China Crisis: కఠిన లాక్ డౌన్.. అల్లాడుతున్న జనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనాకు పుట్టినిలైన చైనాను మహమ్మారి మరోసారి కుదిపేస్తోంది. షాంఘైలో కఠినంగా లాక్‌డౌన్ అమలు చేస్తున్నారు. దీంతో ఆకలి కేకలతో చైనా అల్లాడిపోతోంది. కరోనా కఠిన లాక్‌డౌన్‌తో జనం అల్లాడిపోతున్నారు. తినడానికి తిండి దొరకడం లేదని ఆర్తనాదాలు చేస్తున్నారు. ఆకలితో అలమటిస్తున్నా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ నిత్యం 20వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఆదివారం గరిష్ఠంగా ఒక్కరోజే 25 వేల కేసులు రికార్డయ్యాయి. మార్చిలో కరోనా తీవ్రత పెరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు లక్షా 70 వేల కేసులు వెలుగుచూశాయి.
కరోనా కట్టడిలో భాగంగా ఏప్రిల్ 1 నుంచి షాంఘై మహా నగరంలో లాక్‌డౌన్ విధిస్తున్నారు. మొదట 5 రోజులే లాక్‌డౌన్ విధిస్తామన్న అధికారులు..వైరస్ ఉద్ధృతి తగ్గకపోవడంతో దాన్ని కంటిన్యూ చేశారు. దాంతో ప్రజల్లో అసహనం పెరిగిపోతోంది. ఓవైపు ఇళ్లకే పరిమితం కావడం, మరోవైపు నిత్యవసరాల కొరతతో షాంఘై వాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వృద్ధులకు ఔషధాలు పొందడం కూడా ఇబ్బందిగా మారింది. ఇలా కనీసం తిండి కూడా దొరకడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న షాంఘై పౌరులు భవనాల కిటికీలు, బాల్కనీల్లోకి వచ్చి పెద్దగా అరుస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు.
Also Read
- Trump: ‘మీరు ఇక్కడ ఉండకూడదు’.. యూఎన్‌లో ఓ రిపోర్టర్‌పై ట్రంప్ ఫైర్
- Trump: ఒప్పందం కుదుర్చుకోండి.. లేదంటే నరకానికి పంపిస్తాం.. ప్రపంచ నేతల ముందు ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్
- Trump: అమెరికా అత్యంత శక్తివంతంగా తయారైంది.. యూఎన్‌లో ట్రంప్ కీలక ప్రసంగం
- India-Turkey: ‘తత్వం బోధపడినట్లుంది’.. భారత్‌పై ఆధారపడుతున్న టర్కీ.. కారణమేంటో తెలిస్తే..!
లాక్‌డౌన్ కారణంగా ఆహారం, నిత్యవసరాలను స్థానిక అధికారులు పంపిణీ చేస్తున్నా వాటి కొరత వేధిస్తోంది. సూపర్ మార్కెట్ల వద్ద ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడమే కాకుండా వాటిని లూటీ చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మరోవైపు షాంఘై వాసుల ఆకలి కేకలపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలా చేయడం వల్ల వైరస్ మరింత వ్యాపిస్తుందని చెబుతున్నారు. దీంతో డ్రోన్లను రంగంలోకి దింపిన అధికారులు.. కోరికలను నియంత్రించుకోండి. పాటలు పాడడానికి కిటికీలు తెరవొద్దని హెచ్చరికలు చేస్తున్నారు.
ఇంకోవైపు వైద్య సిబ్బంది కూడా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. ఓ కొవిడ్ ఐసోలేషన్‌లో వైద్యుడు కుప్పుకూలిపోయిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఐసోలేషన్ కేంద్రాల్లోనే వారికి చికిత్స అందిస్తున్నట్లు పరిశీలకులు చెబుతున్నారు. మొత్తంగా కరోనా మహమ్మారి చైనాల్లో కల్లోలం సృష్టిస్తోంది.
తాజావార్తలు
-
Jadal Look: “మీమ్ మెటీరియల్ అవుతానేమో అని భయపడ్డా”.. ‘ది ప్యారడైజ్’ లుక్‌పై నాని షాకింగ్ కామెంట్స్!
-
Priyanka Gandhi: ‘మహిళలకు భద్రత లేకపోతే ఎన్ని పథకాలు పెడితే ఏం లాభం?’.. బీహార్, ఢిల్లీ ఘటనలపై ప్రియాంక గాంధీ ఆవేదన
-
Minister Keerthana Health Controversy: మంత్రి కీర్తన లండన్ వెళ్లకపోవడంపై వివాదం.. అసలు కారణం ఇదేనా?
-
Success Story: యూపీఎస్సీ కోసం 16 ప్రభుత్వ ఉద్యోగాలను తిరస్కరించింది.. కట్ చేస్తే ఐపీఎస్..
-
Trump: ‘మీరు ఇక్కడ ఉండకూడదు’.. యూఎన్‌లో ఓ రిపోర్టర్‌పై ట్రంప్ ఫైర్
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!