Poco X8 Pro Iron Man Edition: పోకో (Poco) సంస్థ నుంచి త్వరలో లాంచ్ కాబోతున్న పోకో X8 ప్రో (Poco X8 Pro) ఇప్పటికే పలు అంతర్జాతీయ సర్టిఫికేషన్ డేటాబేస్ లలో దర్శనం ఇచ్చింది. యూరప్ EEC, భారత BIS, SGS, ఇండోనేషియాలోని SDPPI తర్వాత తాజాగా థాయ్‌లాండ్ NBTC నుండి కూడా ఈ స్మార్ట్‌ఫోన్ సర్టిఫికేషన్ పొందింది. అయితే ఈసారి ప్రత్యేకత ఏమిటంటే ఈ సర్టిఫికేషన్ సాధారణ మోడల్‌కి కాకుండా Poco X8 Pro ఐరన్ మ్యాన్ ఎడిషన్ కు రావడం.
Hero Bikes Price Hike: సామాన్యులకు షాక్.. హీరో బైక్స్‌పై ధర పెంపు.. ఏ మోడల్‌కు ఎంత పెరిగిందంటే?
NBTC లిస్టింగ్ ప్రకారం ఈ ప్రత్యేక ఎడిషన్ మోడల్ నంబర్ 2511FPC34Gగా నమోదు అయింది. సర్టిఫికేషన్ డాక్యుమెంట్లలో డిజైన్ లేదా హార్డ్‌వేర్ వివరాలు వెల్లడికాలేదు. అయినప్పటికీ ‘Iron Man Edition’ అనే బ్రాండింగ్ ద్వారానే స్టాండర్డ్ వెర్షన్‌తో పాటు ఒక థీమ్‌డ్ ఎడిషన్‌ను కూడా పోకో ప్లాన్ చేస్తోందని అర్థమవుతుంది. ఇదివరకు పోకో X7 ప్రో కూడా ఐరన్ మ్యాన్ థీమ్‌తో వచ్చింది. అదే భాగస్వామ్యాన్ని ఈసారి కూడా కొనసాగిస్తున్నట్లు సమాచారం.
లాంచ్ టైమింగ్ కూడా పోకో రెగ్యులర్ సైకిల్‌కు అనుగుణంగానే ఉంది. Poco X7 Proను కంపెనీ జనవరి 2025లో విడుదల చేసింది. ఇక Poco X8 Proకు సంబంధించిన తొలి సర్టిఫికేషన్ జూలైలోనే కనిపించింది. ప్రస్తుతం జనవరి నెల నడుస్తుండటంతో ఈ స్మార్ట్‌ఫోన్ లాంచ్ అతి త్వరలోనే ఉండబోతుంది. లీకులు, రూమర్ల ప్రకారం పోకో X8 ప్రో చైనాలో త్వరలో విడుదల కానున్న రెడ్ మీ టర్బో 5కు రీబ్రాండెడ్ వెర్షన్‌గా ఉండొచ్చని సమాచారం. అంతేకాదు కొన్ని మార్కెట్లలో పోకో X8 ప్రో మ్యాక్స్ కూడా లాంచ్ అయ్యే అవకాశం ఉండనున్నట్లు సమాచారం.
ఫీచర్ల విషయానికి వస్తే ఈ రెండు మోడళ్లలో కూడా 1.5K రిజల్యూషన్ డిస్‌ప్లే ఉండే అవకాశం ఉంది. పనితీరు పరంగా పోకో X8 ప్రోలో MediaTek Dimensity 8500 చిప్‌సెట్ ఇవ్వనుండగా, Pro Max వేరియంట్‌లో మరింత Dimensity 9500 ప్రాసెసర్ అందించే అవకాశం ఉంది. సాఫ్ట్‌వేర్ పరంగా ఈ ఫోన్స్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత HyperOS 3తో లాంచ్ అవుతుందని లీకులు చెబుతున్నాయి.