ఒకప్పుడు ఒకచోట నుంచి మరోచోటుకి ప్రయాణం చేయాలంటే నడిచి వెళ్లేవారు. ఆ తరువాత చిన్న చిన్న వాహనాలు అందుబాటులోకి వచ్చాయి. రైట్ సోదరులు విమానం కనుగొన్న తరువాత ప్రయాణంలో వేగం పెరిగింది. ఇప్పుడు భూమిమీద నుంచి స్పేస్‌లోకి ప్రయాణం చేస్తున్నారు. అయితే, ఒక దేశం నుంచి మరోక దేశానికి ప్రయాణం చేయాలంటే విమానంలోనూ దూరాన్ని బట్టి సమయం ఉంటున్నది. దీంతో హైస్పీడ్ రైళ్లు అందుబాటులోకి వచ్చిన విధంగానే హైస్పీడ్ విమానాలను తీసుకురావాలని అమెరికా, చైనా, ఫ్రాన్స్, బ్రిటన్లు…
ప్రపంచ ఆరోగ్య సంస్థ కోవిడ్ 19 డ్యాష్ బోర్డులో ప్రస్తావించిన అంశం ఒకటి వివాదానికి ఆజ్యం పోస్తోంది. జమ్మూకాశ్మీర్ ని డబ్ల్యుహెచ్ వో డ్యాష్ బోర్డులో చైనా పాకిస్తాన్ లోని భాగంగా ప్రపంచ మ్యాప్ లో చూపించడం ఈ వివాదానికి కారణం అయింది. భారత్ లో అంతర్భాగమయిన కాశ్మీర్ ని ప్రపంచ ఆరోగ్యసంస్థ అలా చూపించడంపై టీఎంసీ ఎంపీ డా.శంతాను సేన్ తీవ్రంగా స్పందించారు. దీనిపై ప్రధాని మోడీకి ఆయన లేఖ రాశారు. ఈ మ్యాప్ లో…
ఇటీవలే దక్షిణాఫ్రికా దేశంలో మరోకొత్త నియోకోవ్ వైరస్ వెలుగుచూసింది. ఈ వైరస్‌పై చైనాకు చెందిన వూహాన్ యూనివర్శిటీ, ఇనిస్టిట్యూట్ ఆప్ బయో ఫిజిక్స్ శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. నియోకోవ్ వైరస్ మొదట దక్షిణాఫ్రికాలోని గబ్బిలాల్లో కనుగోన్నట్టు శాస్త్రవేత్తలు ప్రకటించారు. అ వైరస్ కారణంగా అధిక మరణాలు సంభవిస్తాయని శాస్త్రవేత్తలు తెలిపారు. కొత్త వైరస్ సంక్రమణ రేటు కూడా అధికంగానే ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ వైరస్ సోకిన ప్రతి ముగ్గురిలో ఒకరు మరణిస్తారని స్పుత్నిక్ వూహాన్ శాస్త్రవేత్తలు…
కరోనా కారణంగా మార్చి 2020 నుంచి ఉత్తర కొరియా తన సరిహద్దులను మూసివేసింది. దీంతో చైనాతో వాణిస్య సంబంధాలు చాలా వరకు నిలిచిపోయాయి. కఠినమైన నిబంధనలు అమలు చేస్తుండటంతో ఉత్తర కొరియాలోకి కరోనా మహమ్మారి ఎంటర్ కాలేదు. రెండేళ్లుగా ఆ దేశంలోని ప్రజలు ఆహారం కొరతతో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధ్యక్షుడు కిమ్ అనుసరిస్తున్న విధానాలు, అణ్వస్త్ర క్షిపణుల ప్రయోగాల కారణంగా ప్రపంచదేశాలు ఉత్తర కొరియాపై ఆంక్షలు విధించాయి. ఈ ఆంక్షల కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
భారత్‌లో గాడిదల సంఖ్య భారీగా తగ్గిపోతోంది. 2012 నుంచి 2019 వరకు అంటే 8 ఏళ్ల కాలంలో గాడిదలు 61 శాతం తగ్గినట్లు బ్రూక్ ఇండియా అనే సంస్థ నిర్వహించిన అధ్యయనం స్పష్టం చేసింది. గాడిదల సంఖ్య గణనీయంగా తగ్గిపోయిన మహారాష్ట్ర, గుజరాత్, బీహార్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో సంస్థ ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటించి పలు వివరాలను సేకరించారు. దేశంలో అక్షరాస్యత రేటు పెరగడం, బరువు మోయడానికి గాడిదలను వాడే ఇటుక పరిశ్రమలలో యంత్రాలు అందుబాటులోకి…
