అమెరికాతో సహా పలు దేశాలు చైనాను హెచ్చరిస్తున్నప్పటికీ తైవాన్ విషయంలో వెనక్కి తగ్గడంలేదు. తైవాన్‌కు అంతర్జాతీయ గుర్తింపు లేదని, ఆ దేశం చైనాలో కలిసిపోవడం తప్ప మరో గత్యంతరం లేదని చైనా మరోసారి స్పష్టం చేసింది. చైనా విదేశాంగ మంత్రి వాంగ్యూ జీ 20 దేశాల సదస్సులో ఈ విషయాన్ని తెలియజేశారు. వన్ చైనాను 50 ఏళ్ల క్రితమే అమెరికా అడ్డుకోలేకపోయిందని, ఈ విషయంలో ఎవరు అడ్డు తగలాలని చూసినా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చైనా…
కరోనా మహమ్మారికి పుట్టినిల్లు అయిన చైనా నుంచి అక్రమంగా అన్ని దేశాలకు ఆ మహమ్మారి విస్తరించింది.. ఆ తర్వాత అన్ని ప్రయాణాలపై దాని ప్రభావం స్పష్టంగా కనిపించింది.. ఇక, అంతర్జాతీయ విమాన సర్వీసులు.. ఇప్పటికీ ప్రారంభం కాలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.. కొన్ని ఎంపిక చేసిన సర్వీసులు, ఎంపిక చేసిన రూట్లలోనే నడుస్తున్నా.. రెగ్యులర్ సర్వీసుల మాత్రం అందుబాటులోకి వచ్చిందిలేదు. ఇక, అంతర్జాతీయ విమాన సర్వీసుల విషయంలో చైనా కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది మార్చితో…
మొన్న లద్దాక్..నేడు తవాంగ్ ప్రాంతాల్లో చైనా సైన్యాన్ని మోహరిస్తుంది. దీంతో చైనా దూకుడుకు చెక్ పెట్టేందుకు చైనా సరిహద్దుల్లో భారీ బందోబస్త్‌ను భారత్ ఏర్పాటు చేస్తోంది. గత ఏడాది కాలంగా ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గకపోవడంతో భారత్ భూటాన్, టిబెట్‌లకు ఆనుకుని ఉన్న తవాంగ్ ప్రాంతం పై చైనా కన్ను పడింది. ఎలాగైనా ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకోవాలని దురుద్దేశపూర్వకంగా అక్కడి ప్రాంతాల్లో సైన్యాన్ని మోహరిస్తుంది. దీంతో చైనాకు ధీటుగా జవాబు చెప్పేందుకు అమెరికా తయారు చేసినా…
కరోనాకు పుట్టినిల్లు చైనా. చైనాలోని ఊహాన్ నగరంలో తొలి కరోనా కేసులు నమోదయ్యాయి. ఆ తరువాత కరోనా ప్రపంచవ్యాప్తమైంది. కోట్లాది మంది కరోనా బారిన పడ్డారు. లక్షలాది మంది మృతి చెందారు. ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోయాయి. రెండేళ్లుగా ప్రపంచాన్ని ఈ సమస్య పట్టిపీడిస్తూనే ఉన్నది. ఈ సమస్య నుంచి బయటపడేందుకు వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినా కేసులు కంట్రోల్కావడం లేదు. కరోనా కొత్తగా రూపాంతరం చెందుతూ ఎటాక్ చేస్తున్నది. తిరిగి తిరిగి మళ్లీ అక్కడికే వచ్చినట్టుగా కరోనా కేసులు…
ప్రపంచంలో ఎక్కువ ఎత్తైన భవనాలు ఉన్న దేశం చైనా. భవనాలు, రోడ్లు నిర్మించే విషయంలో ఆ దేశం ముందు వరసలో ఉన్నది. రియాల్టీ సంస్థలు గత కొంత కాలంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాయి. దీంతో చైనా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. దేశంలో అనేక పట్టణాల్లో వృథా ప్రాజెక్టులు అనేకం ఉన్నాయి. వృథా ప్రాజెక్టులను అణిచేవేసే ఉద్దేశంతో చైనా ప్రభుత్వం కఠినమైన నిబంధనలు అమలులోకి తీసుకొచ్చింది. ఈ నిబంధనల ప్రకారం, 3 మిలియన్ జనాభా కంటే తక్కువ జనాభా…
