గత కొంతకాలంగా చైనా, తైవాన్ దేశాల మధ్య ఉద్రిక్తకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. తైవాన్ తమ భూభాగంలో భాగమే అని, తప్పని సరిగా ఆ దేశాన్ని స్వాధీనం చేసుకుంటామని చైనా చెబుతూ వస్తున్నది. కొన్ని రోజులుగా తైవాన్ సరిహద్దు ప్రాంతంలో చైనా జెట్ విమానాలు కనిపిస్తున్నాయి. త్వరలోనే చైనా ఆ దేశాన్ని ఆక్రమించుకునే అవకాశం ఉన్నట్టు అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు. అయితే, తైవాన్‌పై డ్రాగన్ దాడిచేస్తే తైవాన్‌కు అండగా పోరాటం చేస్తామని అమెరికా ప్రకటించింది. ఇప్పటి వరకు ఈ విషయంలో మౌనం వహిస్తూ వస్తున్న అమెరికా మొదటిసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం విశేషం. తైవాన్ విషయంలో తమ నిర్ణయం మారదని, ఆ దేశం తరుపున పోరాటం చేస్తామని అమెరికా స్పష్టం చేసింది. ఒకవేళ డ్రాగన్ తమపై దాడులు చేస్తే తిరిగి దాడులు చేస్తామని తైవాన్ తెలియజేసింది.
Read: ఈ పురుగుల పచ్చళ్లు, ఐస్‌క్రీమ్‌లు అక్కడ యమా ఫేమస్…