Food Varieties: CWC గెస్టుల కోసం నోరూరించే వంటకాలు.. బిర్యానీతో సహా 78 వెరైటీలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Food Varieties: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సీడబ్ల్యూబీసీ సమావేశానికి అగ్రనేతలంతా హాజరయ్యారు. దేశంలో వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ ఎలాంటి వ్యూహాలు అనుసరించాలి, బీజేపీని ఎలా ఎదుర్కోవాలి అనే అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ప్రధానంగా.. త్వరలో ఐదు రాష్ట్రాల ఎన్నికలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. అయితే.. తెలంగాణలో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందన్న అంచనాలను పార్టీ క్యాడర్ లో నింపాలనే ఉద్దేశంతో దాదాపు 18 ఏళ్ల తర్వాత హైదరాబాద్ లో ఈ ప్రతిష్ఠాత్మక సభ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే.. ఈ సమావేశాలకు మల్లికార్జున ఖర్గేతోపాటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ హాజరయ్యారు. కాగా, ఈ సమావేశానికి వచ్చిన అతిథులకు ఘనంగా విందు ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు ప్లాన్ చేశారు. ఈ విందులో తెలంగాణ ప్రత్యేక వంటకాలతో పాటు హైదరాబాద్‌కు ప్రసిద్ధి చెందిన దమ్ బిర్యానీ కూడా వడ్డించనున్నారు. బిర్యానీ, మటన్, తలకాయ కూర, మొత్తం 78 రకాల వెరైటీ వంటకాలు మెనూలో ఉన్నాయి. ఉదయం టిఫిన్ నుంచి రాత్రి భోజనం వరకు అన్ని రకాల నోరూరించే వంటకాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ ప్రత్యేక వంటకాల కోసం తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి వంటవాళ్లను రప్పించినట్లు తెలుస్తోంది.
Also Read
మెనూ ఇదే..
►ఇడ్లీ, వడ, దోశ, పెసరట్టు, ఉగ్గని, కిచిడి, ఉప్మా, రాగులు, జొన్న సంగటి, పాయ పులుసు, ఖీమా రోటీ, మిల్లెట్ ఉప్మా, మిల్లెట్ వడ, ప్రూట్ సలాడ్ అల్పాహారంగా అందజేయబడతాయి.
►మధ్యాహ్న భోజనంలో హైదరాబాద్ దమ్ బిర్యానీ, హలీమ్, బగరా రైస్, కుర్మా, దాల్చా మటన్, స్పెషల్ చికెన్, మటన్ కర్రీ, చికెన్ ఫ్రై, తలకాయ కూర, లివర్ ఫ్రై, తెలంగాణ స్పెషల్ మటన్ కర్రీ, చింతచిగురు మటన్, గోంగూర మటన్, చేపలు వడ్డిస్తారు.
► శాఖాహారులకు పచ్చిపులుసు, గోంగూర చట్నీ, గుత్తి బెండకాయ, కొబ్బరి చట్నీ, అంబలి, దాల్చా, రోటీ చట్నీ ఉంటాయి.
► ఇరానీ చాయ్, ఉస్మానియా బిస్కెట్లు, సర్వా పిండి, వివిధ రకాల సమోసాలు, కుడ్లులు, మురుకులు, ఉడకబెట్టిన మొక్కజొన్నలు, సకినాలు, గారెలు స్నాక్స్ ఐటమ్స్‌గా రుచి చూపించనున్నారు.
Atrocity: ESI ఆసుప్రతిలో దారుణం.. లిఫ్ట్ లో యువతిని బంధించి అత్యాచారం
తాజావార్తలు
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్‌ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!