బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆ పార్టీ ఎమ్మెల్యేల మీద మరింత వ్యతిరేకత ఉంది.. ఎమ్మెల్యేలు నియంతలా.. సామంత రాజులు అనుకుంటున్నారు అని ఆయన విమర్శించారు.. ప్రభుత్వం వ్యతిరేక అంశాలు అన్ని జనంలోకి వెళ్ళాలి అని నల్గొండ ఎంపీ తెలిపారు.. ఎంత కష్టపడితే అంత మంచిది.. అక్టోబర్ 6న ఎన్నికల షెడ్యూల్ వస్తుంది.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 70 సీట్లు గెలుస్తుంది అని ఉత్తమ్ కుమార్ రెడ్డి జోస్యం చెప్పారు.
Read Also: Anasuya Bharadwaj: ఏంట్రా మీరంతా అంటూ పరువు తీసేసిన అనసూయ
తెలంగాణలో బీజేపీ పోటీలో లేనే లేదు అని నల్గొండ ఎంపీ, మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆశావహులు అంతా.. జనంలో ఉండాలి.. ఇళ్లు ఇళ్లు తిరగాలి.. మీరు ఇంటి ఇంటికి తిరగడంతోనే విజయం సాధ్యం అవుతుందని ఈ సందర్భంగా ఉత్తమ్ చెప్పుకొచ్చారు. టికెట్ల విషయంలో ఏఐసీసీ సర్వే చేస్తోంది.. సర్వేలో మీ పేరు రావాలంటే.. మీరు పని చేయాల్సిందేనని ఆయన తెలిపారు. టికెట్ వస్తేనే పని చేస్తా అంటే కష్టం అని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.
Read Also: Fuel Prices: లోక్‌సభ ఎన్నికలకు ముందు ఇంధన ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి ఏం అన్నారంటే?
కాంగ్రెస్ పార్టీకి మైనార్టీలు సపోర్ట్ ఇస్తే విజయం మరింత సులువు అవుతుందని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కర్ణాటకలో 90 శాతం మైనార్టీలు కాంగ్రెస్ తో ఉన్నారు.. రూరల్ లో మైనార్టీలు పొలరైజ్ అయ్యే అవకాశం ఉంది.. తెలంగాణలో ప్రత్యేక పరిస్థితి ఉందని ఆయన వ్యాఖ్యనించారు. రాహుల్ గాంధీపై జోడో యాత్రతో అభిమానం పెరిగింది అని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.