రాజస్థాన్లోని బికనీర్లో తన బహిరంగ ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ అంటే దోపిడీ దుకాణం, అబద్ధాల మార్కెట్ అని ప్రధాని మోడీ విమర్శలు గుప్పించారు.
కాంగ్రెస్ పార్టీకి చెందిన బీసీ నేతలు మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఇంట్ల సమావేశం అయ్యారు. ఈ మీటింగ్ లో మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య కామెంట్స్... పార్టీలో ఓబీసీ లకు సరైన గుర్తింపు, గౌరవం ఇవ్వాలి అని ఆయన డిమాండ్ చేశారు. బీసీలను విస్మరిస్తే..ఏ రాజకీయ పార్టీ అయినా మనగలగడం కష్టం.. ఈ విషయాన్ని కాంగ్రెస్ కూడా పరిగణనలోకి తీసుకోవాలి.. బీసీలు ఇతర రాజకీయ పార్టీలలో గెలుస్తున్నప్పుడు కాంగ్రెస్ లో ఎందుకు గెలవరు…
ఈసారి ఎలాగైనా తెలంగాణలో అధికారంలోకి రావాలని భావిస్తున్న కాంగ్రెస్.. గతానికి భిన్నంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఆపరేషన్ ఆకర్షన్తో పలువురిని పార్టీలోకి రప్పించే పనిలో ఉండగా... పొంగులేటి, జూపల్లితో పాటు ఇతర నేతలను పార్టీలోకి రప్పించటంలో విజయవంతం అయింది.