Hrithik Roshan Birthday: సరైన సక్సెస్ కోసం హృతిక్ రోషన్ తపన!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hrithik Roshan Birthday: “మచో మేన్, గ్రీక్ గాడ్, బాలీవుడ్ ఆర్నాల్డ్” ఇత్యాది భుజకీర్తులతో భలేగా అలరిస్తూ వస్తున్నారు హృతిక్ రోషన్. ఆయన శరీరసౌష్టవం చూసి ఎంతోమంది అమ్మాయిలు హృతిక్ ను తమ కలల రాకుమారునిగా పట్టాభిషేకం చేసుకున్నారు. ఈ నాటికీ మగువలను అదే తీరున మురిపిస్తూ సాగుతున్నారు హృతిక్.
ఓ నాటి ప్రముఖ నటుడు రాకేశ్ రోషన్ తనయునిగా 1974 జనవరి 10న జన్మించారు హృతిక్ రోషన్. రాకేశ్ నటునిగా కొంతకాలం సక్సెస్ రూటులో సాగినా, తరువాత నిర్మాతగా, దర్శకునిగా అలరించారు. రాకేశ్ అన్న రాజేశ్ రోషన్ సంగీత దర్శకునిగా బాలీవుడ్ లో తనదైన బాణీ పలికించారు. ఇక రాజేశ్, రాకేశ్ తండ్రి రోషన్ ఓ నాటి మేటి సంగీత దర్శకులు. ఇలా తొలి నుంచీ సినిమా కుటుంబానికి చెందిన హృతిక్ రోషన్ సైతం చిన్నతనంలోనే చిత్రసీమలో రాణించాలని కలలు కన్నారు. “ఆశా, ఆప్ కే దీవానే, ఆస్ పాస్, భగ్ వాన్ దాదా” చిత్రాలలో బిట్ రోల్స్ లో కనిపించాడు హృతిక్. అయితే తండ్రి రాకేశ్, హృతిక్ ను ఓ క్రమశిక్షణతో పెంచారు. ముందు సినిమా నిర్మాణంలో పాలుపంచుకోమన్నారు. రాకేశ్ రోషన్ దర్శకత్వంలో రూపొందిన “ఖుద్ గర్జ్, కింగ్ అంకుల్, కరణ్ అర్జున్, కోయిలా” వంటి చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు హృతిక్. అప్పట్లో హృతిక్ తమ సినిమాల్లో నటించిన నటీనటులకు టీ కూడా అందించేవారు. సెట్ బోయ్ లో పనిచేశారు. ఇలా పలువిధాలా చిత్రసీమలో పయనం సాగించిన హృతిక్ ఒకప్పుడు ముద్దుగా బొద్దుగా ఉండేవాడు. అతనికి శరీర సౌష్టవాన్ని తీర్చిదిద్దుకొనేలా ఆసక్తి కలిగించినవారు హీరో సల్మాన్ ఖాన్. ఆపై సల్మాన్ సూచనలతోనే హృతిక్ తాను కూడా కండలవీరుడుగా మారాడు.
Also Read
Read Also: Shama Sikander: దేవుడా..అమ్మడి అందాల అరాచకానికి కుర్రకారుకు కునుకు పట్టేలా లేదే
తొలి చిత్రం ‘కహోనా ప్యార్ హై’తోనే హృతిక్ అందరి దృష్టినీ ఆకర్షించాడు. అప్పటికే హృతిక్ తండ్రి రాకేశ్ రోషన్ కు మీడియాతోనూ, రాజకీయంగానూ మంచి అనుబంధం ఉన్న కారణంగా, తనయుడిని స్టార్ గా నిలపడం ఆయనకు కష్టమేమీ కాలేదు. ఇక హృతిక్ రోషన్ పెళ్లి అయితే మూడు రోజుల పాటు టైమ్స్ ఆఫ్ ఇండియా వంటి లార్జెస్ట్ సర్క్యులేటెడ్ డెయిలీలోనే ఫ్రంట్ పేజీలను ఆక్రమించిందంటే అతనికి ఎలాంటి పబ్లిసిటీ లభించిందో అర్థం చేసుకోవచ్చు. ఓ నాటి సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, తరువాతి సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ తో కలసి హృతిక్ రోషన్ నటించిన ‘కభీ ఖుషీ కభీ ఘమ్’తో నటునిగానూ మార్కులు సంపాదించాడు. ‘లక్ష్య’ చిత్రంలో ప్రభుదేవా నేతృత్వంలో హృతిక్ చేసిన డాన్సులు జనాన్ని ఫిదా చేశాయి. ఇక తనయుడు హృతిక్ ను సూపర్ హీరోగా నిలపడానికి రాకేశ్ రోషన్ ‘క్రిష్’ సీరీస్ మొదలు పెట్టారు. తండ్రి అంచనాలను మించి హృతిక్ అలరించడం విశేషం. ‘ధూమ్’ సిరీస్ రెండో భాగంలో హృతిక్ సాగిన తీరు అనితరసాధ్యమనే అనిపిస్తుంది. ఇలా తెరపై చెలరేగిపోయిన హృతిక్ నిజజీవితంలో భార్య సుజన్నేకు దూరమయ్యాడు. అయినా తమ మధ్య స్నేహబంధం కొనసాగుతూనే ఉందని పలుమార్లు నిరూపించాడు. విడిపోయినా, పిల్లలను వారిద్దరూ చూసుకొనే తీరు అందరినీ ఆకర్షించింది.
Read Also: Veera Simha Reddy: ‘వీరసింహారెడ్డి’ – ‘వాల్తేరు వీరయ్య’ రెండూ రెండే..!
నవతరం కథానాయకుడు టైగర్ ష్రాఫ్ తో కలసి హృతిక్ నటించిన ‘వార్’ వసూళ్ళ వర్షం కురిపించింది. తమిళంలో ఘనవిజయం సాధించిన ‘విక్రమ్ వేద’ రీమేక్ లో హృతిక్ నటించాడు. గత సంవత్సరం విడుదలైన ‘విక్రమ్ వేద’ హిందీ వెర్షన్ అంతగా అలరించలేక పోయింది. ప్రస్తుతం హృతిక్ తాను నటిస్తోన్న ‘ఫైటర్’ పైనే ఆశలు పెట్టుకున్నాడు. కానీ, ఈ సినిమా వచ్చే సంవత్సరం వెలుగు చూడనుందని తెలుస్తోంది. మరి ఈ యేడాది అంతా హృతిక్ ఏం చేస్తాడో? ఏది ఏమైనా మునుపటిలా ఆకట్టుకోవడానికి హృతిక్ తపిస్తున్నాడు. ఆ తపనకు తగ్గ విజయం ఏ రోజున హృతిక్ తలుపు తడుతుందో చూడాలి.
తాజావార్తలు
-
Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
-
Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
-
Redmi K200 Series: Redmi K200 సిరీస్‌లో 7 ఇంచుల 2K డిస్‌ప్లే?.. హై రిఫ్రెష్ రేట్‌తో రానున్న కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లు!
-
Rashmika Mandanna : మరోసారి పుష్పరాజ్ అండ్ శ్రీవల్లి కాంబో ఆకట్టుకోబోతుందా..?
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!