చైనాలో కరోనా విజృంభణ: పెరుగుతున్న కేసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం చైనాలో కరోనా విజృంభిస్తుంది. తొలిసారి వైరస్ వెలుగు చూసిన చైనాలో మళ్లీ కేసులు పెరగడంతో ప్రపంచదేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అత్యంత వేగంగా వ్యాపించే డెల్టా వేరియంట్‌తో ఆదేశంలో కేసులు పెరుగుతున్నాయి. 11కు పైగా ఫ్రావిన్స్‌లలో కేసులు నమోదు అవుతున్నాయి. ప్రస్తుతం కేసులు కట్టడి చేస్తున్నా సమీప భవిష్యత్‌లో కేసులు ఒక్కసారిగా పెరిగే అవకాశముందని స్థానిక అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కరోనా వైరస్ అంటే మొదట గుర్తుకు వచ్చేది చైనానే. ప్రపంచాన్ని వణికించిన ఈ మహమ్మారి మళ్లీ వ్యాపిస్తుంది. దీంతో అక్కడి అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.
ఓవైపు కరోనాతో ప్రపంచం పోరాడితే చైనా మాత్రం కేసుల సంఖ్యను తగ్గు ముఖం పట్టించింది. ఇప్పుడు తాజాగా అక్కడ కేసులు పెరుగుతుండటంతో డెల్టా వేరియంట్ విజృంభణ వేగంగా ఉండటంతో ఆందోళన చెందుతుంది.. ఇప్పటికే వారం వ్యవధిలోనే మొత్తం 11 ఫ్రావిన్స్‌లకు వేగంగా కేసులు వ్యాప్తి చెందడంతో అక్కడి ఆరోగ్య శాఖ అధికారులు భయపడుతున్నారు. కరోనా పేషంట్లు ఒక రీజీయన్ నుంచి ఇంకో రీజీయన్‌కు ప్రయాణించారని అందుకే ఇక్కడ వేగంగా కేసులు వ్యాప్తి చెందుతున్నాయని ఆ దేశ నేషనల్ హెల్త్ మిషన్ ప్రతినిధి మీఫెంగ్ వివరించారు.
Also Read
- Saudi-Europe: యూరప్‌కు సౌదీ బిగ్ షాక్.. చమురు నిలిపిపోయే అవకాశం
- Macron: యూరప్‌లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
- Air India Kanishka Bombing: ఎయిర్ ఇండియా కనిష్క పేలుడు.. 41 ఏళ్ల తర్వాత కేసు మూసివేత దిశగా కెనడా?
- Zelenskyy: కొత్త ప్రాంతీయ కూటమి ఏర్పాటు చేసిన జెలెన్స్కీ.. ఏఏ దేశాలున్నాయంటే..!
ప్రస్తుతం వైరస్ ఉన్న ప్రాంతాలు అన్ని ఎమర్జెన్సీలోకి వెళ్లాలని ఆయన సూచించారు. చైనాలోని ఇన్నర్ మంగోలియా ఎంజీనా కౌంటీలో ఇప్పటికే కఠిన చర్యలు తీసుకుంటున్నారు. సోమవారం నుంచి ఇంటికే పరిమితం కావాలని ఆదేశాలు జారీ చేశారు. గన్షు, ఇన్నర్ మంగోలియాలోని కొన్ని ప్రాంతాల్లో ట్యాక్సిలను బస్సులను నిలిపి వేశారు.
శనివారం ఒక్క రోజే 26కు పైగా కేసులు నమోదు అయ్యాయి. ఇన్నర్ మంగోలియాలోని గన్షు, నింగ్జియా, హునాన్, షాంగ్జిలతో పాటు చైనా రాజధాని బీజింగ్‌లోను కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికిప్పుడు ఈ కేసులతో పెద్ద ముప్పు వాటిల్లకున్నా భవిష్యత్‌లో ముప్పు తప్పదనే అభిప్రాయాన్ని అక్కడి వైద్యాధికారులు వ్యక్తం చేస్తున్నారు. చైనాలో కేసులు సంఖ్య ఎక్కువైతే ప్రపంచానికి ముప్పు తప్పదని గత ఏడాది కాలంలో జరిగిన నష్టాన్ని చూస్తే స్పష్టంగా అర్థమవుతోంది.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..