చైనా చుట్టుపక్కల దేశాలపై కన్నేసింది. 2025 నాటికి తైవాన్‌ను పూర్తిగా ఆక్రమించుకోవాలని చైనా చూస్తున్నది. దీనికోసం చాలా రోజులుగా పావులు కదుపుతున్న సంగతి తెలిసిందే. ఇటు ఇండియాలోని లద్ధాఖ్, అరుణాచల్ ప్రదేశ్‌పై కూడా చైనా కన్నేసి ఆక్రమించుకోవాలని చూస్తున్నది. బోర్డర్ లో అక్రమ నిర్మాణాలు చేపట్టేందుకు ఆ దేశం సిద్దమౌతున్న సంగతి తెలిసిందే. అదీ చాలదన్నట్టు ఇప్పుడు మరో మిత్రదేశం నేపాల్‌పై కూడా చైనా కన్నేసింది. నేపాల్ చైనా మధ్య సుమారు 1400 కిమీ మేర సరిహద్దు ఉన్నది. రెండు దేశాల మధ్య సరిహద్దుల విషయంలో 1960లో ఒప్పందం జరిగింది. అయితే, కేవలం ఒప్పందం మాత్రమే చేసుకున్నారు. పూర్తిస్థాయిలో ఎలాంటి కంచె వంటి నిర్మాణాలను ఏర్పాటు చేసుకోలేదు.
Read: కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డ ప్రధాని మోడీ.. ఆ పార్టీ లేకపోయుంటే..!
పిల్లర్లను మాత్రమే ఏర్పాటు చేశారు. ఇది ఇప్పుడు చైనాకు కలిసివచ్చింది. సమయం దొరికిప్పుడల్లా చైనా పిల్లర్లను మార్చుతూ క్రమంగా కబ్జా చేస్తూ వస్తున్నది. గతేడాది సెప్టెంబర్ నెలలోనే కబ్జాకు చెందిన విషయాలు ప్రభుత్వం దృష్టికి వచ్చినా, ఎక్కడ సంబంధాలు దెబ్బతింటాయో అని ప్రభుత్వం దీనిని గొప్యంగా ఉంచింది. నేపాల్-చైనా సరిహద్దుల్లోని లలూంగ్‌జంగ్ ప్రాంతంలోని నేపాలీలు ఆధ్యాత్మక కార్యక్రమాలు నిర్వహించుకోనివ్వకుండా డ్రాగన్ దళం అడ్డుపడింది. ఆ ప్రాంతంలో పశువులను మేపుకోవడానికి వెళ్లిన వారిని డ్రాగన్ దళం బెదిరించి వెనక్కి పంపినట్లు అధికారులు చెబుతున్నారు. చైనా స్నేహహస్తం అందిస్తూనే, కబ్జాలు చేస్తున్నట్టు నేపాల్ చెబుతున్నది.