తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ను శాసన సభలో ప్రవేశపెట్టబోతోంది. రాష్ట్ర వార్షిక బడ్జెట్ 2025-26 ను రాష్ట్ర కేబినెట్ ఆమోదించింది. అయితే ఈసారి బడ్జెట్ సమావేశానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దూరం కానున్నారు. ఈరోజు జరగబోయే బడ్జెట్ ప్రసంగానికి ప్రతిపక్ష నేత కేసీఆర్ గైర్హాజరు అవనున్నారు. గత సంవత్సరం బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు కేసీఆర్ సభకు హాజరయ్యారు. ఈసారి గవర్నర్ ప్రసంగానికి కేసీఆర్ హాజరయ్యారు. బడ్జెట్ ప్రసంగంతో పాటు చర్చలకు కూడా కేసీఆర్ దూరంగా ఉండనున్నారు.