ప్రపంచం మొత్తం ఒమిక్రాన్, కరోనా మహమ్మారులతో అనేక ఇబ్బందులు పడుతున్నాయి. యూరప్, అమెరికా దేశాల్లో రికార్డ్ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. రోజు రోజుకు కేసులు పెరిగిపోతుండటంతో యూరప్ దేశాల్లో ఆంక్షలు విధించారు. కరోనా వైరస్ కు పుట్టినల్లైన చైనాలో కేసులు చాలా తక్కువ స్థాయిలో నమోదవుతున్నాయి. అయినప్పటికీ అనేక నగరాల్లో అక్కడి ప్రభుత్వం కఠినమైన ఆంక్షలు, వూహన్ తరహా లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నది. చైనాలో అతిపెద్ద నగరాల్లో ఒకటైన జియాంగ్ నగరంలో కఠినమైన లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నారు.…
ఎలన్ మస్క్ స్పేస్ ఎక్స్ నుంచి స్టార్ లింక్స్ ను రోదసిలోకి ప్రవేశపెడుతున్న సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ను వేగవంతం చేసేందుకు ఈ స్టార్ లింక్స్ తోడ్పడతాయి. సుమారు 42 వేల స్టార్ లింక్స్‌ను రోదసిలోకి ప్రవేశపెట్టాల్సి ఉండగా ఇప్పటి వరకు 1800 లకు పైగా స్టార్ లింక్ లను ప్రవేశపెట్టారు. ఈ స్టార్ లింక్ ల కారణంగా చైనా అంతరిక్ష కేంద్రం టియాన్జేకు ముప్పు ఏర్పడినట్టు ఆ దేశ అంతరిక్ష సంస్థ తెలియజేసింది. 2001 జులై…
ప్రపంచంలో అతిపెద్ద కార్ల సంస్థగా ప్రసిద్ధి చెందిన టెస్లా కంపెనీకి చైనా దిగ్గజం హువావే షాక్ ఇచ్చింది. హువావే ఐటో ఎం 5 అనే కారును రిలీజ్ చేసేందుకు సిద్ధం అవుతున్నది. హైబ్రీడ్ కారు కావడంతో దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఎలక్ట్రిక్‌తోనూ, పెట్రోల్ తోనూ నడుస్తుంది. ఒకసారీ ఈ కారు బ్యాటరీని ఛార్జింగ్ చేస్తే 1000 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయగలదు. అంతేకాదు, హైబ్రీడ్ కారు కావడంతో స్టీరింగ్ జీరో అయినప్పటికీ ప్రయాణం చేయగలదు. టెస్లా…
కరోనా వైరస్‌కు పుట్టినిల్లు చైనా. చైనాలోని వూహాన్ నగరంలో ఈ వైరస్ పుట్టింది. ఇది జంతువుల నుంచి మనుషులకు సోకిందిని చెబుతున్నా, ల్యాబ్ నుంచే లీక్ అయిందనే వార్తలు ఎక్కువగా వస్తున్నాయి. ఈ వైరస్‌తో గత రెండేళ్లుగా ప్రపంచదేశాలు పోరాటం చేస్తున్నాయి. వ్యాక్సిన్లు అందుబాటులోకి తీసుకొచ్చినా వైరస్ లొంగడం లేదు. రూపం మార్చుకొని కొత్తగా విజృంభిస్తోంది. ప్రపంచం యావత్తు ఈ వైరస్ దెబ్బకు ఆర్ధికంగా కుదేలైపోయింది. ఇప్పుడు ప్రపంచం మొత్తం ఒమిక్రాన్ వేరియంట్‌తో ఇబ్బందులు పడుతుంటే, చైనాలో…
