తగ్గినట్టే తగ్గిన కరోనా మహమ్మారి.. మళ్లీ పంజా విసురుతోంది.. ఆసియా ఖండంతో పాటు యూరోప్ దేశాల్లో కరోనా విజృంభిస్తుండటం పట్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పందించింది. ప్రపంచ దేశాలను మరోసారి అలెర్ట్ చేసింది. కరోనా ఇంకా చాలా దృఢంగానే ఉందని వైరస్ సులభంగానే వ్యాపిస్తోందని వెల్లడించింది. వ్యాక్సినేషన్ ప్రక్రియ తగ్గుముఖం పట్టడంతో వ్యాప్తి విస్తృతమవుతున్నట్లు తెలిపింది. వైరస్ ఇంకా పూర్తిగా క్షీణించలేదని, సీజనల్ వ్యాధిలా మారలేదని డబ్ల్యూహెచ్ఓ అత్యవసర విభాగాధిపతి డాక్టర్ మైక్ ర్యాన్ స్పష్టం చేశారు.…
కరోనా వైరస్ పుట్టినిల్లు చైనాలో మళ్లీ కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గత వారం రోజులుగా చైనాలోని పలు నగరాల్లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. దక్షిణ చైనాలోని సాంకేతిక కేంద్రమైన షెన్జెన్లో తాజాగా అధికారులు కఠినమైన లాక్డౌన్ విధించారు. దీంతో షెన్జెన్ నగరంలోని 90 లక్షల మంది ప్రజలు ఇళ్లకు పరిమితం అయ్యారు. మరోవైపు దాదాపు 5లక్షల జనాభా ఉన్న షాన్డాంగ్ ప్రావిన్స్‌లోని యుచెంగ్‌లో కూడా లాక్డౌన్ ఆంక్షలు జారీ చేశారు. రెండు రోజుల కిందట జిలిన్…
కరోనా వైరస్ పుట్టినిల్లు చైనాలో మళ్లీ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఈశాన్య నగరమైన చాంగ్‌చున్‌లో కొత్త వేరియంట్ బయటపడటంతో అధికారులు లాక్డౌన్ విధించారు. దీంతో కఠినంగా ఆంక్షలను అమలు చేస్తున్నారు. 90 లక్షలు ఉన్న చాంగ్‌చున్‌లో కొత్త వేరియంట్ కరోనా వైరస్ చాలా వేగంగా వ్యాపిస్తోందని అధికారులు వెల్లడించారు. దీంతో స్థానికులు ఎవరూ ఇంటి నుంచి బయటకు రావొద్దని ఆంక్షలు పెట్టారు. మరోవైపు ఫ్యామిలీ సభ్యుల్లో ఒకరే నిత్యావసరాల కోసం బయటకు వెళ్లాలని సూచించారు. అది…
ప్రస్తుతం భారత్‌లో కరోనా వైరస్ మహమ్మారి శాంతించింది. ప్రస్తుతం రోజువారీ 5వేల లోపే కేసులు నమోదవుతున్నాయి. అయితే చైనాలో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. దేశంలో కొవిడ్ కేసులను సున్నాకు తేవాలనే చైనా ప్రయత్నాలను కరోనా వమ్ము చేస్తోంది. ఆ దేశంలోని పలు నగరాల్లో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. 2020 మార్చి తర్వాత గత రెండు రోజులుగా అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. చైనాలో ఆదివారం 312 కరోనా కేసులు నమోదుకాగా సోమవారం మరో 214 కరోనా పాజిటివ్…
ఉక్రెయిన్ రష్యా మధ్య వార్ తీవ్రస్థాయిలో జరుగుతున్నది. కీలకమైన నగరాలను రష్యా ఒక్కొక్కటిగా ఆక్రమించుకుంటూ వస్తున్నది. అయితే, కీవ్‌కు సమీపంలో రష్యా సేనలు ప్రవేశించడంతో భీకర పోరు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఉక్రెయిన్‌లో సుమారు 6 వేల మందికి పైగా చైనీయులు ఉన్నారు. వీరంతా ఇప్పుడు ఆ దేశంలోనే చిక్కుకుపోయారు. అక్కడి నుంచి సురక్షితంగా తరలించేందుకు ఎలాంటి అవకాశాలు లేవని, కీవ్ నరగంలో ఉన్న చైనీయులు అర్ధం చేసుకోవాలని చైనా రాయబారి ఫ్యాన్ షియాన్‌రాంగ్ పేర్కొన్నారు. Read:…
