elangana Congress: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడినప్పటి నుంచి రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఓ వైపు పార్టీలు అభ్యర్థులను ప్రకటిస్తూనే మరోవైపు పార్టీ ఫిరాయించే వారి సంఖ్య పెరుగుతోంది.
కాంగ్రెస్ పార్టీ తొలి జాబితా విడుదల చేసేందుకు రంగం సిద్దమైంది. గత నెల రోజులుగా అభ్యర్థుల పేర్ల ప్రకటనకు రేపు మాపు అంటూ ఊరిస్తూ.. నేడు తొలి జాబితాను ప్రకటించేందుకు కాంగ్రెస్ పార్టీ రెడీ అయింది. తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ స్థానాల్లో దాదాపు సగం స్థానాలకు అభ్యర్థులను ఇవాళ ప్రకటించనుంది.
Big Breaking: ఎన్నికల వేళ తెలంగాణ కాంగ్రెస్‌కు గట్టి షాక్ తగిలింది. పీసీసీ మాజీ చీఫ్, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య పార్టీకి రాజీనామా చేశారు. పొన్నాల రాజీనామా చేస్తున్నట్లు ఖర్గే కి లేఖ రాశారు.
ఖమ్మం వెళ్తూన్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి నల్గొండ జిల్లా నకిరేకల్ లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. కల్వకుంట్ల కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుని డబ్బు సంచుల్ని దాచుకుంటుంది అని ఆయన ఆరోపించారు.
తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ సినిమా మా దగ్గర ఉంది.. చంద్రబాబు పని అయిపోగానే కాంగ్రెస్ గూటికి ఆయన వచ్చి చేరారు అంటూ ఓవైసీ పేర్కొన్నారు.
డీసీసీ అధ్యక్షుడు తిరుపతిరెడ్డి ఆదివారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. మెదక్ అసెంబ్లీ టిక్కెట్‌ను తిరుపతిరెడ్డి ఆశించారు. అయితే ఈ స్థానం నుంచి మైనంపల్లి హన్మంతరావు తనయుడు రోహిత్‌కు టిక్కెట్టు దక్కే అవకాశం ఉండటంతో కాంతారెడ్డి తిరుపతిరెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు.
ప్రధాని నరేంద్ర మోడీ రేపు (ఆదివారం) తెలంగాణలో పర్యటించబోతున్నారు. ఈ సందర్భంగా తన పర్యటనకు ముందు కాంగ్రెస్ , బీఆర్ఎస్లపై ఆయన విమర్శలు చేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ( ఎక్స్ ) వేదికగా తెలుగులో ట్వీట్ చేశారు.
కాంగ్రెస్ పార్టీ నుండి రేవంత్ రెడ్డిని సస్పెండ్ చేయాలని రాహుల్ గాంధీకి, మల్లికార్గున ఖర్గేకు కాంగ్రెస్ పార్టీ బహిష్కృత నేత కొత్త మనోహర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. వివరణ తీసుకోకుండా సస్పెండ్ చేయడంపై ఆయన మీడియా సమావేశంలో మండిపడ్డాడు.