంబంధం లేకుండా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లలో విద్యాభ్యాసం చేస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ లో పిల్లలకు ఉచితంగా పుస్తకాలు, యూనిఫాం అందజేస్తాన్నారు. కాంపిటీషన్ కు తగ్గట్టు ఐఐటీ, జేఈఈ, నీట్ లాంటి పోటీ పరీక్షలకు పిల్లలకు సిద్ధం చేయనున్నట్లు తెలియజేశారు.