ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ ప్రభుత్వం ఏర్పాటు జరిగిన తరువాత పాక్, రష్యా, చైనా దేశాలకు చెందిన ఎంబసీలు మినగా మిగతా దేశాలకు చెందిన ఎంబసీలను మూసేసిన సంగతి తెలిసిందే. ఆఫ్ఘన్లో ప్రజాప్రభుత్వం కుప్పకూలిపోడంతో ఆ దేశం ఆర్థికంగా అనేక ఇబ్బందులు పడుతున్నది. తాలిబన్ ప్రభుత్వాన్ని గుర్తించాలని, ఆర్థికంగా సహాయం చేయాలని కోరారు. ఇందులో భాగంగా చైనా ముందుకు వచ్చి 30 మిలియన్ డాలర్ల సహాయం చేస్తామని హామీ ఇచ్చింది. తొలి విడతగా చైనా ఆఫ్ఘనిస్తాన్లోని శరణార్థుల కోసం దుప్పట్లు,…
కరోనా మహమ్మారి పుట్టినిల్లుగా పిలుస్తున్న చైనాలో కరోనా కేసులు తగ్గినట్లే తగ్గి మళ్లీ విజృంభిస్తున్నాయి. దీంతో కేసులను నియంత్రించేందుకు అక్కడి ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ఒకరిద్దరికి పాజిటివ్‌గా నిర్ధరణ అయినా.. వేల మందికి పరీక్షలు చేస్తోంది. మరోవైపు ఉత్తర చైనాలోని హార్బిన్ పట్టణానికి చెందిన మూడు పిల్లులకు కోవిడ్ పాజిటివ్‌గా తేలడంతో వాటిని అధికారులు చంపేశారు. కరోనా సోకిన జంతువులకు చికిత్స లేకపోవడం.. వాటి ద్వారా యజమానులు, అపార్ట్మెంట్ వాసులకు ప్రమాదం పొంచిఉన్న కారణంగా తప్పని…
చైనా కంపెనీలు కొత్త కొత్త పద్ధతిలో మన దేశ ఆర్ధిక మూలాలు దెబ్బ కొడుతున్నాయి.. చైనా కంపెనీలు ఆర్థిక ఉగ్రవాదానికి పాల్పడుతున్నాయి. మన దేశ సంపదను మనకు తెలియకుండానే కొల్లగొడుతున్నాయి. చైనా లోని ఆప్స్ వ్యవహారం వెనకాల అక్కడి చెందిన పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నట్టుగా అధికారం విచారణలో బయటపడింది. అంతేకాకుండా దేశంలోకి వివిధ వస్తువులను దిగుమతి చేసుకుంటున్నామని చెప్పి పెద్ద మొత్తంలో మోసాలకు పాల్పడుతున్న రు..వస్తువులను దిగుమతి చేసుకున్న వారు చెప్పి దాని పేరు మన…
చైనాలో ఎవర్ గ్రాండ్ సంక్షోభం మరవక ముందే మరోక సంక్షోభం బయటకు వచ్చింది. కరోనా నుంచి చైనా బయటపడుతున్న సమయంలో అన్ని రంగాలు తిరిగి తెరుచుకున్నాయి. దీంతో కరెంట్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. కరెంట్ వినియోగం పెరిగిపోవడంతో తీవ్రమైన కొరత ఏర్పడింది. వాణిజ్య పరమైన విద్యుత్ వినియోగం పెరగడంతో చివరకు వీధిలైట్లకు కూడా విద్యుత్‌ను కట్ చేశారు. 2020 తో పోలిస్తే 2021లో వినియోగం 13శాతం పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి. డిమాండ్‌కు తగినంతగా విద్యుత్ సరఫరా లేకపోవడంతో…
ఆఫ్ఘనిస్తాన్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తాలిబన్లు ప్రపంచ గుర్తింపు కోసం ప్రయత్నం చేస్తున్నారు. మద్దతును కూడగట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే తాలిబన్లకు పాక్ ప్రభుత్వం అండగా నిలిచింది. ప్రభుత్వం ఏర్పాటులో ఆ దేశం కీలక పాత్ర పోషించినట్టు ఇప్పటికే అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అయితే, దోహ ఒప్పందం ప్రకారం సమీకృత ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. కానీ, ఆఫ్ఘనిస్తాన్ దానికి విరుద్ధంగా తాలిబన్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ప్రభుత్వంలో హమీద్ కర్జాయ్, అబ్దుల్లా అబ్దుల్లా వంటి సీనియర్…
