సంగారెడ్డి జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటించారు. జిల్లాలో నూతనంగా ప్రకటించిన తడ్కల్ మండలం కృతజ్ఞత సభలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ 6 గ్యారెంటీల కార్డ్ సంతకం లేని పోస్ట్ డేటెడ్ చెక్ లాంటిది అంటూ విమర్శించారు. 6 గ్యారెంటీలు ఏమో కాని కాంగ్రెస్ వస్తే మాత్రం 6 నెలలకు ఓ సీఎం వస్తారు.. హైదరాబాద్ లో కర్ఫ్యూ వస్తుంది.. కాంగ్రెస్ సెకండ్ హైకమాండ్ బెంగళూరులో తయారైంది.. ఢిల్లీకి కాంగ్రెస్ వాళ్లు క్యూ కడతారు అని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ వాళ్లు వస్తే రెండో రాజధాని బెంగళూరు అవుతుంది అంటూ ఆయన తెలిపారు.
Read Also: Meenakshii Chaudhary: కాటుక కళ్ళతో మనుసుదోచుకుంటున్న మీనాక్షి చౌదరి
కన్న తల్లికి అన్నం పెట్టలేనోడు పినతల్లికి బంగారు గాజులు కొనిస్తా అన్నట్టు కాంగ్రెస్ పార్టీ తీరు ఉంది అని హరీశ్ రావు అన్నారు. ఎంత సేపు కేసీఆర్ ని తిట్టుడే తప్పా వాళ్ళకి వేరే పని లేదు.. కాంగ్రెస్ మాయమాటలు నమ్మి ఆగం కావద్దు.. త్వరలో బీఆర్ఎస్ మేనిఫెస్టో విడుదల చేస్తాం.. బీఆర్ఎస్ మేనిఫెస్టో అద్భుతంగా ఉంటుంది అని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళని మించి ఉంటుంది.. కేసీఆర్ చెబితే చేస్తాడు.. మాట ఇస్తే మాట మీద నిలబడుతాడు.. లక్షా 10 వేలకు పైగా ఉన్న రుణాలను త్వరలోనే మాఫీ చేస్తామన్నాడు.
Read Also: Health ATM : దేశంలోనే మొదటి హెల్త్ ఏటిఎం మిషన్.. కేవలం 3 నిమిషాలలో 75 పరీక్షలు…
కాంగ్రెస్ వాళ్లు కొత్తగా మేనిఫెస్టో అంటూ బయలు దేరారు.. ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉచిత కరెంట్ అన్నాడు.. అది ఉచిత కరెంట్ కాదు ఉత్త కరెంట్ అయ్యింది అని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. కర్ణాటకలో మహిళలకు ఉచిత బస్ అన్నారు.. ఉన్న బస్సులు కూడా నడుస్తలేవు అంటూ మంత్రి హరీశ్ రావు సెటైర్ వేశాడు. కాంగ్రెస్ పార్టీని నమ్ముకుంటే కుక్క తోక పట్టి చెరువు ఈదినట్టే.. కాంగ్రెస్ వాళ్లు చెవిలో పువ్వులు పెడుతున్నారు.. బీఆర్ఎస్ పార్టీ అంటే మాట తప్పని పార్టీ.. మడమ తిప్పని పార్టీ అంటూ హరీశ్ రావు చెప్పుకొచ్చారు.