గత కొన్ని రోజులుగా హైపర్ సోనిక్ క్షిపణుల ప్రయోగాలకు సంబంధించిన వార్తలు మీడియాలో ప్రసారం అవుతున్నాయి. చైనా హైపర్ సోనిక్ క్షిపణిని ఆగస్టులో ప్రయోగించింది. ఈ ప్రయోగానికి సంబంధించిన సమాచారాన్ని ఆ దేశం రహస్యంగా ఉంచి, అక్టోబర్‌లో బహిర్గతం చేసింది. దీంతో యావత్ ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రాడార్‌లకు అందకుండా భూమిచట్టూ ఈ క్షిపణి ప్రదక్షిణ చేసి టార్గెట్‌కు 30 కిలోమీటర్ల దూరంలో పడిండి. అయితే, రాడార్‌లకు అందకుండా ఈ హైపర్ సోనిక్ క్షిపణులు టార్గెట్‌ను ఛేదిస్తుంటాయి. ఈ రకమైన క్షిపణులు అమెరికా, రష్యా, చైనా, ఉత్తర కొరియా వద్ధ మాత్రమే ఉన్నాయి. ఈ రకమైన ఆయుధాలను ఇప్పటికే రష్యా, చైనాలు సైన్యానికి అందించాయి. కానీ, అమెరికా ఈ రకమైన క్షిపణులను సైన్యానికి అందించలేదు. త్వరలోనే అందంచనున్నది. అగ్రదేశాల మధ్య ఆయుధాలకు సంబంధించి పోటీ పెరుగుతున్నది. ఈపోటీ నివారించకుంటే భవిష్యత్తులో మరో ప్రచ్ఛన్నయుద్ధం వచ్చే అవకాశం లేకపోలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Read: ఈ దేశాల పాస్‌పోర్ట్ ఉంటే చాలు…ఎంచక్కా 192 దేశాలు తిరిగిరావొచ్చు…