ఉక్రెయిన్‌ను పూర్తిస్థాయిలో స్వాధీనం చేసుకునేలా అడుగులు వేస్తోంది రష్యా… ప్రధాన నగరాలను తమ ఆధీనంలోకి తీసుకునే పనిలోపడిపోయాయి రష్యా బలగాలు.. యుద్ధం వద్దంటూ అన్ని దేశాలు సూచిస్తున్నా.. రష్యా మాత్రం వెనక్కి తగ్గడంలేదు.. ఉక్రెయిన్ నుంచి కూడా కొన్ని ప్రాంతాల్లో ప్రతిఘటన ఎదురవుతోంది.. ఇప్పటికే ఈ వ్యవహారంపై స్పందించిన భారత ప్రధాని నరేంద్ర మోడీ.. రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఫోన్ చేసి ఆరా తీయడంతో పాటు.. చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకుంటే మంచిదని సలహా ఇచ్చిన విషయం తెలిసిందే.. కాగా, ఇప్పుడు రష్యా-ఉక్రెయిన్ వార్‌పై డ్రాగన్ కంట్రీ చైనా కూడా స్పందించింది..
Read Also: Tirumala: శ్రీవారి హుండీ ఆదాయం మరో రికార్డు..
రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఫోన్ చేశారు చైనా ప్రెసిడెంట్ జీ జిన్‌పింగ్.. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. చర్చల ద్వారా సమస్య పరిష్కారానికి రష్యా, ఉక్రెయిన్‌కు సహకారం అందజేస్తామని ప్రకటించింది చైనా.. యుద్ధం ఆపాలని పుతిన్‌ను కోరారు జిన్‌పింగ్.. కాగా, మిలటరీ ఆపరేషన్ చేపట్టడానికి గల కారణాలను జిన్ పింగ్‌కు.. పుతిన్ వివరించినట్లు చైనా మీడియా పేర్కొంది.. ఉక్రెయిన్‌తో చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు కూడా ఇప్పటికే పుతిన్ ప్రకటించిన విషయం తెలిసిందే.