Hero Bikes Price Hike: సామాన్య ప్రజల ఆలోచనకు తగ్గట్టుగా ఎన్నో కొత్త మోడల్ ను తీసుకవచ్చిన హీరో మోటోకార్ప్ ప్రజల ఆదరణను బాగానే పొందింది. అయితే ఇప్పుడు హీరో మోటోకార్ప్ భారత్‌లో తన 100–125సీసీ కమ్యూటర్ మోటార్‌సైకిళ్ల ధరలను కొద్దిగా పెంచింది. ఈ ధరల పెంపు HF 100, HF డీలక్స్, ప్యాషన్ ప్లస్, స్ప్లెండర్ ప్లస్ వంటి పాపులర్ మోడళ్లపై వర్తించనుంది. ఒక్కో బైకు కు గరిష్టంగా రూ.750 వరకు మాత్రమే పెంపు ఉండటంతో ఈ మార్పు కొనుగోలుదారులపై పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు.
Union Budget 2026: యుద్ధాలు, డబ్బులు, క్లైమేట్ ఛేంజ్.. బడ్జెట్ నుంచి Gen-Z ఏం ఆశిస్తోంది?
అయితే ధరలు పెంచిన కారణాన్ని హీరో అధికారికంగా వెల్లడించకపోయినా.. పెరిగిన ఉత్పత్తి ఖర్చులను భర్తీ చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇక ఏ మోడల్‌కు ఎంత ధర పెరిగిందన్న విషయానికి వెళితే.. హీరో మోటోకార్ప్ లైనప్‌లో అత్యంత చౌకైన కమ్యూటర్ బైక్ అయిన HF 100కు రూ.750 ధర పెరిగింది. తాజా ధరల ప్రకారం ఈ బైక్ ఎక్స్‌షోరూమ్ ధర రూ.59,489గా ఉంది. ఒక్కటే వేరియంట్ అయిన డ్రమ్ కిక్ క్యాస్ట్‌లో అందుబాటులో ఉన్న ఈ బైక్‌లో 97.2సీసీ సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. ఈ ఇంజిన్ 7.9 బీహెచ్‌పీ పవర్, 8.05 ఎన్‌ఎం టార్క్ ఉత్పత్తి చేస్తూ, 4-స్పీడ్ గేర్‌బాక్స్‌తో నగర ప్రయాణాలకు అనుకూలంగా రూపొందించారు.
Chicken vs Mutton: డయాబెటిస్ పేషెంట్లకు చికెన్ Vs మటన్ ఏది మంచిదో చూసేయండి!
హీరో HF డీలక్స్ కూడా ధర పెరిగిన మోడళ్లలో ఒకటి. ఆల్ బ్లాక్, కిక్ క్యాస్ట్, సెల్ఫ్ క్యాస్ట్, i3S క్యాస్ట్, ప్రో అనే ఐదు రకాల వివిధ వేరియంట్ లపై కూడా రూ.750 వరకు ధర పెంపు జరిగింది. తాజా ధరల ప్రకారం HF డీలక్స్ ఎక్స్‌షోరూమ్ ధర రూ.56,742 నుంచి రూ.69,235 వరకు ఉంది. అయితే ఎంట్రీ లెవల్ కమ్యూటర్ సెగ్మెంట్‌లో మంచి గుర్తింపు ఉన్న హీరో ప్యాషన్ ప్లస్‌కు మాత్రం స్వల్పంగా రూ.250 మాత్రమే ధర పెరిగింది. ఈ బైక్‌లో కూడా HF సిరీస్‌లో ఉపయోగించే అదే ఇంజిన్ ఉంటుంది. తాజా ధరల ప్రకారం ప్యాషన్ ప్లస్ డ్రమ్ బ్రేక్ వేరియంట్ ధర రూ.76,941 కాగా, 125 మిలియన్ ఎడిషన్ ధర రూ.78,324గా ఉంది.