కరోనా కేసులు దేశంలో తగ్గుముఖం పట్టిన సంగతి తెలిసిందే. కరోనా పరీక్షల్లో ఖచ్చితమైన రిజల్ట్ రావాలి అంటే తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయించుకోవాల్సిందే. ఆర్టీపీసీఆర్ లేదా పీసీఆర్ టెస్టులు చేయిస్తున్నారు. అయితే, వీటి రిజల్ట్ వచ్చేందుకు ఎక్కువ సమయం తీసుకుంటోంది. ర్యాపిడ్ టెస్టులు చేయడం వలన ఖచ్చితమైన రిజల్ట్ రావడం లేదు. దీనికి పరిష్కారం కనుగొనేందుకు సింగపూర్ శాస్త్రవేత్తలు ఖచ్చితమైన రిజల్ట్ వచ్చేలా బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ కిట్‌ను తయారు చేశారు. ఈ కిట్‌తో పరీక్షలు నిర్వహిస్తే…
చైనా చుట్టుపక్కల దేశాలపై కన్నేసింది. 2025 నాటికి తైవాన్ను పూర్తిగా ఆక్రమించుకోవాలని చైనా చూస్తున్నది. దీనికోసం చాలా రోజులుగా పావులు కదుపుతున్న సంగతి తెలిసిందే. ఇటు ఇండియాలోని లద్ధాఖ్, అరుణాచల్ ప్రదేశ్‌పై కూడా చైనా కన్నేసి ఆక్రమించుకోవాలని చూస్తున్నది. బోర్డర్ లో అక్రమ నిర్మాణాలు చేపట్టేందుకు ఆ దేశం సిద్దమౌతున్న సంగతి తెలిసిందే. అదీ చాలదన్నట్టు ఇప్పుడు మరో మిత్రదేశం నేపాల్‌పై కూడా చైనా కన్నేసింది. నేపాల్ చైనా మధ్య సుమారు 1400 కిమీ మేర సరిహద్దు…
ఫిబ్రవరి 4 నుంచి చైనాలో బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ జరుగుతున్నాయి. కరోనా నిబంధనలకు కఠినంగా అమలు చేస్తూ క్రీడలను నిర్వహిస్తున్నారు. బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో వివధ దేశాల నుంచి క్రీడాకారులు వచ్చిన సంగతి తెలిసిందే. క్రీడలు జరిగే స్డేడియంలో ప్రేక్షకులు ఎవర్నీ అనుమతించడం లేదు. అంతేకాదు, క్రీడాకారులు నివశించే ప్రాంతాల్లోకి కూడా ఎవర్నీ అనుతించడం లేదు. క్రీడాకారులకు కావాల్సిన బట్టలు, ఇతర వస్తువులు, ఆహారం అన్నింటిని రోబోలే అందిస్తున్నాయి. Read: వీడేం…
ఉక్రెయిన్- రష్యా మధ్య సంక్షోభం కొనసాగుతున్నది. అయితే, ఉక్రెయిన్‌కు నాటో దళాలు, అమెరికా మద్దతు ప్రకటించింది. ఉక్రెయిన్ను ఆక్రమించుకోవడానికి రష్యా ప్రయత్నం చేస్తున్నదని అమెరికా స్పష్టం చేసింది. అయితే, నాటో దళాల విస్తరణను ఇప్పటికే రష్యా వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. తాజాగా నాటో దళాల విస్తరణను చైనా సైతం ఖండించింది. ఈ విషయంలో రష్యాకు మద్దతు ఇస్తున్నట్టు చైనా పేర్కొన్నది. వింటర్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవం నేపథ్యంతో రష్యా, చైనా అధ్యక్షులు భేటీ అయ్యారు. తైవాన్ అంశంలో చైనాకు…
స్మార్ట్ ఫోన్ వినియోగంలోకి వచ్చిన తరువాత గంటల తరబడి మొబైల్ ఫోన్లలో గడిపేస్తున్నారు. ఫోన్ బ్యాటరీని ఛార్జింగ్ చేయడానికి పవర్ బ్యాంక్ లు అందుబాటులో ఉన్నాయి. పదివేలు, 20 వేల ఎంఏహెచ్ తో పవర్ బ్యాంక్‌లను వినియోగిస్తున్నారు. అయితే, చైనాకు చెందిన ఓ యూట్యూబర్ హ్యాంగ్ గెంగ్ అనే యూట్యూబర్ ఓ కొత్త పవర్ బ్యాంక్‌ను కనుగొన్నారు. గెంగ్ అనే య్యూట్యూబర్ 2,70,00,000 ఎంఏహెచ్ బ్యాటరీ కలిగి ఉంది. ఈ పవర్ బ్యాంక్ ద్వారా 5 వేల…
