ఇండియా చైనా దేశాల మధ్య 13 వ విడత చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ చర్చల్లో ఎలాంటి పురోగతి కనిపించలేదు. భారత్ ప్రతిపాదించిన ప్రతిపాదనలను చైనా తోసిపుచ్చింది. ఇక ఇదిలా ఉంటే చైనా మరో కొత్త కుట్రకు తెరలేపింది. భూటాన్ దేశంతో ఉన్న సరిహద్దు సమస్యను పరిష్కరించుకునేందుకు ముడు ప్రతిపాదనలు చేసింది. ఈ మూడు ప్రతి పాదనలకు భూటాన్ అంగీకారం తెలపడం భారత్‌కు ఇబ్బంది కలిగించే అంశంగా చెప్పవచ్చు. గత 37 ఏళ్లుగా భూటాన్, చైనా…
ప్రముఖ సాప్ట్వేర్ సంస్థ మైక్రోసాఫ్ట్ ఆధ్వర్యంలోని లింక్డిన్ కీలక నిర్ణయం తీసుకున్నది. ఇప్పటి వరకు చైనాలో తన కార్యకలాపాలు సాగిస్తున్న లింక్డిన్‌ను నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. చైనా ప్రభుత్వం టెక్ సంస్థలపై ఆంక్షలను విధిస్తున్నది. ఈ నేపథ్యంలో లింక్డిన్ చైనాలో కార్యకలాపాలు సాగించడం కష్టంగా మారింది. దీంతో సేవల్ని నిలిపివేయాలని నిర్ణయించింది. అయితే, ఉద్యోగాల కోసం ధరఖాస్తు చేసుకునేందుకు ప్రత్యేకంగా ఓ యాప్‌ను త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామని ప్రకటించారు. లింక్డిన్లోని సమాచారాన్ని నియంత్రించేందుకు ప్రయత్నించగా మైక్రోసాఫ్ట్ సంస్థ ఈ…
దేశం ఏదైనా కావొచ్చు… వేడుకల్లో బంగారం తప్పనిసరి. వారి సంప్రదాయాల ప్రకారం బంగారాన్ని ఆభరణాలుగా మలచుకొని ధరిస్తుంటారు. పొరుగుదేశం చైనాలో బంగారం వినియోగం ఎక్కువగా ఉంటుంది. పండుగలు, వేడుకలు, పెళ్లిళ్లకు పెద్దమొత్తంలో బంగారం వినియోగిస్తుంటారు. అయితే, ఇటీవలే హుబే ప్రావిన్స్‌కు చెందిన ఓ వధువుకు వివాహం జరిగింది. పెళ్లికూతురికి మంటపంలో వరుడు ఏకంగా 60 కిలోల బంగారాన్ని బహుకరించాడు. 60 కిలోల బరువైన ఆభరణాలకు వధువు ధరించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దేశంలో 10…
తూర్పు లద్దాఖ్‌లో నెలకొన్న ఉద్రిక్తతలు,బోర్డర్ లో ఉన్నసమస్యలు తగ్గించేందుకు ఇండియా చైనా దేశాల మధ్య కోర్ కమాండర్ స్థాయి చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆదివారం రోజున 13 వ కోర్ కమాండర్ స్థాయి చర్చలు జరిగాయి. అయితే, ఈ చర్చలు ఎలాంటి ఫలితాలు ఇవ్వలేదు. భారత్ చేసిన సూచనలను చైనా అంగీకరించలేదని, ఎటువంటి ప్రతిపాదనలు చేయలేదని ఇండియన్ ఆర్మీ ప్రకటించింది. ఈ చర్చలు ముగిసిన తరువాత చైనా మరోసారి భారత్ అనుసరిస్తున్న విధానలను, వ్యూహాలపై డ్రాగన్…
దక్షిణ చైనా సముద్రంలో చైనా దేశం ఆదిపత్యం సంపాదించేందుకు ప్రయత్నిస్తున్నది. ఈ జలాల పరిధిలోని దీవులు, దేశాలు తమవే అని వాదిస్తోంది. తైవాన్ను ఎలాగైనా దారిలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నది. తైవాన్‌కు రక్షణ కల్పించేందుకు అమెరికా ఆ దేశానికి సమీపంలో గువామ్ నావికాదళాన్ని ఏర్పాటు చేసింది. అమెరికాకు చెందిన అణుశక్తి జలాంతర్గామి యూఎస్ఎస్ కనెక్టికట్ ఈ జలాల్లో పహారా కాస్తుంటుంది. దక్షిణ చైనా సముద్రంలోని అంతర్జాటీయ జలాల్లోకి ప్రవేశించే సమయంలో ఈ జలాంతర్గామి ప్రమాదానికి గురైంది.…
