Ram Gopal Varma: తగ్గేదేలే..! ఆర్జీవీ మరో వివాదాస్పద ట్వీట్..!
- సోషల్ మీడియాలో రాంగోపాల్ వర్మ మరో పోస్ట్..
- ఒంగోలు పోలీస్ స్టేషన్ లో నిన్న విచారణ ఎదుర్కొన్న ఆర్జీవీ..
- పోలీసుల విచారణ తర్వాత ఎక్స్ (ట్విట్టర్)లో మరో పోస్ట్..
- ''ఐ లవ్ ఒంగోలు.. ఐ లవ్ ఒంగోలు పోలీస్.. ఈవెన్ మోర్.. 3 ఛీర్స్..''..
- అంటూ పెగ్గుతో ఉన్న తన ఫొటోను షేర్ చేసిన ఆర్జీవీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ram Gopal Varma: సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులతో వివాదాలు.. కేసుల్లో ఇరుకున్న సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ.. శుక్రవారం రోజు ప్రకాశం జిల్లా ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్‌లో పోలీసు విచారణను ఎదుర్కొన్నారు.. ఆర్జీవీని దాదాపు 9 గంటల పాటు ప్రశ్నించారు పోలీసులు.. అయితే, ఇదే సమయంలో.. మరో కేసులో ఏపీ సీఐడీ పోలీసుల నుంచి నోటీసులు అందుకోవాల్సి వచ్చింది.. డైరెక్టర్ రాంగోపాల్ వర్మకి నోటీసు జారీ చేశారు గుంటూరు సీఐడీ సీఐ తిరుమలరావు. ఇంత జరుగుతున్నా.. వర్మ మాత్రం తగ్గేదేలే అన్నట్టుగా మరో ట్వీట్ చేశారు.. ఒంగోలు పోలీస్ స్టేషన్ లో నిన్న విచారణ పూర్తయిన అనంతరం ఎక్స్ లో స్పందించిన ఆర్జీవీ.. ”ఐ లవ్ ఒంగోలు.. ఐ లవ్ ఒంగోలు పోలీస్.. ఈవెన్ మోర్.. 3 ఛీర్స్…” అంటూ రాసుకొచ్చిన వర్మ.. పెగ్గుతో ఉన్న తన ఫొటోను పోస్ట్ చేశారు..
Read Also: Deputy CM Pawan Kalyan: ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై స్పందించిన పవన్ కల్యాణ్.. ఆసక్తికర వ్యాఖ్యలు..
Also Read
- Akhilesh Yadav: దమ్ముంటే అయోధ్య నుంచి పోటీ చేయి.. యోగికి అఖిలేష్ సవాల్..
- Christa Pike: మరణశిక్ష కోసం 2-సార్లు విషపు ఇంజెక్షన్లు.. అయినా, క్రిస్టా పైక్ ఎలా బతికింది.?
- Saudi-Houthi: మరింత దూకుడు పెంచిన హౌతీలు.. రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి!
- SIR Protest: 10న జంతర్‌మంతర్ దగ్గర సీజేపీ నిరసన.. పాల్గొననున్న మమత!
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆర్జీవీ.. ఇలాంటి పోస్టులు పెట్టడం సర్వసాధారణమే.. కానీ, 9 గంటల పాటు పోలీసుల విచారణ ఎదుర్కొని వచ్చిన తర్వాత ఈ పోస్టు పెట్టడం.. చర్చగా మారింది.. కాగా, వైసీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేష్ ఫొటోలను మార్ఫింగ్ చేసిన సోషల్ మీడియాలో పోస్టు చేసిన కేసులో ఆర్మీజీ ఒంగోలు పోలీసుల విచారణ ఎదుర్కొన్న విషయం విదితమే కాగా.. ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ లో తొమ్మిది గంటలు విచారించినా బయటకు వచ్చిన తర్వాత తిరిగి మందు తాగుతున్న ఫొటోలను ఎక్స్ లో షేర్ చేశారు.. ఇక, మరో కేసులో ఏపీ సీఐడీ పోలీసుల నుంచి నోటీసులు అందుకోవాల్సి వచ్చింది ఆర్జీవీ.. ఒంగోలు వచ్చిన గుంటూరు సీఐడీ సీఐ తిరుమలరావు.. ఆర్జీవీకి నోటీసులు ఇచ్చారు.. ఈ నెల 10వ తేదీన గుంటూరులోని సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలంటూ ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.. 2019లో ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమా తీశారు ఆర్జీవీ.. అయితే, తమ మనో భావాలు దెబ్బ తీసేవిధంగా సినిమా తీశాడంటూ గత ఏడాది నవంబర్ 29వ తేదీన సీఐడీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ.. దీంతో, శుక్రవారం ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ లో వర్మకి నోటీసు ఇచ్చారు సీఐడీ సీఐ తిరుమలరావు.
I LOVE ONGOLE 😍 AND I LOVE ONGOLE POLICE EVEN MORE😍😍. 3 CHEEERS 🍺🍺🍺 pic.twitter.com/vmjNW7ALdL
— Ram Gopal Varma (@RGVzoomin) February 7, 2025
తాజావార్తలు
-
Prabhas’ Fauzi: నెల రోజుల పాటు ప్రభాస్ ‘ఫౌజీ’ క్లైమాక్స్ వార్.. ఇక మిగిలింది రెండే ఫైట్లు!
-
Akhilesh Yadav: దమ్ముంటే అయోధ్య నుంచి పోటీ చేయి.. యోగికి అఖిలేష్ సవాల్..
-
SS Rajamouli: బాహుబలి ‘కిలికి’ని మించేలా జక్కన్న సరికొత్త ప్రయోగం?
-
Nana Patekar: కార్గిల్ వార్‌లో నానా పటేకర్.. అల్విదా నానా భాయ్!
-
Christa Pike: మరణశిక్ష కోసం 2-సార్లు విషపు ఇంజెక్షన్లు.. అయినా, క్రిస్టా పైక్ ఎలా బతికింది.?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!