భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ప్రజా చైతన్య సభలో రేణుకా చౌదరి మాట్లాడుతూ.. అన్నం పెట్టే పార్టీ కాంగ్రెస్ పార్టీ.. అనేక మంది నిరుపేదలకు ఇంటి స్థలాలు, పక్క గృహాలను ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని ఆమె తెలిపారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆ పార్టీ ఎమ్మెల్యేల మీద మరింత వ్యతిరేకత ఉంది.. ఎమ్మెల్యేలు నియంతలా.. సామంత రాజులు అనుకుంటున్నారు అని ఆయన విమర్శించారు.. ప్రభుత్వం వ్యతిరేక అంశాలు అన్ని జనంలోకి వెళ్ళాలి అని నల్గొండ ఎంపీ తెలిపారు.. ఎంత కష్టపడితే అంత మంచిది.. అక్టోబర్ 6న ఎన్నికల షెడ్యూల్ వస్తుంది.
తెలంగాణాలో 54 శాతం బీసీలు ఉన్నాం.. ప్రత్యేక మంత్రి శాఖను కేటాయించాలని సీఎం కేసీఆర్ ను కోరామని పీసీసీ మాజీ అధ్యక్షుడు హనుమంత రావు అన్నారు. అయినా, కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోలేదు అని ఆయన ఆరోపించారు. బీసీ గర్జన నిర్వహణ కోసం బీసీలను చైతన్యం చేసేందుకు రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు.. దీన్ని క్షేత్ర స్థాయికి తీసుకెళ్ళాను అని వీహెచ్ పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిక్లరేషన్ పై అభిప్రాయాలను తీసుకోవడానికి గాంధీభవన్ కు మంద కృష్ణ మాదిగ బృందం వెళ్లింది. ఈ సందర్భంగా ఏఐసీసీ ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రేతో పాటు పలువురు పార్టీ నేతలతో మంద కృష్ణ సమావేశం అయ్యారు. ఎస్సీలలో ఏ,బీ,సీ,డీ వర్గీకరణ విషయంలో కాంగ్రెస్ నాయకులకు ఆయన వినతిపత్రాలు ఇచ్చారు.
ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఇవాళ (మంగళవారం) లోక్సభలో చర్చ ప్రారంభం కానుంది. లోక్సభలో ఈ చర్చను కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రారంభిస్తారని ఆ పార్టీ నేతలు వెల్లడించారు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు రాహుల్ గాంధీ లోక్సభలో మాట్లాడనున్నారు.
కొల్లాపూర్లో ఈ నెల 30న నిర్వహించ తలపెట్టిన ప్రియాంక గాంధీ బహిరంగ సభ మరోసారి వాయిదా పడింది. భారీ వర్షాల కారణంగా ఈ సభను రద్దు చేస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది. దీంతో కాంగ్రెస్ పార్టీలో జూపల్లి కృష్ణారావు చేరిక మరింత ఆలస్యమవుతుంది.
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. అధికారంలో ఉన్న నాయకులు అవాకులు చవాకులు పేలుతున్నరు కాంగ్రెస్ పార్టీలో అనేక గ్రూపులున్నాయని.. ప్రతి గ్రామంలో రెండు మూడు గ్రూపులు ఉన్నాయి అందరూ తన్నుకుంటారని అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఖమ్మం జిల్లాలో సీనియర్ నాయకులు ఉన్నారు.. సీఎల్పీ నాయకులు భట్టి విక్రమార్క, కేంద్ర మాజీ మంత్రి రేణుక చౌదరి కలిసి ఓకే వేదక మీదకి వస్తామన్నారు. ఐక్యంగా మేము పోరాటం చేస్తామన్నారు.