సీఎం చంద్రబాబుతో సినీ హీరో సోనూసూద్ సమావేశం అయ్యారు. తమ ట్రస్ట్ వివరాలు సీఎంకు సోనుసూద్ వివరించారు. తన ట్రస్ట్ తరఫున ఏపీ ప్రభుత్వానికి అంబులెన్స్ లు అందించనున్నారు సోనుసూద్. ఇక ఆయన మాట్లాడుతూ తెలుగు ప్రజలు నా గుండెల్లో ఉంటారు, తెలుగు ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు అని తెలిపారు. ఇవాళ మా ట్రస్ట్ తరపున అంబులెన్స్ లు ప్రభుత్వానికి అందించాము, సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఏపీ అభివృద్ధి జరుగుతోంది అన్నారు. KP Chowdary: డ్రగ్స్ కేసు…
పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్‌పై వైసీపీ సీనియర్ నేత బుగ్గన రాజంద్రనాథ్‌రెడ్డి స్పందించారు. నిర్మలమ్మ బడ్జె్ట్ సంతృప్తి నివ్వలేదన్నారు.
టీడీపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. టీడీపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని.. పార్టీ ఫిరాయింపులను టీడీపీ నాయకులు ప్రోత్సహిస్తున్నారన్నారని మండిపడ్డారు.
ఏ నాయకుడు చేయని సాహసం నారా లోకేష్ చేశారని తెలిపారు. రాష్ట్రంలోని 11 ఉమ్మడి జిల్లాల్లో దాదాపు 2 వేల కిలోమీటర్ల పైచిలుకు పాదయాత్ర చేసిన ఘనత లోకేష్ కే దక్కుతుందని వెల్లడించారు. ఎందరో నాయకులు పాదయాత్రలు చేశారు.. అన్నీంటిని తలదన్నేలా రాష్ట్రంలోని మండలాలు, గ్రామాల్లో నారా లోకేష్ పర్యటించారు అని మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.
BC Janardhan Reddy: గతంలో మన రోడ్లను ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి చూశారు అని రోడ్లు భవనాలశాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. వైసీపీ ప్రభుత్వ హయంలో మన రోడ్లపై పక్క రాష్టాలు జోకులు కూడా వేశాయని పేర్కొన్నారు. మొత్తం రూ. 3, 014 కోట్లుతో పనులు చేస్తున్నాం.. రూ. 94 కోట్లు ఏలూరు జిల్లాకు కేటాయించాం అన్నారు.
Chandrababu: నీతి ఆయోగ్ నివేదికపై మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఐదేళ్ల పాలన వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బీహార్ కంటే కిందకు పడిపోయిందని ఆరోపించారు.
బీసీలను పార్లమెంట్ మెట్లు ఎక్కించిన ఘనత టీడీపీది.. బీసీలకు నూతన పథకాలు ప్రారంభమయ్యాయంటే.. అది టీడీపీ ప్రభుత్వంలోనే.. బీసీలకు రిజర్వేషన్లు పెట్టిన ఘనత చంద్రబాబుది.. దావోస్, అమెరికాలాంటి దేశాల్లో కూడా బీసీలు ఉద్యోగాలు చేసే స్థాయికి ఎదిగారంటే చంద్రబాబు చేసిన కృషి కారణం అని రామ్మోహన్ నాయుడు చెప్పుకొచ్చారు.
విజయవాడ కొండపావులూరులో ఎన్డీఆర్ఎఫ్ 20వ వ్యవస్థాపక దినోత్సవంలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ప్రోటోకాల్ ప్రకారం శిలాఫలకం టెంట్ దగ్గర కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ముఖ్యమంత్రి చంద్రబాబుకు మాత్రమే కుర్చీలు వేశారు అధికారులు.
సీఎం చంద్రబాబు నేతృత్వంలో 9 మంది బృందం దావోస్ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నెల 20 నుంచి 24 వరకు నాలుగు రోజుల పాటు దావోస్‌లో పర్యటించనున్నారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగే ప్రపంచ ఆర్ధిక సదస్సు (వరల్డ్ ఎకానామిక్ ఫోరం)లో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు.