RK Roja: రాజీనామా చేసి ఇంట్లో కూర్చోండి.. రోజా ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RK Roja: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా.. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆమె మాట్లాడుతూ.. రాజకీయాల్లో ఉన్న నాయకులు ప్రజలకు మంచి చేయాలని, అది చేయలేకపోతే రాజీనామా చేసి ఇంట్లో కూర్చోవాలని హితవుపలికారు.. దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దని ఇప్పటికే పలుమార్లు చెప్పినా కూడా కొంతమంది నాయకులు ఇంకా అదే విధంగా మాట్లాడుతున్నారని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు… సీబీఐ ద్వారా వచ్చిన రిపోర్ట్‌లో జంతు కొవ్వు కలిసిందనే ఆరోపణలు అసత్యమని పేర్కొన్నారు.
Read Also: Assam: అస్సాంలో విషాదం.. సుఖోయ్ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
Also Read
- Aqua Farmers: ఆక్వా రైతులకు మరోషాక్.. మూడు నెలల్లో రెండో సారి..
- AP Crime: ఏపీలో దారుణం.. మైనర్ బాలికపై రెండేళ్లుగా అత్యాచారం.. నలుగురిపై కేసు నమోదు
- Case Filed Against Janasena ZPTC: నమ్మించి మోసం చేశాడంటూ మహిళ ఫిర్యాదు.. జనసేన జడ్పీటీసీపై కేసు నమోదు..
- Agarbatti Scam: అగరబత్తీల తయారీ పేరుతో రూ. 25 కోట్ల కుచ్చు టోపీ.. జాగ్రత్త సుమీ.!
ఇక, ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, హోం మంత్రి స్థాయిలో ఉన్న నాయకులు కూడా దిగజారి మాట్లాడుతున్నారని చంద్రబాబు, పవన్ కల్యాణ్, అనితపై ఫైర్ అయిన రోజా.. ప్రజలు ఈ విషయాలు అన్నీ గమనిస్తున్నారని అన్నారు. శాసన మండలిలో చైర్మన్ స్థానంలో ఉన్న వ్యక్తి కులం, మతం గురించి మాట్లాడటం చాలా దిగజారిపోయిన చర్య అని ఆమె విమర్శించారు. ఉన్నత స్థానాల్లో ఉన్నవారు కులం, మతం చూడకుండా తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తున్నారా లేదా అనే దానిపైనే దృష్టి పెట్టాలని సూచించారు. మంత్రి అచ్చెన్నాయుడుపై కూడా రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి బాధ్యతాయుతంగా మాట్లాడాలని.. కానీ, అచ్చెన్నాయుడు ఎప్పుడైనా సక్రమంగా మాట్లాడారా? అని ప్రశ్నించారు.
రాష్ట్రంలోని ఆలయాల ప్రతిష్టను దెబ్బతీయే విధంగా కూటమి నేతలు వ్యవహరిస్తున్నారని రోజా ఆరోపించారు. ముఖ్యంగా తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి టెంపుల్, శ్రీశైలం ఆలయం, అన్నవరం సత్యనారాయణస్వామి టెంపుల్.. వంటి ప్రసిద్ధ ఆలయాల ప్రతిష్ట దెబ్బతినేలా మాట్లాడటం సరైంది కాదన్నారు. లడ్డూ వ్యవహారంపై తప్పు చేయలేదని భావిస్తే చర్చకు రావాలని రోజా సవాల్ విసిరారు. ఈ అంశాన్ని దారి మళ్లించడానికి కుల ప్రస్తావన తీసుకురావడం సరైంది కాదని ఆమె అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూటమి ప్రభుత్వానికి గట్టి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని రోజా వ్యాఖ్యానించారు. రాజకీయ ప్రయోజనాల కోసం దేవుళ్లను, దేవాలయాల ప్రసాదాన్ని ఉపయోగించి భక్తుల మనోభావాలను దెబ్బతీయొద్దని ఆమె సూచించారు.
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!