ఇరాన్ శక్తివంతమైన భూకంపంతో వణికింది. శనివారం తెల్లవారుజామున దక్షిణ ఇరాన్లో రిక్టర్ స్కేల్ పై 6.0తో భూకంపం సంభవించింది. హెర్మోజ్ ప్రావిన్స్ లోని బందర్ అబ్బాస్ నగరానికి నైరుతి దిశలో 100 కిలోమీటర్ల దూరంలో భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం నమోదు అయింది. ఇప్పటి వరకు అందిన సమచారం ప్రకారం ఎనిమిది మందికి గాయాలు కాగా.. ముగ్గురు మరణించినట్లు తెలుస్తోంది. మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఇరాన్ భూకంపం వల్ల సరిహద్దు దేశాలైన…
ప్రస్తుతం ప్రపంచ ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్లుతున్నాయి. ఓ వైపు పెరుగుతున్న ఇంధన ధరలు, మరోవైపు కాలుష్యం ఈ రెండింటి నుంచి తప్పించుకునేందుకు ప్రభుత్వాలు ఎలక్ట్రిక్ వాహనాల వైపు నజర్ పెడుతున్నాయి. ఇప్పటికే ఇండియాలోని పలు రాష్ట్రాలు ఈవీ లకు పలు రాయితీలు ప్రకటిస్తున్నారు. ఇటు టూవీలర్లే కాకుండా ఎలక్ట్రిక్ కార్ల సేల్స్ కూడా పెరిగాయి. ముఖ్యంగా ఇండియాలో టాటా నెక్సాన్ ఈవీ, ఎంజీ జెడ్ ఎస్ ఈవీ, హ్యుందాయ్ కోనా, మహీంద్రా, కియా నుంచి కూడా…
China last week blocked a joint proposal by India and the US to list Pakistan-based terrorist Abdul Rehman Makki as a global terrorist under the Al-Qaeda Sanctions Committee of the Security Council.
అవకాశం దొరికితే భారత్ ను ఎలా ఇరికించాలనే ఆలోచనతోనే ఉంటుంది డ్రాగన్ కంట్రీ చైనా. మరోసారి తన భారత వ్యతిరేకతను బయటపెట్టింది. పాకిస్తాన్ కు చెందిన ఉగ్రవాదిని, అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించే విషయంలో ఐక్యరాజ్యసమితిలో మోకాలడ్డు పెట్టింది. యూఎన్ సెక్యురిటీ కౌన్సిల్ లో ఐఎస్ఐఎస్, అల్ ఖైదా ఆంక్షల కమిటీ కింద పాక్ ఉగ్రవాద అబ్దుల్ రెహ్మాన్ మక్కీని ‘ గ్లోబల్ టెర్రరిస్ట్’గా గుర్తించాలని భారత్, యూఎస్ఏ చేసిన ప్రతిపాదనను చైనా తన వీటో పవర్ తో…
కరోనా నేపథ్యంలో భారతీయులపై విధించిన వీసా నిషేధాన్ని చైనా ఎత్తేసింది. చైనా విధించిన ఆంక్షల వల్ల గత రెండేళ్లుగా స్వదేశంలోనే ఆగిపోయిన భారతీయ నిపుణులు, వారి కుటుంబ సభ్యులకు డ్రాగన్ శుభవార్త తెలిపింది. భారతీయ ప్రొఫెషనల్స్, వారి కుటుంబసభ్యులకు వీసా మంజూరు ప్రణాళికను సోమవారం ప్రకటించింది. ఈ మేరకు భారత్‌లోని చైనా రాయబార కార్యాలయం కొవిడ్ వీసా పాలసీ అప్డేట్ చేసిం ది. వీసా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించింది. భారతీయులతో పాటు చైనీయుల కుటుంబసభ్యులు, చైనాలో శాశ్వత…
బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ మహ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యల దుమారం చెలరేగుతూనే ఉంది. గత వారం నుంచి దేశంలోని పలు ప్రాంతాల్లో ముస్లింలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఈ వివాదంపై ఇస్లామిక్ ప్రపంచం భారత్ కు తమ నిరసననను తెలియజేశాయి. ఖతార్, మలేషియా, ఇరాక్, యూఏఈ, సౌదీ ఇలా చాలా దేశాలు భారత రాయబారులకు నిరసన తెలిపాయి. దీనికి బదులుగా ఇండియాకు కూడా వివరణ ఇచ్చింది. వ్యక్తి గత వ్యాఖ్యలను ప్రభుత్వానికి…
రెండు వేవ్ లు సృష్టించిన విధ్వంసం ప్రపంచం ఇంకా మర్చిపోలేదు..ఒమిక్రాన్ చడీ చప్పుడు లేకుండా దాటిపోయినా, ఇంకా కరోనా భయం పోలేదు. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు మళ్లీ వైరస్ వ్యాప్తి పెరిగింది. దేశంలో కరోనా వైరస్ క్రమంగా విస్తరిస్తోంది. లేటెస్ట్గా కొత్త కేసులు 8 వేలకు పైగా రిపోర్ట్ అయ్యాయి. దాంతో యాక్టివ్ కేసుల సంఖ్య 40 వేలను దాటేసింది. శుక్రవారం దాదాపు మూడున్నర లక్షలమందికి టెస్టులు చేస్తే, అందులో 8,329 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది.…
తైవాన్ విషయంలో తాము యుద్ధానికి కూడా సిద్ధమని చైనా స్పష్టం చేసింది. ఈ విషయంలో అమెరికాకు చైనా స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చింది. చైనా తైవాన్ను తన భూభాగంగా భావించడమే కాకుండా ఏదో ఒకరోజు స్వాధీనం చేసుకుంటామని ప్రకటించిన విషయం తెలిసిందే. తైవాన్‌కు స్వాతంత్య్రం కావాలని ప్రకటిస్తే.. యుద్ధం ప్రారంభించడానికి ఏ మాత్రం వెనుకాడబోమని చైనా తేల్చిచెప్పింది. సింగపూర్ వేదికగా జరిగిన సమావేశంలో అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్‌కు చైనా రక్షణ మంత్రి వీఫెంగ్ తైవాన్ను…
డ్రాగన్ దేశం తన కుయుక్తులను మానడం లేదు. ఒక వైపు నమ్మిస్తూనే మరోవైపు సరిహద్దుల్లో ఉద్రిక్తతలను పెంచుతోంది. లడఖ్ సరిహద్దు వెంబడి నిర్మాణాలను చేపడుతోంది. సైనిక సన్నద్ధతను పెంచుకుంటోంది. ఇటీవల భారత్ సరిహద్దు వెంబడి చైనా మిలిటరీ మౌలిక సదుపాయాల అభివృద్ధి ఆందోళనకరమని అమెరికన్ మిలటరీ అధికారి అభివర్ణించిన తరుణంలో మరో ఘటన బయటపడింది. తూర్పు లడఖ్ ను అనుకుని ఉన్న చైనా హోటాన్ ఎయిర్ బెస్ వద్ద అత్యాధునిక పైటర్ జెట్లను మోహరిస్తున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.…
చైనాలోని యాంగ్జీ నదిపై నిర్మించిన త్రీగోర్జెస్ డ్యామ్ ప్రపంచంలోనే అతి పెద్ద డ్యామ్. ఈ డ్యామ్ 2.33 కిలోమీటర్ల పొడవు. 181 మీటర్ల ఎత్తు కలిగి ఉంటుంది. ఈ మేరకు 660 కిలోమీటర్ల పొడవున రిజర్వాయర్ ఏర్పడింది. రిజర్వాయర్‌లో సముద్ర మట్టంకన్నా సుమారు 175 మీటర్ల ఎత్తున నిలిచిన నీటి బరువు ఏకంగా 39 వేల కోట్ల కిలోలు ఉంటుంది. అయితే ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. మరోవైపు చూస్తే ఈ డ్యామ్ వల్ల మానవాళికి ముప్పు…