కరోనాకు పుట్టినిల్లుగా చెప్పుకునే చైనాలో ఇప్పుడు క్రమంగా కేసులు పెరుగుతున్నాయి. వూహాన్ నగరంలో పుట్టిన కరోనా, ప్రపంచం మొత్తం వ్యాపించింది. గత మూడేళ్లుగా కరోనాతో ప్రజలు సహజీవనం చేయాల్సి వస్తున్నది. వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినా లాభం లేకుండా పోతున్నది. డెల్టా, ఒమిక్రాన్ వేరియంట్ల వ్యాప్తితో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇదిలా ఉంటే, చైనాలో రెండు మూడు కేసులు నమోదైన నగరాల్లో కఠినమైన లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. ప్రజలెవరినీ బయటకు రానివ్వడంలేదు. గత రెండు వారాలుగా జియాంగ్ సిటీ…
ప్రపంచకుబేరుడు ఎలన్ మస్క్ కు చెందిన టెస్లా కంపెనీ చిక్కుల్లో పడింది. ఇటీవలే టెస్లా కంపెనీ చెందిన షోరూమ్‌ను చైనాలో లాంచ్ చేశారు. జిన్ జియాంగ్ ప్రావిన్స్‌లోని ఉరుమ్‌కిలోలో షోరూమ్‌ను ప్రారంభించారు. ఉరుమ్‌కిలోలో షోరూమ్‌ను ప్రారంభిస్తున్నట్టు ఎలన్ మస్క్ విబోలో ప్రకటించాడు. దీనిపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. అమెరికాకు చెందిన పలు వాణిజ్య సంస్థలు, అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు ఎలన్ మస్క్ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. Read: కోడి పందాలపై హైకోర్టులో పిటిషన్..…
ప్రపంచ దేశాలను అజమాయిషి చేసేందుకు చైనా ఎత్తులు వేస్తున్నది. ఇందులో భాగంగానే ప్రపంచ దేశాల్లో భారీగా పెట్టుబడులు పెడుతూ వాటిని చైనా దారిలోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నది. బీఆర్ఐ ప్రాజెక్టులో భాగంగా పెట్టుబడులు పెడుతున్నది. ముఖ్యంగా చీకటి ఖండం ఆఫ్రికాలో చైనా భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టి ఆ దేశాలను తమవైపు తిప్పుకుంటోంది. కెన్యా లోని స్టార్ టైమ్స్‌లో మీడియాలో భారీ పెట్టుబడులు పెట్టింది. అక్కడి మీడియాను వినియోగించుకొని చైనా తన ప్రాజెక్టులను గురించి ప్రచారం చేసుకుంటోంది.…
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. కేసులు పెరుగుతుండటంతో అనేక దేశాలు ఆంక్షలు విధించాయి. కఠినమైన నిబంధనలు అమలు చేస్తున్నాయి. అయితే, కరోనాకు పుట్టినిల్లైన చైనాలో కరోనా కేసులు, కొత్త వేరియంట్ కేసులు ఎన్ని ఉన్నాయో ఆ దేశం స్పష్టంగా బయటపెట్టడం లేదు. రెండు మూడు కేసులు బయటపడినా నగరాలను లాక్ డౌన్ చేస్తున్నది. తాజాగా యుజ్హౌ నగరంలో లాక్ డౌన్‌ను విధించారు. 1.2 మిలియన్ జనాభా కలిగిన యుజ్హౌ నగరంలో బయటపడింది కేవలం 3 కరోనా…
