Harry Brook: “మా ఓటమికి నేనే కారణం”.. ఇంగ్లాండ్ కెప్టెన్ బ్రూక్ భావోద్వేగం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harry Brook: ముంబైలోని వాంఖడే స్టేడియంలో నిన్న జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగింది. ఈ బ్యాచ్‌లో చివరకు భారత్ గెలిచి ఫైనల్‌కు చేరింది. ఇంగ్లాండ్ సైతం వీరోచిత పోరాటం చేసింది. చివరివరకు పోరాడి కేవలం ఏడు పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్ అనంతరం ఇంగ్లాండ్ జట్టు సారథి హ్యారీ బ్రూక్ భావోద్వేగ వ్యాఖ్యలు చేశాడు. తన వల్లే జట్టు ఓటమి పాలైందని.. దీనికి తానే బాధ్యత తీసుకుంటున్నట్లు వెల్లడించాడు. సంజూ శామ్సన్ ఇచ్చిన సులభమైన క్యాచ్‌ను వదిలేయడం మ్యాచ్ మలుపు తిరిగిన క్షణమని స్పష్టం చేశాడు. మ్యాచ్ అనంతరం తన పొరపాటును అంగీకరించాడు బ్రూక్. సాధారణంగా క్యాచ్‌లు మిస్ చేయకుండా పట్టిన జట్టే మ్యాచ్ గెలుస్తుందని చెప్పే మాట నిజమన్నాడు. కానీ తమకు అదృష్టం కలిసిరాలేదని వ్యాఖ్యానించాడు. ఫీల్డింగ్‌లో కొన్ని చిన్న పొరపాట్లు జరిగాయని, అవే చివరకు జట్టుకు నష్టాన్ని తెచ్చాయని అన్నాడు.
READ MORE: Iran-Gulf War: గల్ఫ్‌లో ఉద్రిక్తతలు.. ఆయిల్ రిఫైనరీలే లక్ష్యంగా ఇరాన్ భీకర దాడులు
Also Read
- Harish Rao: గోదావరి-కావేరి లింక్‌పై కుట్ర జరుగుతోంది.. మరో నీటి ఉద్యమం మొదలు పెడతాం..
- Maharashtra: మహా దారుణం.. వివాహితపై భర్త స్నేహితులు గ్యాంగ్‌రేప్
- Delhi-Tihar Jail: తీహార్ జైలులో సీజేపీ నేతలకు స్పెషల్ ట్రీట్మెంట్..
- LK Advani Health Update: ఐసీయూలో మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ.. హెల్త్ బులెటిన్ విడుదల..
ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయం తీసుకున్న విషయంపైనా బ్రూక్ వివరించాడు. “పిచ్ తాజాగా ఉండడంతో మొదట్లో బౌలర్లకు కొంత సహాయం ఉంటుందని భావించాం. సెకండ్ ఇన్నింగ్స్‌లో తేమ ప్రభావం ఉండొచ్చని ఊహించి ముందుగా బౌలింగ్ చూజ్ చేసుకున్నాం. కానీ పిచ్ బ్యాటర్లకు బాగా సహకరించింది. భారత్ ఆటగాళ్లు అద్భుతంగా ఆడారు. మా బౌలర్లు కొన్ని సందర్భాల్లో ప్రణాళిక ప్రకారం బౌలింగ్ చేయలేకపోయారు. ప్రపంచ స్థాయి బ్యాటర్లు ఎదుట చిన్న తప్పిదం చేసినా బంతి వెంటనే మైదానం బయటకు వెళ్లిపోతుంది. భారత్ బ్యాటర్లు అలాంటి అవకాశాలను బాగా ఉపయోగించుకున్నారు.” అని వెల్లడించాడు. ఇక ఇంగ్లాండ్ తరఫున జాకబ్ బెతెల్ అద్భుతంగా పోరాడాడు. ధైర్యంగా ఆడుతూ బౌండరీలు, సిక్సర్లు కొడుతూ జట్టును పోటీలో నిలిపాడు. బెతెల్ ఇన్నింగ్స్ గురించి మాట్లాడిన బ్రూక్ స్పందించాడు. అతడిని ప్రశంసలతో ముంచెత్తాడు. భవిష్యత్తులో బెతెల్ ఇంగ్లాండ్ జట్టుకు కీలక ఆటగాడిగా ఎదుగుతాడని విశ్వాసం వ్యక్తం చేశాడు. మొదటి బంతి నుంచే ధైర్యంగా ఆడుతూ తన ప్రతిభను ప్రపంచానికి చూపించాడని చెప్పాడు.
READ MORE: Road Accident: జాతీయ రహదారిపై అదుపుతప్పిన కారు.. ఓ ప్రాణం బలి!
తాజావార్తలు
-
Harish Rao: గోదావరి-కావేరి లింక్‌పై కుట్ర జరుగుతోంది.. మరో నీటి ఉద్యమం మొదలు పెడతాం..
-
Maharashtra: మహా దారుణం.. వివాహితపై భర్త స్నేహితులు గ్యాంగ్‌రేప్
-
Delhi-Tihar Jail: తీహార్ జైలులో సీజేపీ నేతలకు స్పెషల్ ట్రీట్మెంట్..
-
LK Advani Health Update: ఐసీయూలో మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ.. హెల్త్ బులెటిన్ విడుదల..
-
Janasena First List: 2 కార్పొరేషన్లు, 12 మున్సిపాలిటీలకు జనసేన అభ్యర్థులు ఖరారు.. తొలి జాబితా పూర్తి వివరాలు ఇవే
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!
-
Kavya Maran – Anirudh Ravichander పెళ్లి ఫిక్స్.! గ్రీస్‌లో పెళ్లి, చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్.?
-
Yoo Ji-won: ఫినిషింగ్ లైన్‌కు 500 మీటర్ల దూరంలో కుప్పకూలిన రన్నింగ్ ఇన్ఫ్లుయెన్సర్.. 25 ఏళ్లకే మృతి..!