పాక్ చైనాల మధ్య విడిపోలేని బంధం ఉన్నప్పటికీ కొన్ని విషయాల్లో చైనా తన అసలు స్వరూపాన్ని బయటపెట్టి పాక్‌కు చుక్కలు చూపిస్తున్నది. పాక్‌కు ఆర్థికంగా అండదండలుగా ఉన్న చైనా, నష్టపరిహారాన్ని వసూలు చేయడంలో కూడా అదే తీరును ప్రదర్శిస్తోంది. పాక్‌లో దాసు హైడ్రోపవర్ ప్రాజెక్టును చైనాకు చెందిన జెగ్‌హుబా కంపెనీ ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నది. అయితే, ఈ ప్రాజెక్టు వద్ద 2021 జులై 14 వ తేదీన ఉగ్రవాదులు దాడులు జరిపారు. ఈ దాడుల్లో 36 మంది…
అరుణాచల్ ప్రదేశలోని సాంగ్పో నది వద్ద ఔషద మూలికలు సేకరించేందుకు వెళ్లిన 17 ఏళ్ల యువకుడిని చైనా ఆర్మీ కిడ్నాప్ చేసింది. అతనితో పాటు మరో వ్యక్తిని కూడా కిడ్నాప్ చేసేందుకు చైనా ఆర్మీ ప్రయత్నించగా జానీ యుయాంగ్ తప్పించుకోగా మిరాయ్ తరోన్‌ను అపహరించుకుపోయారు. దీనిపై ఇప్పుడు దేశవ్యాప్తంగా దుమారం రేగుతున్నది. అయితే, భారత ఆర్మీ మిస్సింగ్ కేసుగా దీనిని డీల్ చేస్తున్నారు. మరోవైపు చైనా అధికారులతో భారత్ హాట్‌లైన్ ద్వారా సంప్రదింపులు జరుపుతున్నది. ఈ కిడ్నాప్‌కు…
కరోనాకు పుట్టినిల్లైన చైనా జీరో వైరస్ ను సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. సార్స్‌కోవ్ డీ వైరస్ వూహాన్లో పుట్టలేదని, ఇటలీ నుంచి వచ్చిందని కొన్నాళ్లు మభ్యపెట్టే ప్రయత్నం చేసింది. అప్పటికే ప్రపంచానికి విషయం తెలిసిపోవడంతో కామ్‌గా ఉండిపోయింది. చైనాలో వ్యాక్సినేషన్‌తో పాటు కఠిన నిబంధనలను అమలు చేస్తూ కరోనాను కంట్రోల్ చేసేందుకు ప్రయత్నిస్తోంది. తాజాగా మరో దేశంపై చైనా అభాండాలు వేసింది. బీజింగ్‌లో ఇటీవలే ఒమిక్రాన్ కేసులు బయటపడుతున్నాయి. దీంతో చైనా అప్రమత్తం అయింది. బీజింగ్‌కు వచ్చిన…
ప్రపంచమంతా కరోనా మహమ్మారిపై పోరాటం చేస్తుంటే చైనా మాత్రం కొత్త కొత్త ఆవిష్కరణలతో దూసుకుపోతున్నది. ఇప్పటికే కృత్రిమ సూర్యుడిని సృష్టించిన చైనా తాజాగా కృత్రిమ చంద్రుడిని ఆవిష్కరించింది. భవిష్యత్తులో చంద్రుడిపై పరిశోధనలు చేయాలని చైనా నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అక్కడికి వ్యోమగాములను పంపి పరిశోధనలు చేయాలి అంటే చంద్రుడిపై ఉన్న వాతారవణానికి వ్యోమగాములు అలవాటు పడాలి. అక్కడి వాతావరణాన్ని కృత్రిమంగా సృష్టించింది. భూమిపై ఉన్న గురుత్వాకర్షణ శక్తిలో ఆరోవంతు చంద్రునిపై ఉంటుంది. భూమిపై ప్రత్యేక పద్దతుల్లో…
ప్రపంచంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే, జీరో కరోనా దేశంగా ఆవిర్భవించేందుకు చైనా ప్రయత్నాలు చేస్తున్నది. కరోనా కేసులు బయటపడుతున్న చోట కఠినమైన లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నది. ఇప్పటికే మూడు నగరాలలో లాక్డౌన్ అమలు చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే, ఫిబ్రవరి 4 వ తేదీ నుంచి బీజింగ్‌లో వింటర్ ఒలింపిక్స్ గేమ్స్ ప్రారంభం కానున్నాయి. ఈ ఒలింపిక్స్ ప్రారంభమయ్యే నాటికి ఎలాగైనా వైరస్‌ను కట్టడి…