Apple Production: ఇండియాలో మరింతగా యాపిల్ ఫోన్ల తయారీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశ్వవ్యాప్తంగా యాపిల్ ఫోన్ అత్యంత విలువైనదని అందరికీ తెలుసు. ఎక్కువగా అమ్ముడయ్యే బ్రాండ్ కూడా అదే. అయితే, యాపిల్ సంస్థ తన ఉత్పత్తి కేంద్రాలను చైనా నుంచి ఇతర దేశాలకు విస్తరిస్తోంది. చైనాకు బదులు ఇండియాలో తమ ప్రొడక్ట్‌ల తయారీని పెంచాలని భావిస్తోంది. కొన్ని నెలల కిందట లేటెస్ట్ మోడల్ అయిన ఐఫోన్ 13 సిరీస్‌ను కూడా ఇండియాలో తయారు చేయడం ప్రారంభించింది. ఇక్కడి నుంచే ఎగుమతులు పెంచుతోంది. యాపిల్ ప్రొడక్ట్‌లు కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరర్ల ద్వారా తయారవుతాయి
కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా మొబైల్ ఫోన్ల తయారీపై ప్రభావం పడింది. కోవిడ్ కి కేరాఫ్ అడ్రస్ అయిన చైనా అమలు చేస్తున్న జీరో కొవిడ్ పాలసీతో కంపెనీ సేల్స్, ప్రొడక్షన్ బాగా తగ్గాయి. ప్రస్తుత క్వార్టర్‌లో 8 బిలియన్ డాలర్ల విలువైన సేల్స్ తగ్గుతాయని యాపిల్ కిందటి నెలలో ప్రకటించింది. . పవర్ కొరత వలన కిందటేడాది కూడా యాపిల్ ప్రొడక్షన్‌లో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఉక్రెయిన్–రష్యా యుద్ధంలో రష్యాకు చైనా మద్ధతిస్తోందనే ఆరోపణలు కూడా వెస్ట్రన్ కంపెనీలకు కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇందుకోసమే తమ ప్రొడక్షన్ కెపాసిటీని చైనాకు వెలుపల ఇండియా, వియత్నాం వంటి దేశాలకు విస్తరించాలని యాపిల్ చూస్తోంది.
Also Read
- BSNL Insurance Offer: BSNL కస్టమర్లకు ఉచిత ఇన్సూరెన్స్.. రూ.1 లక్ష యాక్సిడెంటల్ డెత్ కవర్, రూ.10 వేల సైబర్ ప్రొటెక్షన్!
- Acerpure Nitro QLED TV: 100 ఇంచెస్ స్క్రీన్‌తో Acerpure Nitro TV లాంచ్.. 120Hz డిస్‌ప్లే, Dolby Vision, 65W సౌండ్!
- Poco C95 Pro: పోకో C95 Pro లాంచ్.. 7500mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే, 50MP కెమెరా!
- TRAI New Order: కోట్లాది మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. చౌకైన రీఛార్జ్ ప్లాన్లపై TRAI కీలక ఆదేశాలు
గ్లోబల్ సేల్స్ లో ఐఫోన్లు మందున్నాయి. ఐఫోన్లలో 3.1 శాతం ఇండియాలోనే తయారవుతున్న సంగతి తెలిసిందే. ఈవాటాను ఈ ఏడాది 6–7 శాతానికి పెంచుకోవాలని యాపిల్ చూస్తోందని నిపుణులు చెబుతున్నారు. మిగతా దేశాలతో పోలిస్తే ఇండియాలో ప్రొడక్షన్ కాస్ట్ తక్కువగా వుంటుంది. యాపిల్ కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరర్లయిన ఫాక్స్‌కాన్, విస్ట్రన్ కార్పొరేషన్లు ఇండియాలో తమ ప్లాంట్లను ఏర్పాటు చేశాయి. వీటిని విస్తరిస్తున్నాయి. దీంతో ఖర్చు కూడా తగ్గుతోందని అవి చెబుతున్నాయి. రానున్న కాలంలో యాపిల్ ఫోన్లు మరింత అందుబాటులోకి రావాలంటే ఇండియా, వియత్నాం వంటి దేశాలే బెటరని యాపిల్ సంస్థ భావిస్తోంది.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!