భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ప్రజా చైతన్య సభలో రేణుకా చౌదరి మాట్లాడుతూ.. అన్నం పెట్టే పార్టీ కాంగ్రెస్ పార్టీ.. అనేక మంది నిరుపేదలకు ఇంటి స్థలాలు, పక్క గృహాలను ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని ఆమె తెలిపారు. కానీ, అన్నం పెట్టే తల్లిని మోసం చేసిన కేసీఆర్ ది బీఆర్ఎస్ పార్టీ.. ఒక కుటుంబం ఆత్మహత్యకు కారకుడైన వారికి కొత్తగూడెం బీఆర్ఎస్ అసెంబ్లీ టికెట్ ఇవ్వడం దారుణమని ఆమె పేర్కొన్నారు.
Read Also: Posani Krishna Murali: నాకు ప్రాణహాని ఉంది.. డీజీపీకి పోసాని ఫిర్యాదు
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వంట గ్యాస్ సిలిండర్ ను 500 రూపాయలకే ఇస్తామని రేణుకా చౌదరి పేర్కొన్నారు. ఎన్నికల వేళ ఓట్ల కోసం డబ్బులు చేతిలో పెట్టి మోసం చేస్తారు.. వారి మాయ మాటలు నమ్మకండి.. పోయిన సారి కొత్తగూడెం నుంచి ఓ దుష్టుని గెలిపించాం.. ఈ సారి అలాంటి పొరపాటు చేయకండి అని ప్రజలను ఆమె కోరారు.
Read Also: Chandrayaan-3: ఉద్విగ్న క్షణాల్లో భారతావని.. షెడ్యూల్ కంటే ముందే ల్యాండింగ్ ప్రక్రియ
తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే, సామాన్యుడికి అందుబాటులో ఉండేది కాంగ్రెస్ పార్టే అని రేణుకా చౌదరి తెలిపారు. హస్తం గుర్తే అన్నదాతలకు, అన్ని వర్గాలకు అండగా ఉంటుంది.. ఈ కొత్తగూడెం నియోజకవర్గంలో బీసీకే టికెట్ ఇచ్చేలా కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి సిఫార్సు చేస్తా.. హస్తం గుర్తుకే ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చిన అభ్యర్థులనే గెలిపించాలి.. మహిళల కళ్ళల్లో పొగ చూసి ఇంటింటికి గ్యాస్ ఇచ్చానని గొప్పలు చెప్పుకునే.. ప్రధాని మోడీ భారీగా వంట గ్యాస్ ధరలను పెంచి ఈరోజు మహిళల కళ్ళెంట నీరు కారుతుంటే పట్టించుకోవట్లేదు అని రేణుకా చౌదరి విమర్శించారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ జిల్లా అని పలుమార్లు రేణుకా చౌదరి నినాదాలు చేశారు.