స్మార్ట్ ఫోన్ వినియోగంలోకి వచ్చిన తరువాత గంటల తరబడి మొబైల్ ఫోన్‌లలో గడిపేస్తున్నారు. ఫోన్ బ్యాటరీని ఛార్జింగ్ చేయడానికి పవర్ బ్యాంక్ లు అందుబాటులో ఉన్నాయి. పదివేలు, 20 వేల ఎంఏహెచ్ తో పవర్ బ్యాంక్‌లను వినియోగిస్తున్నారు. అయితే, చైనాకు చెందిన ఓ యూట్యూబర్ హ్యాంగ్ గెంగ్ అనే యూట్యూబర్ ఓ కొత్త పవర్ బ్యాంక్‌ను కనుగొన్నారు. గెంగ్ అనే య్యూట్యూబర్ 2,70,00,000 ఎంఏహెచ్ బ్యాటరీ కలిగి ఉంది. ఈ పవర్ బ్యాంక్ ద్వారా 5 వేల స్మార్ట్ ఫోన్‌లకు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. కేవలం ఛార్జింగ్ ఏర్పాటు మాత్రమే కాదు, ఈ పవర్ బ్యాంక్‌లో మిడ్ రేంజ్‌కారుకు సరిపోయేంత బ్యాటరీని అమర్చారు. దీనిని మొబైల్ ఫోన్‌లలో ఛార్జింగ్ మాత్రమే కాకుండా పవర్ బ్యాంక్, టీవీ, వాషింగ్ మిషన్ ఇలా వివిధ డివైజ్‌లకు ఛార్జింగ్ పెట్టుకునేందుకు ఈ పవర్ బ్యాంక్ వినియోగిస్తున్నారు.
Read: అక్కడి మట్టి చాలా రుచిగా ఉంటుందట… అందుకే దానిని…