Gudivada Amarnath: ఎన్నికల ముందు హలో ఏపీ.. బైబై వైసీపీ అని విస్తృత ప్రచారం చేసిన కూటమి పార్టీలు వంచన చూసిన తర్వాత హలో ఏపీ.. కూటమి పెట్టింది టోపీ అని ప్రజలు మాట్లాడుకునే పరిస్థితి ఏర్పడిందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎద్దేవా చేశారు.
Kakani Govardhan Reddy: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టడం ఇదే తొలిసారి అని మాజీమంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి అన్నారు. అందరినీ మోసం చేసినట్లే రైతులను కూడా దగా చేసిన బడ్జెట్ ఇది.. బాబు షూరిటీ.. నో గ్యారంటీ అని ఎద్దేవా చేశారు.
Deputy CM Pawan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక స్థితిని పట్టాలెక్కించే బడ్జెట్ ఇది అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. సంక్షేమం, సుస్థిరాభివృద్ధి లక్ష్యంగా కేటాయింపులు చేశారని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలుకి మార్గ నిర్దేశనం చేసేలా బడ్జెట్ ఉంది..
RK Roja: ఏపీ అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై మాజీ మంత్రి ఆర్కే రోజా విమర్శలు గుప్పించింది. జనాన్ని నమ్మించి నట్టేట ముంచింది కూటమి ప్రభుత్వం.. చంద్రబాబును పొగడ్తలతో ముంచేత్తడానికే, భజన చేయడానికే పయ్యావుల కేశవ్ సమయం అంతా వృథా చేశారంటూ ఎద్దేవా చేసింది. రాష్ట్ర ప్రజలకు ఈ బడ్జెట్ ఎందుకు ఉపయోగపడదు..
Nadendla Manohar: సమగ్రాభివృద్ధి, ప్రజా సంక్షేమానికి భరోసా కల్పించేలా బడ్జెట్ ఉందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. మూల ధన వ్యయం పెంపుతో భవిష్యత్తుకు బాటలు వేశారు. వసతుల కల్పన, పెట్టుబడుల ఆకర్షణకు అద్భుత అవకాశం.. సూపర్ సిక్స్ పథకాల అమలు దిశగా కేటాయింపులు జరిగాయి..
Minister Narayana: గత ప్రభుత్వానికి ఆర్థిక క్రమ శిక్షణ లేదు అని మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. మున్సిపల్ శాఖలో ఉన్న నిధులు గత ప్రభుత్వం డైవర్ట్ చేసింది అని ఆరోపించారు.
చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా జీతాలు సరిగ్గా రావు అని మాజీ మంత్రి బుగ్గన అన్నారు. చంద్రబాబును ఓ చాణక్యుడు, కౌటిల్యుడు అని పోల్చారు.. మరి నాకు తెలిసి ఆయనకు ఏదీ సూట్ కాదు.. ఈసారి బడ్జెట్ కూడా సిస్టమాటిక్ గా పొందుపరచలేదు..
న్యాయమూర్తి ముందు తన ఆవేదన వ్యక్తం చేశారు పోసాని కృష్ణమురళి... తాను మాట్లాడిన మాటలు వాస్తవమేనని అంగీకరించారు పోసాని కృష్ణమురళి. తన భార్యను దూషించిన బాధతోనే తాను అలా తిట్టాల్సి వచ్చిందన్నారు. తన భార్యను దూషించిన వీడియోలు కట్ చేసి.. తాను మాట్లాడినవి మాత్రమే చూపించారని న్యాయమూర్తి ముందు ఆవేదన వ్యక్తం చేశారాయన.
Roja: అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై అందరూ ఆతృతగా ఎదురు చూసారు.. ఆయన ప్రసంగంలో జగన్ ను తిట్టిస్తూ.. చంద్రబాబును పొగిడించుకున్నారు అని వైసీపీ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా ఎద్దేవా చేశారు.