గతేడాది గాల్వన్ లోయలో చైనా సైనికులు పహారా కాస్తున్న భారత సైన్యంపై పదునైన ఆయుధాలతో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. నిబంధనలకు విరుద్ధంగా చైనీయులు దాడి చేయడంతో దానికి భారత్ కూడా తగిన విధంగా బదులు చెప్పింది. ఈ రగడ తరువాత రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమంటోంది. గాల్వన్ భూభాగం తమదే అంటూ చైనా పదేపదే చెబుతూ వస్తున్నది. భారత్ దానికి ధీటుగా జవాబు ఇస్తూనే ఉన్నది. ఇటీవలే చైనా ఆరుణాల్ ప్రదేశ్ లోని 15…
ప్రపంచవ్యాప్తంగా అగ్ని ప్రమాదాలు భారీ నష్టాన్ని, ప్రాణ నష్టాన్ని కలిగిస్తున్నాయి. చైనాలో ఆదివారం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. భూగర్భ ప్రాంతంలో చోటు చేసుకున్న అగ్నిప్రమాదంలో 9 మంది మృతి చెందినట్లు స్థానిక మీడియా తెలిపింది. ఈశాన్య చైనాలోని డాలియన్ సిటీలోని మార్కెట్ దిగువన ఉన్న అండర్ గ్రౌండ్లో ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో అనేక మంది గాయపడినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరగవచ్చని అంటున్నారు. గాయపడ్డ కార్మికులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి…
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమీ 12 సీరిస్‌ను డిసెంబర్ 28 వ తేదీన రిలీజ్ చేసింది. ఈ ఫోన్ ను రిలీజ్ చేసిన 5 నిమిషాల వ్యవధిలోనే ఏకంగా 1.8 బిలియన్ యునాన్ల స్మార్ట్ఫోన్ల అమ్మకాలు జరిగాయి. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ. 2108 కోట్లు విలువైన షావోమీ 12 సీరిస్ మొబైల్ అమ్మకాలు జరిగాయి. ఈ స్థాయిలో అమ్మకాలు జరగడానికి కారణాలు అనేకం ఉన్నాయి. షావోమీ సంస్థ చైనాలో తొలిసారి కాంపాక్ట్ ఫ్లాగ్షిప్ ఫోన్…
చైనా మరోసారి కుటిలబుద్ధిని చాటుకుంది. అరుణాచల్ ప్రదేశ్‌లోని అనేక ప్రాంతాలకు చైనా పేర్లను పెట్టింది. దీనిని భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది. వెంటనే చైనా పేర్లను వెనక్కి తీసుకోవాలని హెచ్చరించింది. అయితే, చైనా దానికి ససేమిరా అంటోంది. అరుణాచల్ ప్రదేశ్ టిబెట్‌లో భాగస్వామ్యమని, దక్షిణ టిబెట్‌గా తాము పిలుస్తామని, తమ భూభాగంలోని ప్రదేశాలకు పేర్లు పెట్టుకుంటామని, తన సార్వభౌమత్వానికి ఎవరూ అడ్డు వచ్చినా ఊరుకునేది లేదని చైనా స్పష్టం చేసింది. ఆరుణాచల్ ప్రదేశ్‌లోని 15 భూభాగాలకు చైనా పేర్లు…
ప్రపంచంలో సమర్థవంతమైన, అత్యంత శక్తివంతమైన ఆయుధాలను తయారు చేసేందుకు అగ్రరాజ్యాలు సిద్దమవుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, రోబోటిక్ టెక్నాలజీని బేస్ చేసుకొని స్వీయ నియంత్రిత కిల్లర్ రోబోట్స్‌ను తయారు చేసేందుకు చైనా, అమెరికా, రష్యా దేశాలు సన్నాహాలు చేస్తున్నాయి. రోబోటిక్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తరువాత అనేక రంగాల్లోకి రోబోలు ప్రవేశించాయి. అయితే, ఇప్పటి వరకు ప్రొగ్రామ్ ఆపరేటింగ్ లేదా రిమోట్ కంట్రోల్ తో పనిచేసే రోబోలు అందుబాటులో ఉండగా, ఇప్పుడు స్వీయ నియంత్రిత రోబోలను అందుబాటులోకి రాబోతున్నాయి.…