ఇప్పటి వరకు లద్దాఖ్‌లో అలజడులు సృష్టించిన చైనా కన్ను ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్‌పై పడింది. అరుణాచల్ ప్రదేశ్ తమ దేశంలోనిదే అని చెప్పి ఎప్పటి నుంచే చైనా వాదిస్తూ వస్తున్నది. ఇండియా అందుకు ఒప్పుకోకపోవడంతో రెండు దేశాల మధ్య అరుణాచల్ ప్రదేశ్ వివాదం నడుస్తున్నది. ఇండియన్ ఆర్మీ అరుణాచల్ ప్రదేశ్ చైనా బోర్డర్లో నిత్యం బలగాలు పహారా కాస్తుంటాయి. అయితే, చైనాకు చెందిన 200 మంది జవానులు అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ ప్రాంతంలోకి చొచ్చుకు వచ్చారు. తవాంగ్‌లో…
విద్యుత్ సంక్షోభంతో చైనాలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పుడు అదే పరిస్థితి ఇండియాలో కూడా రానుందా…? అనే చర్చ మొదలైంది.. దేశంలో వినియోగిస్తున్న విద్యుత్ లో 70 శాతం విద్యుత్ ని బొగ్గుతోనే తయారు చేస్తున్నారు. ఇక బొగ్గు ద్వారా విద్యుత్ ను ఉత్పత్తి చేసే ప్రభుత్వ పవర్ ప్లాంట్ లలో గత కొన్ని రోజులుగా బొగ్గు నిల్వలు అడుగంటిపోతున్నాయి. దేశంలో 130 కి పైగా థర్మల్ పవర్ ప్లాంట్స్ ఉంటే వాటిలో 70 కి పైగా…
దక్షిణ చైనా సముద్రంలో చైనా తన ప్రాబల్యాన్ని పెంచుకుంటోంది. చుట్టుపక్కల ఉన్న చిన్న దేశాలపై ఆధిపత్యం సంపాదించేందుకు ప్రయత్నిస్తోంది. ఎప్పటినుంచో తైవాన్‌పై కన్నేసిన చైనా ఇప్పుడు ఆ దేశాన్ని ఆక్రమించుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. తరచుగా చైనా యుద్ధ విమానాలు తైవాన్ బోర్డర్ వరకు వెళ్లి వస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం 30 యుద్దవిమానాలు తైవాన్ బొర్డర్లో ఎగురుతూ కనిపించాయి. కాగా, తాజాగా 52 యుద్ధవిమానాలు తైవాన్ సరిహద్దులు దాటి లోనికి ప్రవేశించినట్టు తైవాన్ రక్షణశాఖ మంత్రి తెలిపారు.…
చైనాలో రియల్ ఎస్టేట్ రంగం ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఎవర్ గ్రాండే సంస్థ అప్పుల్లో కూరుకుపోవడంతో రియాల్టి రంగం అతలాకుతలం అయింది. 9 కోట్ల మందికి సరిపడా ఇళ్లు ప్రస్తుతం చైనాలో ఖాళీగా దర్శనం ఇస్తున్నాయి. 1970 తరువాత ప్రజలు వ్యవసాయం కంటే ఇతర వృత్తులపై దృష్టిపెట్టడంతో పట్టణాలు, నగరాల సంఖ్య క్రమంగా పెరుగుతూ వచ్చింది. దీంతో రియాల్టీ రంగం ఊపందుకుంది. 40 ఏళ్ల కాలంలో అనేక కొత్త పట్టణాలు, నగరాలు వెలిశాయి. దానికి తగ్గట్టుగానే రియాల్టీ…
తైవాన్ సరిహద్దుల్లో మళ్లీ రడగ మొదలైంది. చైనాకు చెందిన 30 యుద్ధ విమానాలు తైవాన్ సరిహద్దుల్లోకి చొరబడ్డాయి. నెల రోజుల వ్యవధిలో 60సార్లు చైనా విమానాలు చొరబడినట్టు తైవాన్ పేర్కొన్నది. దీనిని ధీటుగా ఎదుర్కొనేందుకు తైవాన్ కుడా మిలటరీ ఆపరేషన్‌ను నిర్వహించింది. తైవాన్ యుద్ధ విమానాలు విన్యాసాలను ప్రదర్శించాయి. తైవాన్ పై చైనా ఆధిపత్యాన్ని సాగనివ్వబోమని మరోసారి తైవాన్ స్పష్టం చేసింది. తైవాన్ తమ భూభాగమే అని ఇప్పటికే చైనా ప్రకటిస్తూ వస్తున్నది. దానికి తైవాన్ అంగీకరించడం…