రెండేళ్ల క్రితం 2019 డిసెంబర్లో చైనాలోని వూహాన్ నగరంలో మొదటి కరోనా కేసు నమోదైంది. ఆ తరువాత అక్కడి నుంచి ఈ వైరస్ ప్రపంచం మొత్తం వ్యాపించింది. వైరస్ వ్యాప్తి తరువాత ఇప్పుడు మరోసారి చైనాలో కేసులు వెలుగుచూస్తున్నాయి. చైనాని దక్షిణ ప్రావిన్స్‌లో కేసులు నమోదవుతున్నాయి. దీంతో దక్షిణ రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల్లో తిరిగి లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నారు. డెల్టావేరియంట్ కేసులు పెరుగుతుండటంతో నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. పుతియాన్ నగరంలో కేసులు పెరుగుతున్నాయి.…
చిన్న చిన్న దేశాల అవసరాలను తెలుసుకొని వాటికి సహాయం చేసి మెల్లిగా ఆ దేశంలో పాగా వేయడం డ్రాగన్ దేశానికి వెన్నతో పెట్టిన విద్య. గతంతో బ్రిటీష్ పాలకులు చేసిన విధంగానే ఇప్పుడు డ్రాగన్ పాలకులు చేస్తున్నారు. పాక్‌కు కావాల్సనంత డబ్బులు ఇచ్చి ఆ దేశాన్ని తన చెప్పుచేతల్లో పెట్టుకున్నది. ఇటు శ్రీలంకను సైతం అదేవిధంగా తన చెప్పుచేతల్లో పెట్టుకున్నది డ్రాగన్. కాగా ఇప్పుడు దృష్టిని కువైట్వైపు మళ్లించింది. కువైట్ ప్రస్తుతం అల్ షకయా ఎకనామిక్ సిటీని…
ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా, నాటో సేనలు పూర్తిగా తప్పుకున్నాయి. 2001 నుంచి 2021 వరకు దాదాపు 80 బిలియన్ డాలర్ల విలువైన ఆయుధాలను ఆఫ్ఘనిస్తాన్‌కు సమకూర్చింది. ఇందులో అధునాతనమైన 73 అపాచీ హెలికాఫ్టర్లు ఉన్నాయి. వీటితో పాటుగా అనేక ఆయుధాలు ఉన్నాయి. అమెరికా దళాలు బయటకు వచ్చే సమయంలో కొన్నింటని వెనక్కి తీసుకొచ్చారు. కొన్ని ఆయుధాలను అక్కడే వదిలేసి వచ్చారు. ఇప్పుడు అక్కడ వదిలేసి వచ్చిన వాటిపై అమెరికా అందోళన వ్యక్తం చేస్తున్నది. అమెరికా వదిలేసి వచ్చిన…
చైనాలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. డెల్టా వేరియంట్‌తో పాటుగా మరికొన్ని వేరియంట్లు అక్కడ చైనాలో వెలుగుచూస్తున్నాయి. దీంతో మరోసారి ఆంక్షలు విధేంచేందుకు అక్కడి ప్రభుత్వం సిద్ధం అయింది. పూజియాన్ ప్రావిన్స్‌లోని పుతియాన్ నగరంలో 19 కరోనా కేసులు వెలుగుచూశాయి. కరోనా కేసులు వెలుగుచూడటంతో ఆ నగరంలో ఆంక్షలు విధించారు. ఆదివారం నుంచి ఆ నగరాన్ని పూర్తిగా మూసివేశారు. ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రాకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అత్యవసరంగా ఎవరైనా బయటకు రావాలి అంటే…
ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ ప్రభుత్వం కొలువుదీరింది. తాలిబన్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే చైనా తామున్నామని హామీ ఇచ్చింది. హామీతో పాటుగా ఆ ప్రభుత్వానికి రూ.229 కోట్ల రూపాయలను తక్షణ సాయంగా అందించింది. ఎలాగైనా ఆఫ్ఘనిస్తాన్‌ను తమ చెప్పుచేతల్లో పెట్టుకోవడానికి చైనా పావులు కదుపుతున్న సంగతి తెలిసిందే. పాక్ అనుకూల వర్గం చేత ఈ పని చేయిస్తున్నది చైనా. అటు రష్యాకూడా ఆఫ్ఘన్ విషయంలో వేగంగా పావులు కదుపుతున్నది. రష్యాకు ఆక్రమణలకు వ్యతిరేకంగా ఏర్పటిన సంస్థే తాలిబన్. రష్యా సేనలు…
ప్రపంచానికి హానికరంగా మారిన ఉగ్రవాదులను ఎదురించే దమ్ము అగ్రరాజ్యాలకు సైతం లేదని అప్ఘన్ సంఘటన నిరూపించింది. ఉగ్రవాదాన్ని నిర్మూలించాలని ప్రసంగాలతో దంచికొట్టే దేశాలన్నీ ఇప్పుడు ఏం అయ్యాయనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆయుధ సంపత్తిలో మేటిగా ఉన్న చైనా, అమెరికా లాంటి దేశాలు తాలిబన్ లాంటి ఉగ్రవాద సంస్థలకు కొమ్ము కాస్తున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎవరికీ వారు సొంత ప్రయోజనాలతో తాలిబన్లకు పరోక్షంగా మద్దతు ఇస్తుండటం ప్రస్తుత అప్ఘన్ దుస్థితికి కారణమనే విమర్శలు వెల్లువెత్తుతోన్నాయి. ఈ పరిణామాలన్నీ…
టోక్యో వేదికగా జరుగుతోన్న పారాలింపిక్స్‌లో చైనా స్విమ్మర్ రికార్డులు సృష్టించాడు… స్విమ్మింగ్ లో కాళ్లతో పాటు చేతులు ప్రధాన భూమిక పోషిస్తాయి.. కానీ, రెండు చేతులు లేని స్విమ్మర్ జెంగ్ టావో.. ఏకంగా నాలుగు స్వర్ణాలతో తన ఆధిపత్యాన్ని కొనసాగించాడు.. విద్యుత్ షాక్ తగలడంతో ఈ చైనాకు చెందిన 30 ఏళ్ల జెంగ్ టావో.. రెండు చేతులు కోల్పోయాడు.. కానీ, ఆత్మవిశ్వాసంతో.. ప్రపంచ స్థాయిలో నాలుగు గోల్డ్ మెడల్స్ సాధించాడు.. ఇక, ఆ తర్వాత.. కూతురా, నన్ను…
చిన్న పిల్లలకు ఏదైనా కొత్తగా కనిపిస్తే దానిని పరిశీలించి చూస్తారు. అందులో ఏముందో తెలుసుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు. ఇలానే, ఓ చిన్నారి తన ఇంట్లోని పై గదిలో ఉన్న చిన్న కన్నంలోకి తలపెట్టింది. అలా దూరిన తల మరలా తీసేందుకు రాలేదు. దీంతో భయపడిన చిన్నారి పెద్దగా కేకలు వేయడం మొదలు పెట్టింది. ఆ కేకలు విన్న తల్లిదండ్రులు పరుగున అక్కడికి చేరుకున్నారు. కూతురిని ఆ కన్నం నుంచి బయటకు తీసే ప్రయత్నం చేశారు. కానీ…
ముగ్గురు పిల్లలను కనేందుకు చైనా పార్లమెంట్ ఆమోదం తెలిపింది. జనాభా తగ్గడంతో కార్మికుల కొరత ఏర్పడి ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడుతుందన్న అంచనాలతో ఈ నిర్ణయం తీసుకుంది. కమ్యూనిస్టు పార్టీ మే నెలలో ప్రతిపాదించిన ముగ్గురు పిల్లల విధానానికి అధికారికంగా ఆమోద ముద్ర వేసింది చైనా పార్లమెంట్. తల్లిదండ్రులపై భారం పడకుండా చట్టంలో మార్పులు చేసింది. పన్ను రాయితీ, భీమాతో పాటు…..విద్య, ఉద్యోగం, సొంతిల్లు విషయాల్లో ప్రభుత్వం ఆర్థిక సాయం చేయనుంది. కాగా.. ఈ ఏడాది మే…