కరోనా మహమ్మారికి పుట్టినిల్లు ఏది అంటే అంతా చైనా పేరును చెబుతారు.. మొదట్లో ఆ ఆదేశాన్ని కలవరానికి గురిచేసిన కోవిడ్ 19.. అన్ని దేశాల్లో ఆందోళనకర పరిస్థితికి చేరుకునేసరికి.. అక్కడ మాత్రం ఏమీ లేకుండా పోయింది. అయితే, అప్పుడప్పుడు.. కొత్త వేరియంట్లు వెలుగు చూస్తూ డ్రాగన్ కంట్రీని షేక్ చేస్తూన్నాయి. ఇప్పటికే పలు దాపాలుగా చైనాను మహమ్మారి పలకరించిపోయింది.. తాజాగా.. మరోసారి కలవరం సృష్టిస్తోంది.. దీంతో, కట్టడి చర్యలకు దిగింది కమ్యూనిస్టు సర్కార్.. వందలాది విమాన సర్వీసులను రద్దు చేసింది, స్కూళ్లను మూసివేసింది.. ఇదే సమయంలో కరోనా నిర్ధారణ పరీక్షలను పెద్ద సంఖ్యలు పెంచింది. కోవిడ్ కేసులు తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ఆంక్షలు విధించింది.
తాజాగా డ్రాగన్ కంట్రీలో వృద్ధ దంపతులు సహా చాలా మంది పర్యాటకులకు కరోనా పాజిటివ్‌గా తేంది.. వీరంతా షాంఘై నుంచి మొదలై గ్జియాన్, గాన్సు ప్రావిన్స్, ఇన్నర్ మంగోలియాలో పర్యటించినట్టు గుర్తించారు.. దీంతో రాజధాని బీజింగ్ సహా ఐదు ప్రావిన్స్‌ల్లో పెద్దఎత్తున ప్రజలతో కాంటాక్టు అయినట్టు కూడా నిర్ధారణకు వచ్చి చర్యలు చేపట్టింది చైనా… ఆయా ప్రాంతాల్లో విహార కేంద్రాలు, పర్యాటక ప్రాంతాలను మూసివేసి లాక్‌డౌన్ ప్రకటించాయి. వాటిలో భాగంగా 40 లక్షలకు పైగా జనాభా ఉన్న లాన్‌జూ నగరంలో అవసరమైతే తప్ప బయటకు రావొద్దంటూ కఠిన ఆంక్షలు విధించింది ప్రభుత్వం.. ఇక, గ్జియాన్, లాన్‌జూల్లో 60 శాతం విమాన సర్వీసులను రద్దు చేసిన అధికారులు.. ఇన్నర్ మంగోలియాలోని ఎరెన్‌హట్‌కు రాకపోకలను నిలిపివేశారు. కాగా, డ్రాగన్ కంట్రీలో వరుసగా ఐదో రోజు కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి.. గురువారం 13 మందికి పాజిటివ్‌గా తేలగా.. అధిక కేసులు ఈశాన్య, వాయువ్య ప్రాంతాలకు చెందినగా అధికారులు చెబుతున్నారు.