కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిక్లరేషన్ పై అభిప్రాయాలను తీసుకోవడానికి గాంధీభవన్ కు మంద కృష్ణ మాదిగ బృందం వెళ్లింది. ఈ సందర్భంగా ఏఐసీసీ ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రేతో పాటు పలువురు పార్టీ నేతలతో మంద కృష్ణ సమావేశం అయ్యారు. ఎస్సీలలో ఏ,బీ,సీ,డీ వర్గీకరణ విషయంలో కాంగ్రెస్ నాయకులకు ఆయన వినతిపత్రాలు ఇచ్చారు.
Read Also: Gautham Adani: అదానీ-హిండెన్‌బర్గ్ వ్యవహారం.. మరో 15 రోజులు గడువు కోరిన సెబీ
ఈ సందర్భంగా మంద కృష్ణ మాదిగ మాట్లాడుతూ.. మా ఆవేదన చెప్పడానికి గాంధీ భవన్ వచ్చాను అని తెలిపాడు. ఎస్సీ రిజర్వేషన్లు వర్గీకరణ చిలికల సమస్య కాదు.. దళితుల మధ్య జరుగుతున్న అసమానతలు సరిద్దిద్దే ప్రయత్నం మాత్రమే అని ఆయన వెల్లడించారు. వర్గీకరణ అంశం.. సామాజిక అంశంగా గుర్తించిందే కాంగ్రెస్.. అన్ని కులాలకు రిజర్వేషన్ ఫలాలు అందటం లేదని లోకూర్ కమిటీని కాంగ్రెస్ వేసిందని మంద కృష్ణ అన్నారు. వర్గీకరణ అమలు వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో సుప్రీంకోర్టు నిర్ణయంతో రద్దు అయ్యింది.. కానీ వర్గీకరణకి మద్దతుగా అసెంబ్లీలో తీర్మానం చేశారని ఆయన పేర్కొన్నాడు.
Read Also: MP Laxman: తెలంగాణ విముక్తి కై బీజేపీ పోరాటం
ఎస్సీ వర్గీకరణకు కమిషన్లు వేసిన కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు బిల్లు పెట్టలేదు అని మంద కృష్ణ అన్నారు.. బీజేపీ వర్గీకరణ చేస్తా అన్నది చెయ్యలేదు.. బీజేపీ మీద ఒత్తిడి పెంచండి అని రాహుల్ గాంధీని కలిశాను అని ఆయన తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒత్తిడి పెంచండి అంటూ లేఖ ఇవ్వలేదు.. కనీసం తెలంగాణ ఎంపీలు కూడా వర్గీకరణ విషయం అడగలేదు.. కోమటిరెడ్డి, ఉత్తమ్ బయట మద్దతు ఇస్తున్నారు.. కానీ పార్లమెంట్లో కనీసం మాట్లాడలేదు అని మంద కృష్ణ మాదిగా అన్నారు.
మొన్న పార్లమెంట్ లో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు వర్గీకరణ విషయం ఎందుకు ప్రస్తావించలేదు అని ఆయన అడిగారు.
Read Also: Delhi: ఢిల్లీలో బాంబు బెదిరింపుల కలకలం.. హై అలర్ట్ ప్రకటించిన అధికారులు..!
మాకు లిప్ సింపతినేనా..? అసెంబ్లీలో కేసీఆర్ ని భట్టి కూడా అడగలేదు.. అలాంటప్పుడు మేము ఎలా మద్దతి ఇవ్వాలి అని మంద కృష్ణ మాదిగ అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే సపోర్ట్ ఇస్తామని చెప్పాడు.. భవిష్యత్ కార్యచరణ ఉంటుంది అని మాట ఇచ్చారు.. వర్గీకరణకి మద్దతు ఇస్తే.. మేము అండగా ఉంటామని మంద కృష్ణ మాదిగ తెలిపారు.