విశాఖ జిల్లా అనకాపల్లిలో పుట్టి చైనాలో యోగా గురువుగా ప్రఖ్యాతి గాంచిన కొణతాల విజయ్ గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించారు. చైనాలోని జెంజూ నగరంలో ఆగష్ట్ 4న అష్టవక్రాసనాన్ని 2.32 నిమిషాలపాటు ప్రదర్శించి ఈ ఘనత సాధించారు. విజయ్ భార్య జ్యోతి కొద్ది నెలల క్రితం గిన్నిస్ బుక్ లో స్థానం దక్కించుకున్నారు. నిండు గర్భంతో యోగాసనాలు వేసి ఆమె ప్రపంచ రికార్డు నెలకొల్పారు. విజయ్ చదువుకునే సమయంలోనే యోగా నేర్చుకున్నారు. తర్వాత నృత్యంలో మెలకువలు…
మొబైల్ ఫోన్ నుంచి కంప్యూటర్లు, కార్లు ఇలా ప్రతీ దాంట్లో సెమీకండక్టర్ చిప్స్ ను వినియోగిస్తుంటారు. కరోనా సమయంలో ఆ చిప్స్‌కు భారీ కొరత ఏర్పడింది. తైవాన్, చైనా తో పాటుగా కొన్ని దేశాల్లో ఎక్కువగా వీటిని తయారు చేస్తున్నారు. చిప్స్ కొరత ఇప్పుడు ప్రపంచాన్ని వేధిస్తోంది. రాబోయే రోజుల్లో సెమీకండక్టర్ల కొరత మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. దీని నుంచి బయటపడేందుకు భారత్ లోనే సొంతంగా సెమీకండక్టర్ చిప్స్ తయారీని చేపట్టాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది.…
వన్ చైనా పాలసీలో భాగంగా ఎప్పటికైనా తైవాన్ను తన సొంతం చేసుకోవాలని డ్రాగన్ చూస్తున్నది. ఆ దిశగానే పావులు కదుపుతూ, తైవాన్‌తో దోస్తీ కట్టిన దేశాలను నయానో భయనో ఒప్పించి ఆ దేశం నుంచి బయటకు పంపిస్తోంది. 2025 నాటికి తైవాన్ను తన దేశంలో కలిపేసుకోవాలన్నది చైనా లక్ష్యం. అయితే, దీనికి అమెరికా అడ్డుపడుతున్నది. తైవాన్‌పై డ్రాగన్ ఎలాంటి సైనికచర్యలకు పాల్పడినా చూస్తూ ఊరుకునేది లేదని, తైవాన్ తరపున పోరాటం చేస్తామని అమెరికా వార్నింగ్ ఇచ్చింది. అంతేకాదు,…
చైనా మరోసారి తన విస్తరణవాదానికి తెర లేపింది. తైవాన్ గగనతలంలోకి యుద్ధ విమానాలు పంపి ఉద్రిక్తత వాతావరణం సృష్టించడానికి చూస్తోంది. గతేడాది సెప్టెంబర్ నుంచి చైనా తైవాన్ను రెచ్చగొడుతుంది. ఇదే వారంలో రెండు సార్లు చైనా, తైవాన్ ఎయిర్ ఢిపెన్స్ ఐడెంటిఫికేషన్ జోన్లోకి విమానాలను పంపింది చైనా. తాజాగా 13 విమానాలను తైవాన్ గగనతలంలోకి పంపి చైనా వక్రబుద్ధిని మరోసారి నిరూపించుకుంది.వీటిలో కంట్రోల్ (AEW&C) విమానం,ఆరు షెన్యాంగ్ J-16 మరియు రెండు చెంగ్డు J-10 ఫైటర్ జెట్లు…
హెలికాప్టర్ ప్రమాదంపై ఎగతాళి వ్యాఖ్యలుచైనా కనీస మానవత్వం మరిచిపోయి మరోసారి భారత్‌పై అక్కసు వెళ్లగక్కింది. సంయమనంతో స్పందించాల్సిన సందర్భంలో అవాకులు చెవాకులు పేలింది. చీఫ్ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్‌రావత్ ప్రయాణించిన హెలికాప్టర్ ప్రమాదానికి గురికావడం పై చైనా అనుచిత వ్యాఖ్యలు చేసింది. భారత సైన్యానికి క్రమశిక్షణ లేదని, పోరాట సన్నద్ధత లేదని వ్యాఖ్యానించింది. భారత సైన్యం ఆధునికీకరణకు గట్టి ఎదురు దెబ్బ తగిలిందని వ్యాఖ్యానించింది. ఆ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ప్రముఖ మీడియా సంస్థ…