India-China: చైనా కుయుక్తులు..లడఖ్ సరిహద్దుల్లో ఫైటర్ జెట్ల మోహరింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డ్రాగన్ దేశం తన కుయుక్తులను మానడం లేదు. ఒక వైపు నమ్మిస్తూనే మరోవైపు సరిహద్దుల్లో ఉద్రిక్తతలను పెంచుతోంది. లడఖ్ సరిహద్దు వెంబడి నిర్మాణాలను చేపడుతోంది. సైనిక సన్నద్ధతను పెంచుకుంటోంది. ఇటీవల భారత్ సరిహద్దు వెంబడి చైనా మిలిటరీ మౌలిక సదుపాయాల అభివృద్ధి ఆందోళనకరమని అమెరికన్ మిలటరీ అధికారి అభివర్ణించిన తరుణంలో మరో ఘటన బయటపడింది.
తూర్పు లడఖ్ ను అనుకుని ఉన్న చైనా హోటాన్ ఎయిర్ బెస్ వద్ద అత్యాధునిక పైటర్ జెట్లను మోహరిస్తున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ ఎయిర్ బేస్ భారత సరిహద్దును అనుకుని ఉంది. ఇందులో 25 వరకు ఫ్రంట్‌లైన్ విమానాలను మోహరించినట్లు తేలింది. నివేదిక ప్రకారం ఇందులో చైనా అత్యాధునిక జే-11, జే-20 విమానాలు ఉన్నట్లు తేలింది. అంతకు ముందు అక్కడ మిగ్-21 విమానాలు మాత్రమే ఉండేవి. కానీ ప్రస్తుతం వాటి స్థానంలో మరింత సామర్థ్యం మరియు అధునాతన విమానాలు మరియు పెద్ద సంఖ్యలో మోహరించినట్లు తెలుస్తోంది.
Also Read
- Mary Millben: CJPకి అమెరికా నుంచి నిధులు.. అమెరికన్ సింగర్ సంచలన ఆరోపణలు..
- Gold Keep In House: ఇంట్లో బంగారం, వెండి ఎంత ఉండాలో తెలుసా.. ఇవిగో రూల్స్..
- Farmer Relief: కరువు వేళ రైతులకు దీపావళి కానుక.. ప్రతి రైతు ఖాతాలో రూ.5,000..!
- Employees Bonus: పండుగ వేళ 10 లక్షల మంది ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. 78 రోజుల బోనస్‌కు క్యాబినెట్ ఆమోదం?
ఇదిలా ఉంటే భారత భూభాగానికి దగ్గరగా చైనా కొత్త ఎయిర్ ఫీల్డ్ లను నిర్మిస్తోంది. ఇవి తక్కువ ఎత్తుల నుంచి ఆపరేషన్ లు నిర్వహించడానికి వీలు కల్గించేవిగా ఉన్నాయి. ఇటీవల యూఎస్ జనరల్ చార్లెస్ ఎ ఫ్లిన్, చైనా వెస్ట్రన్ థియేటర్ కమాండ్‌లో చేస్తున్న మౌలిక సదుపాయాలు ఆందోళనకరంగా ఉన్నాయని అన్నాడు.
పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ కార్యకలాపాలపై భారత్ నిశితంగా గమనిస్తోంది. అరుణాచల్ ప్రదేశ్ నుంచి లఖడ్ వరకు ఇండియా ఆర్మీ అప్రమత్తంగా ఉంది. హోటాన్‌తో పాటు, జిన్‌జియాంగ్, టిబెట్ ప్రాంతాల్లోని గార్ గున్సా, కాష్‌ఘర్, హాపింగ్, డ్కోంకా ద్జోంగ్, లింజి, పంగట్ ఎయిర్‌బేస్‌లపై కూడా ఇండియా కన్నెసింది. ఎల్ఏసీ వైపు చైనా బలగాలకు ధీటుగా ఇండియా కూడా ఆర్మీని పెంచుతోంది. సుఖోయ్-30ఎంకేఐ, మిగ్-29, మిరాజ్ -2000 ఫైటర్ జెట్లను ఫార్వర్డ్ ఎయిర్ బేస్ ల వద్ద మోహరించింది.
తాజావార్తలు
-
AP Local Body Election Schedule 2026: ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.. పూర్తి షెడ్యూల్ ఇదే..
-
Yash: చేసిన తప్పునే మళ్ళీ మళ్ళీ చేస్తున్న యష్?
-
Airtel rs348 vs rs349 Recharge Plan: కేవలం రూ.1 తేడా.. ఎయిర్‌టెల్‌లో రూ.348, రూ.349 ప్లాన్స్.. ఏది బెస్ట్ అంటే?
-
Tamannaah: బోల్డ్ సీక్వెల్లో తమన్నా? విద్యాబాలన్ మార్క్‌ను దాటగలదా!
-
Mary Millben: CJPకి అమెరికా నుంచి నిధులు.. అమెరికన్ సింగర్ సంచలన ఆరోపణలు..
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..