ఉక్రెయిన్- రష్యా మధ్య సంక్షోభం కొనసాగుతున్నది. అయితే, ఉక్రెయిన్‌కు నాటో దళాలు, అమెరికా మద్దతు ప్రకటించింది. ఉక్రెయిన్‌ను ఆక్రమించుకోవడానికి రష్యా ప్రయత్నం చేస్తున్నదని అమెరికా స్పష్టం చేసింది. అయితే, నాటో దళాల విస్తరణను ఇప్పటికే రష్యా వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. తాజాగా నాటో దళాల విస్తరణను చైనా సైతం ఖండించింది. ఈ విషయంలో రష్యాకు మద్దతు ఇస్తున్నట్టు చైనా పేర్కొన్నది. వింటర్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవం నేపథ్యంతో రష్యా, చైనా అధ్యక్షులు భేటీ అయ్యారు. తైవాన్ అంశంలో చైనాకు రష్యా మద్దతు పలకగా, ఉక్రెయిన్ విషయంలో రష్యాకు జిన్‌పింగ్ మద్దతు తెలిపారు.
Read: అగ్నిపర్వతంపై రెస్టారెంట్: అక్కడ భోజనం చేయాలంటే…
నాటోదేశాలు రష్యాపై యుద్దానికి వస్తే ఆ దేశానికి తాము సహకరిస్తామని చైనా అధ్యక్షుడు ప్రకటించడంతో పరిస్థితులు మరింత సందిగ్ధంగా మారాయి. చైనా విషయంలో అమెరికా ఇప్పటికే వ్యతిరేకంగా ఉన్నది. ఇప్పుడు రష్యాకు సపోర్ట్ చేసేందుకు చైనా ముందుకు రావడంతో అంతర్జాతీయంగా ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయో అని ప్రపంచదేశాలు ఆందోళన చెందుతున్నారు.