చైనాలో రియల్ ఎస్టేట్ దిగ్గజం ఎవర్ గ్రాండే పెద్ద 300 బిలియన్ డాలర్ల ఎప్పుతో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఏ క్షణంలో అయినా ఈ కంపెనీ దివాళా తీసే అవకాశం ఉండటంతో చైనాలోని రియల్ ఎస్టేట్ కంపెనీలు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లు వాటిని ఉపసంహరించుకుంటున్నారు. దీంతో ఓ వెలుగు వెలిగిన దిగ్గజ రియల్ కంపెనీల షేర్లు ఒక్కసారిగా కుదేలయ్యారు. లక్షల కోట్ల రూపాయలు క్షణాల వ్యవధిలో హాం ఫట్ అయ్యింది. చైనాకు చెందిన…
ఒకప్పుడు అమెరికా రష్యా దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. రెండు దేశాల మధ్య పచ్ఛన్నయుద్ధం జరిగింది. అయితే, 1991 దశకంలో యూఎస్ఎస్ఆర్ విచ్చిత్తి కావడంతో రష్యా ఆర్థికంగా కుదేలయింది. దీంతో అమెరికా తిరుగులేని శక్తిగా ఎదిగింది. అయితే, గత రెండు దశాబ్దాల కాలంగా ఆసియాలో చైనా ఆర్థికంగా క్రమంగా ఎదుగుతూ వచ్చింది. ఇప్పుడు ప్రపంచంలో అమెరికా తరువాత రెండో బలమైన ఆర్థిక వ్యవస్థగా మారింది. ఇప్పుడు అమెరికాను సవాల్ చేసే స్థాయికి ఎదగడంతో అమెరికా, చైనా…
కరోనా మహమ్మారి ఆర్థిక వ్యవస్థను కుదిపేసింది.. ఇప్పటికీ చాలా దేశాలు దానిని నుంచ బయటపడలేకపోతున్నాయి.. ఈ తరుణంలో చైనాకు చెందిన ఎవర్‌గ్రాండే దివాలా అంచుకు చేరింది. ఈ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా 300 బిలియన్ డాలర్ల వరకు చెల్లింపులు చేయాల్సి ఉంది. చైనా జంక్ బాండ్స్ ఈల్డ్ ఒక్కసారిగా 14.4 శాతానికి పెరగడం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. 2008లో 600 బిలియన్ డాలర్లకు దివాలా తీసిన అమెరికా సంస్థ లేమన్ బ్రదర్స్ తర్వాత.. ఇదే అతిపెద్ద సంక్షోభం…
ప్రపంచంలో అతిపెద్ద దివాలా తీసిన కంపెనీ ఏది అంటే అమెరికాకు చెందిన లేమన్ బ్రదర్స్ అని చెప్తాం. ఈ కంపెనీ 2008 లో 600 బిలియన్ డాలర్ల దివాళా తీసింది. అప్పట్లో ఈ కంపెనీ దివాళా కారణంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ కుదేలయింది. కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. అలాంటి సంక్షోభం ఇప్పుడు చైనా నుంచి రాబోతుందా అంటే అవుననే అంటున్నారు నిపుణులు. చైనా జీడీపీలో 29శాతం రియల్ ఎస్టేట్ నుంచే వస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో…
దక్షిణాసియాలో చైనా రోజురోజుకు తన దూకుడును పెంచుతున్నది. సైనిక బలగాన్ని పెంచుకుంటూ దక్షిణ సముద్రంతో పాటుగా ఇతర దేశాలపై కూడా తన ఆధిపత్యాన్ని పెంచుకోవాలని చూస్తున్నది. ఇందులో భాగంగానే పాక్, శ్రీలంకతో పాటుగా ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ పైకూడా చైనా కన్నుపడింది. అటు హాంకాంగ్, వియాత్నం కూడా తమవే అని చెప్తున్నది. రోజు రోజుకు చైనా తన బలాన్ని పెంచుకుంటుండటంతో అమెరికా ఆందోళన వ్యక్తం చేస్తున్నది. ఆసియాలోని ఇండియా, జపాన్, అస్ట్రేలియాతో కలిసి ఇప్పటికే క్వాడ్ కూటమిని ఏర్పాటు…