Ramprasad Reddy: భారతదేశంలో అత్యంత ప్రజాదరణ కలిగిన యువ నాయకుల్లో ఒకరు లోకేష్
- భారతదేశ చరిత్రలోనే ఏ రాజకీయ నాయకుడు చేయని సాహసం లోకేష్ చేశారు..
- జగన్ పాలనలో ప్రజల కష్టాలను తెలుసుకోవడానికే లోకేష్ పాదయాత్రను పూర్తి చేశారు..
- భారతదేశంలో అత్యంత ప్రజాదరణ కలిగిన యువ నాయకుల్లో ఒకరు లోకేష్: మంత్రి రాంప్రసాద్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ramprasad Reddy: మంత్రి నారా లోకేష్ యువగళం పాదయాత్ర రెండేళ్లు పూర్తి చేసుకోవడంతో అన్నమయ్య జిల్లాలో రాయచోటిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. భారతదేశ చరిత్రలోనే ఏ రాజకీయ పార్టీలో ఏ నాయకుడు చేయని సాహసం నారా లోకేష్ చేశారని తెలిపారు. రాష్ట్రంలోని 11 ఉమ్మడి జిల్లాల్లో దాదాపు 2 వేల కిలోమీటర్ల పైచిలుకు పాదయాత్ర చేసిన ఘనత లోకేష్ కే దక్కుతుందని వెల్లడించారు. ఎందరో నాయకులు పాదయాత్రలు చేశారు.. అన్నీంటిని తలదన్నేలా రాష్ట్రంలోని మండలాలు, గ్రామాల్లో నారా లోకేష్ పర్యటించారు అని మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.
Read Also: Udhayanidhi Stalin: ‘‘సనాతన ధర్మం’’పై వ్యాఖ్యలు.. సుప్రీంకోర్టులో ఉదయనిధికి ఉపశమనం..
Also Read
- CM Chandrababu: రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్.. రైతుల ఆదాయంపై చంద్రబాబు ఫోకస్
- CM Chandrababu: కరువు సీమ.. సిరుల సీమగా మారుతుంది.. సీమ చరిత్రలో అక్టోబర్ 2 చిరస్థాయిగా నిలిచిపోతుంది..
- Pawan Kalyan: కరువు నేల నుంచి ప్రపంచ స్థాయి ఉద్యానవన కేంద్రంగా.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
- Nara Lokesh: సీమ రైతుల సత్తా ప్రపంచానికి తెలియాలి.. లోకేష్ పిలుపు
ఇక, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్ర ప్రజల కష్టాలను తెలుసుకోవడానికే నారా లోకేష్ దిగ్విజయంగా పాదయాత్ర ను పూర్తి చేశాడు అని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీలను నేడు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఒక్కొక్కటిగా ప్రజలకు అందిస్తున్నామన్నారు. 40 ఏళ్ల యువకుడు నారా లోకేష్ ఎవరు చేయలేని సాహసం చేశారని పేర్కొన్నారు. రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలోని అత్యంత ప్రజా ఆదరణ కలిగిన యువ నాయకుల్లో ఒక్కడిగా లోకేష్ బాబు రావడం జరిగిందంటే ఆయన సుదీర్ఘ పాదయాత్రకు లభించిన ఆదరణ అని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చెప్పుకొచ్చారు.
Read Also: Fly ash: ఫ్లైయాష్ కోసం టీడీపీ నేతల మధ్య ఘర్షణ.. కర్రలతో దాడి చేసుకున్న ఇరువర్గాలు
ఇక, ఆ రోజు పాదయాత్రలో నారా లోకేష్ ప్రజల నుంచి తెలుసుకున్న కష్ట, నష్టాలను నేడు కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రజలందరికీ అందిస్తుంది అని మంత్రి రాంప్రసాద్ రెడ్డి చెప్పుకొచ్చారు. గత ఐదు సంవత్సరాల్లో ప్రజలు కష్టాలు పడ్డారు, ఎక్కడ చూసినా దోపిడిలే.. ఆ రోజుకి ఈ రోజుకి మన జీవితాల్లో ఎంతో మార్పు వచ్చింది.. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ విషయానికి వస్తే.. పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టే వాళ్ళు లేరు.. గత ఐదేళ్లలో కడప, పల్నాడు, అన్నమయ్య జిల్లాల్లో వందలాది ఘటనలు జరిగాయి.. ఆ ఘటనలలో ఎన్నో కుటుంబాలకు న్యాయం జరిగేలా నారా లోకేష్ చర్యలు తీసుకుంటున్నారు. జాతీయ పార్టీల్లో లక్షలు దాటి కోట్లల్లో సభ్యత్వాలు చేస్తే ఒక ప్రాంతీయ పార్టీ అయినా తెలుగుదేశం పార్టీలో కోటి దాటి సభ్యత్వాలు చేసిన ఘనత కూడా టీడీపీకి, చంద్రబాబు, నారా లోకేష్ లకే దక్కుతుంది అని మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
-
Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా ‘ఆదర్శ కుటుంబం’పై ఇంత సైలెన్స్ ఏంటి?
-
Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
-
Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!