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది.. రాజధాని కీవ్‌ను పూర్తిస్థాయిలో ఆధీనంలోకి తీసుకునేలా ముందుకు కదులుతున్నాయి రష్యా బలగాలు.. ఇప్పటికే కీవ్ ఎయిర్‌పోర్ట్‌ను స్వాధీనం చేసుకుంది రష్యా.. మరోవైపు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసరంగా సమావేశం అయ్యింది… రష్యాకు వ్యతిరేకంగా భద్రతా మండలిలో ఓటింగ్ కూడా నిర్వహించారు.. అయితే, ఓటింగ్‌కు మాత్రం భారత్, చైనా దూరంగా ఉన్నాయి.. భద్రతా మండలి 15 సభ్యదేశాల్లో 11 దేశాలు రష్యాకు వ్యతిరేఖంగా ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని ఖండిస్తూ ఓటు వేయగా.. భద్రతా…
ఉక్రెయిన్ను పూర్తిస్థాయిలో స్వాధీనం చేసుకునేలా అడుగులు వేస్తోంది రష్యా… ప్రధాన నగరాలను తమ ఆధీనంలోకి తీసుకునే పనిలోపడిపోయాయి రష్యా బలగాలు.. యుద్ధం వద్దంటూ అన్ని దేశాలు సూచిస్తున్నా.. రష్యా మాత్రం వెనక్కి తగ్గడంలేదు.. ఉక్రెయిన్ నుంచి కూడా కొన్ని ప్రాంతాల్లో ప్రతిఘటన ఎదురవుతోంది.. ఇప్పటికే ఈ వ్యవహారంపై స్పందించిన భారత ప్రధాని నరేంద్ర మోడీ.. రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఫోన్ చేసి ఆరా తీయడంతో పాటు.. చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకుంటే మంచిదని సలహా ఇచ్చిన విషయం…
ఇప్పటివరకు అంతరిక్ష ఆధిపత్యం కోసం పోరాటం చేసిన అగ్రరాజ్యాలు ఇప్పుడు చంద్రునిపై కన్నేశాయి. చంద్రునిపై అనుకూల వాతావరణం కోసం సెర్చ్ చేయడం మొదలుపెట్టాయి. ఇప్పటికే అమెరికా, రష్యా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీలు చంద్రునిపైకి రాకెట్స్ పంపిన సంగతి తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే, చంద్రుని వాతావరణంలోకి ఓ రాకెట్ బూస్టర్ దూసుకొస్తున్నట్టు నిపుణులు పేర్కొన్నారు. మొదట ఇది ఎలన్ మస్క్ కు చెందిన స్పెస్ ఎక్స్ రాకెట్ బూస్టర్ అనుకున్నారని, కానీ, చాలా కాలం క్రితమే స్పెస్…
ప్రస్తుతం బీజింగ్‌లో వింటర్ ఒలింపిక్స్ 2022 జరుగుతున్నది. శీతాకాలంలో నిర్వహించే వింటర్ ఒలింపిక్స్ కోసం మంచు చాలా అవసరం అవుతుంది. సహజసిద్ధంగా మంచు ఉన్న ప్రాంతాల్లోనే వింటర్ ఒలింపిక్స్‌ను నిర్వహించాలి అంటే సాధ్యం కాదు. సహజసిద్ధంగా ఆ ప్రాంతంలో మంచు ఉన్నప్పటికీ క్రీడల నిర్వహణకు ఏ మాత్రం సరిపోదు. దీనికోసమే కృత్రిమంగా మంచును సృష్టిస్తుంటారు. 1980 దశకం నుంచి వింటర్ ఒలింపిక్స్ కోసం కొంతమేర మంచుకు కృత్రిమంగా సృష్టిస్తూనే ఉన్నారు. గతంలో రష్యాలోని సోచీలో నిర్వహించిన వింటర్…
హైదరాబాద్ శంషాబాద్ శివారులో సమతా విగ్రహాన్ని ఇటీవల ప్రధాని మోదీ ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. అయితే సమతా విగ్రహం తయారీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. బీజేపీ ఆత్మనిర్భర్ భారత్ అంటూ ప్రచారం చేసుకుంటోందని… సమతా విగ్రహాన్ని చైనాలో తయారుచేశారని.. ఆత్మనిర్భర్ భారత్ అంటే చైనాపై ఆధారపడటమా అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ఈ మేరకు ట్విట్టర్లో ఆయన పోస్ట్ చేశారు. రాహుల్ గాంధీ చేసిన విమర్శలపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పందించారు. ఈ వ్యాఖ్యలతో…