కరోనా కేసులు దేశంలో తగ్గుముఖం పట్టిన సంగతి తెలిసిందే. కరోనా పరీక్షల్లో ఖచ్చితమైన రిజల్ట్ రావాలి అంటే తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయించుకోవాల్సిందే. ఆర్టీపీసీఆర్ లేదా పీసీఆర్ టెస్టులు చేయిస్తున్నారు. అయితే, వీటి రిజల్ట్ వచ్చేందుకు ఎక్కువ సమయం తీసుకుంటోంది. ర్యాపిడ్ టెస్టులు చేయడం వలన ఖచ్చితమైన రిజల్ట్ రావడం లేదు. దీనికి పరిష్కారం కనుగొనేందుకు సింగపూర్ శాస్త్రవేత్తలు ఖచ్చితమైన రిజల్ట్ వచ్చేలా బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ కిట్‌ను తయారు చేశారు. ఈ కిట్‌తో పరీక్షలు నిర్వహిస్తే 5 నిమిషాల్లోనే రిజల్ట్ వస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే, చైనా శాస్త్రవేత్తలు మరో అడుగుముందుకేసి నాలుగు నిమిషాల్లోనే రిజల్ట్ వచ్చేలా ఓ కిట్‌ను తయారు చేశారు.
Read: షాకింగ్: ఐఫోన్ కోసం ఆర్డర్ చేస్తే…
ఈ కిట్ సహాయంతో కేవలం నాలుగు నిమిషాల్లోనే ఖచ్చితమైన రిజల్ట్ వస్తుందని షాంగైలోని వూడాన్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈ కిట్‌లో ఇంటిగ్రేటెట్ పోర్టబుల్ ప్రోటోటైప్ కిట్‌లో ఎలక్ట్రో మెకానికల్ బయోసెన్సార్‌ను అమర్చారు. ఇది జన్యుపదార్థాన్ని వేగంగా విశ్లేషించి నాలుగు నిమిషాల్లోనే ఖచ్చితమైన రిజల్ట్‌ను ఇస్తుందని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. ట్రయల్స్‌లో భాగంగా షాంగై నుంచి సేకరించిన 33 మంది నమూనాలను ఆర్టీపీసీఆర్ తో పాటు కొత్త కిట్ ద్వారా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా రెండింటిలోనూ ఒకేవిధమైన ఫలితాలు వచ్చాయని వూడాన్ విశ్వవిద్యాలయం పరిశోధకులు పేర్కొన్నారు. ఈ కిట్ అందుబాటులోకి వచ్చిన తరువాత కరోనాను చాలా ఈజీగా గుర్తించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.