ఒకప్పుడు ఒకచోట నుంచి మరోచోటుకి ప్రయాణం చేయాలంటే నడిచి వెళ్లేవారు. ఆ తరువాత చిన్న చిన్న వాహనాలు అందుబాటులోకి వచ్చాయి. రైట్ సోదరులు విమానం కనుగొన్న తరువాత ప్రయాణంలో వేగం పెరిగింది. ఇప్పుడు భూమిమీద నుంచి స్పేస్‌లోకి ప్రయాణం చేస్తున్నారు. అయితే, ఒక దేశం నుంచి మరోక దేశానికి ప్రయాణం చేయాలంటే విమానంలోనూ దూరాన్ని బట్టి సమయం ఉంటున్నది. దీంతో హైస్పీడ్ రైళ్లు అందుబాటులోకి వచ్చిన విధంగానే హైస్పీడ్ విమానాలను తీసుకురావాలని అమెరికా, చైనా, ఫ్రాన్స్, బ్రిటన్లు…
ప్రపంచ ఆరోగ్య సంస్థ కోవిడ్ 19 డ్యాష్ బోర్డులో ప్రస్తావించిన అంశం ఒకటి వివాదానికి ఆజ్యం పోస్తోంది. జమ్మూకాశ్మీర్ ని డబ్ల్యుహెచ్ వో డ్యాష్ బోర్డులో చైనా పాకిస్తాన్ లోని భాగంగా ప్రపంచ మ్యాప్ లో చూపించడం ఈ వివాదానికి కారణం అయింది. భారత్ లో అంతర్భాగమయిన కాశ్మీర్ ని ప్రపంచ ఆరోగ్యసంస్థ అలా చూపించడంపై టీఎంసీ ఎంపీ డా.శంతాను సేన్ తీవ్రంగా స్పందించారు. దీనిపై ప్రధాని మోడీకి ఆయన లేఖ రాశారు. ఈ మ్యాప్ లో…
ఇటీవలే దక్షిణాఫ్రికా దేశంలో మరోకొత్త నియోకోవ్ వైరస్ వెలుగుచూసింది. ఈ వైరస్‌పై చైనాకు చెందిన వూహాన్ యూనివర్శిటీ, ఇనిస్టిట్యూట్ ఆప్ బయో ఫిజిక్స్ శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. నియోకోవ్ వైరస్ మొదట దక్షిణాఫ్రికాలోని గబ్బిలాల్లో కనుగోన్నట్టు శాస్త్రవేత్తలు ప్రకటించారు. అ వైరస్ కారణంగా అధిక మరణాలు సంభవిస్తాయని శాస్త్రవేత్తలు తెలిపారు. కొత్త వైరస్ సంక్రమణ రేటు కూడా అధికంగానే ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ వైరస్ సోకిన ప్రతి ముగ్గురిలో ఒకరు మరణిస్తారని స్పుత్నిక్ వూహాన్ శాస్త్రవేత్తలు…
కరోనా కారణంగా మార్చి 2020 నుంచి ఉత్తర కొరియా తన సరిహద్దులను మూసివేసింది. దీంతో చైనాతో వాణిస్య సంబంధాలు చాలా వరకు నిలిచిపోయాయి. కఠినమైన నిబంధనలు అమలు చేస్తుండటంతో ఉత్తర కొరియాలోకి కరోనా మహమ్మారి ఎంటర్ కాలేదు. రెండేళ్లుగా ఆ దేశంలోని ప్రజలు ఆహారం కొరతతో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధ్యక్షుడు కిమ్ అనుసరిస్తున్న విధానాలు, అణ్వస్త్ర క్షిపణుల ప్రయోగాల కారణంగా ప్రపంచదేశాలు ఉత్తర కొరియాపై ఆంక్షలు విధించాయి. ఈ ఆంక్షల కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
భారత్‌లో గాడిదల సంఖ్య భారీగా తగ్గిపోతోంది. 2012 నుంచి 2019 వరకు అంటే 8 ఏళ్ల కాలంలో గాడిదలు 61 శాతం తగ్గినట్లు బ్రూక్ ఇండియా అనే సంస్థ నిర్వహించిన అధ్యయనం స్పష్టం చేసింది. గాడిదల సంఖ్య గణనీయంగా తగ్గిపోయిన మహారాష్ట్ర, గుజరాత్, బీహార్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో సంస్థ ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటించి పలు వివరాలను సేకరించారు. దేశంలో అక్షరాస్యత రేటు పెరగడం, బరువు మోయడానికి గాడిదలను వాడే ఇటుక పరిశ్రమలలో యంత్రాలు అందుబాటులోకి…