Chandrababu: నీతి ఆయోగ్ నివేదికపై మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఐదేళ్ల పాలన వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బీహార్ కంటే కిందకు పడిపోయిందని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలకు ఈ వాస్తవాలు అన్నీ తెలియాలి.. 11,114 కోట్లు స్టీల్ ప్లాంట్ కు, పోలవరానికి 12,750 కోట్లు, అమరావతికి అప్పుగా 15 వేల కోట్ల రూపాయలు ఇప్పించారు అని ఆయన పేర్కొన్నారు. వాటిని తక్షణం పూర్తి చేయాలి.. అక్కడి నుంచి నిధులు మళ్లించలేను అన్నారు. మాట తప్పడం ఇష్టం లేక ప్రజలకు నిజం చెబుతున్నా అని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.
Read Also: Ambati Rambabu: అప్పుల పేరుతో చంద్రబాబు పథకాలు అమలు చేయడం లేదు..
అయితే, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కొంచెం తెరుకోగానే తల్లికి వందనం, రైతుకు అన్నదాత సుఖీభవ లాంటి పథకాలు అమలు చేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ఏపీకి ఐదేళ్ల విలువైన సమయం పోయింది.. 2019 నాటికి ఉన్న వృద్ధిరేటు కొనసాగి ఉంటే రాష్ట్ర సంపద పెరిగేది అన్నారు. రూ. 9.5 లక్షల అప్పుకి వడ్డీ కట్టాలి, అసలు చెల్లించాలని వెల్లడించారు. ఐదేళ్లలో జరిగిన నష్టాన్ని పూడ్చాలని పేర్కొన్నారు. ఇప్పుడే అన్ని వ్యవస్థలను గాడిలో పెడుతున్నాం.. జరిగిన డ్యామేజ్ తో నాకేం సంబంధమని సామాన్య పౌరుడు ఆలోచిస్తాడు.. అలా ఆలోచించడం లోనూ తప్పులేదన్నారు. అందుకే వారికి అన్ని విషయాలు చెబుతున్నాం.. సంక్షేమ పథకాలు అమలు విషయంలో ఎక్కడా వెనకడుగు వేయమని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పుకొచ్చారు.