ఇప్పటివరకు అంతరిక్ష ఆధిపత్యం కోసం పోరాటం చేసిన అగ్రరాజ్యాలు ఇప్పుడు చంద్రునిపై కన్నేశాయి. చంద్రునిపై అనుకూల వాతావరణం కోసం సెర్చ్ చేయడం మొదలుపెట్టాయి. ఇప్పటికే అమెరికా, రష్యా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీలు చంద్రునిపైకి రాకెట్స్ పంపిన సంగతి తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే, చంద్రుని వాతావరణంలోకి ఓ రాకెట్ బూస్టర్ దూసుకొస్తున్నట్టు నిపుణులు పేర్కొన్నారు. మొదట ఇది ఎలన్ మస్క్ కు చెందిన స్పెస్ ఎక్స్ రాకెట్ బూస్టర్ అనుకున్నారని, కానీ, చాలా కాలం క్రితమే స్పెస్ ఎక్స్ బూస్టర్ భూవాతారవణంలోకి ప్రవేశించి మండిపోయిందని, ఇప్పుడు చంద్రునివైపు దూసుకొస్తున్న బూస్టర్ చైనాకు చెందినదిగా నిపుణులు చెబుతున్నారు.
Read: Russia Ukraine Crisis: ఉక్రెయిన్ నుంచి దాడులు మొదలయ్యాయి… రష్యా ఆరోపణ…
మార్చి నాలుగో తేదీన ఈ బూస్టర్ చంద్రుడిని ఢీకొట్టే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే, ఈ బూస్టర్ తమది కాదని, తాము ప్రయోగించిన ఛేంజ్ 5టి 1ప్రయోగం తరువాత బూస్టర్ భూవాతారవణంలోకి ప్రవేశించి మండిపోయినట్టు చైనా విదేశాంగ శాఖాధికారులు చెబుతున్నారు. మాది కాదని స్పెస్ ఎక్స్, మాది కాదని చైనా చెబుతున్న ఆ బూస్టర్ మరెవరిదై ఉంటుంది.