తైవాన్ పై చైనా ఎప్పటి నుంచో కన్నేసింది. జియాంగ్ అధ్యక్షుడిగా ఎంపికయ్యాక రాజ్యాధికార కాంక్ష పెరిగిపోయింది. ఆర్ధిక, సైనిక శక్తిని పెంచుకున్నది. తన దేశాన్ని విస్తరించుకోవాలని చైనా చూస్తున్నది. చుట్టుపక్కల దేశాల సరిహద్దుల్లో రోడ్డు, భవనాలు, ఇతర మౌళిక వసతుల నిర్మాణాల ఏర్పాటు పేరుతో ప్రవేశిస్తు అక్కడ బలాన్ని పెంచుకొని ఆ ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకుంటోంది చైనా. ఆఫ్రికాలోని అనేక ప్రాంతాల్లో అత్యధిక మొత్తంలో పెట్టుబడులు పెడుతూ వాటిని తన కంట్రోల్లోకి తెచ్చుకుంటోంది. ఇప్పుడు తన…
కరోనా పుట్టినిల్లు చైనాలో మళ్లీ కరోనా వైరస్ విజృంభిస్తోంది. దీంతో కొన్నిరోజులుగా అక్కడ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన యంత్రాంగం పలు చర్యలు చేపట్టింది. చైనా వ్యాప్తంగా సోమవారం 29 కరోనా కేసులు నిర్ధారణ కాగా.. అందులో ఆరు కేసులు చైనా వాయువ్య ప్రావిన్సు గాన్సు రాజధాని లాన్‌జౌలో నమోదయ్యాయి. దీంతో 40 లక్షల జనాభా గల లాన్జౌ నగరంలో లాక్డౌన్ విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రజలు అత్యవసరం అని భావిస్తే మాత్రమే ఇళ్ల…
ఎప్పుడూ ఎవరూ కూడా ఉచితంగా ఎలాంటి సలహాలు, సూచనలు ఇవ్వకూడదు. ఒకవేళ అలా సలహాలు ఇవ్వాలి అనుకుంటే ప్రజాస్వామ్యం అమలులో ఉన్న దేశాల్లో ఇవ్వొచ్చు. అంతేగాని, చైనాలాంటి దేశాల్లో ఉచితంగా సలహాలు ఇస్తే ఏం జరుగుతుందో, ఎంత నష్టాన్ని మూటగట్టుకోవాల్సి వస్తుందో జాక్‌మా వంటి వ్యక్తులకు బాగా తెలుసు. జాక్‌మా చైనా జెయింట్ దిగ్గజ సంస్థ అలిబాబా వ్యవస్థాపకుడు. ఆయన రోజువారి ఆదాయం వందల కోట్ల రూపాయలు ఉంటుంది. అయితే, అక్టోబర్ 24, 2020న ది బండ్…
ప్రస్తుతం చైనాలో కరోనా విజృంభిస్తుంది. తొలిసారి వైరస్ వెలుగు చూసిన చైనాలో మళ్లీ కేసులు పెరగడంతో ప్రపంచదేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అత్యంత వేగంగా వ్యాపించే డెల్టా వేరియంట్‌తో ఆదేశంలో కేసులు పెరుగుతున్నాయి. 11కు పైగా ఫ్రావిన్స్‌లలో కేసులు నమోదు అవుతున్నాయి. ప్రస్తుతం కేసులు కట్టడి చేస్తున్నా సమీప భవిష్యత్‌లో కేసులు ఒక్కసారిగా పెరిగే అవకాశముందని స్థానిక అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కరోనా వైరస్ అంటే మొదట గుర్తుకు వచ్చేది చైనానే. ప్రపంచాన్ని వణికించిన ఈ…
గత కొన్ని రోజులుగా హైపర్ సోనిక్ క్షిపణుల ప్రయోగాలకు సంబంధించిన వార్తలు మీడియాలో ప్రసారం అవుతున్నాయి. చైనా హైపర్ సోనిక్ క్షిపణిని ఆగస్టులో ప్రయోగించింది. ఈ ప్రయోగానికి సంబంధించిన సమాచారాన్ని ఆ దేశం రహస్యంగా ఉంచి, అక్టోబర్‌లో బహిర్గతం చేసింది. దీంతో యావత్ ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రాడార్లకు అందకుండా భూమిచట్టూ ఈ క్షిపణి ప్రదక్షిణ చేసి టార్గెట్‌కు 30 కిలోమీటర్ల దూరంలో పడిండి. అయితే, రాడార్లకు అందకుండా ఈ హైపర్ సోనిక్ క్షిపణులు టార్గెట్‌ను ఛేదిస్తుంటాయి.…