సీఎం చంద్రబాబుతో సినీ హీరో సోనూసూద్ సమావేశం అయ్యారు. తమ ట్రస్ట్ వివరాలు సీఎంకు సోనుసూద్ వివరించారు. తన ట్రస్ట్ తరఫున ఏపీ ప్రభుత్వానికి అంబులెన్స్ లు అందించనున్నారు సోనుసూద్. ఇక ఆయన మాట్లాడుతూ తెలుగు ప్రజలు నా గుండెల్లో ఉంటారు, తెలుగు ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు అని తెలిపారు. ఇవాళ మా ట్రస్ట్ తరపున అంబులెన్స్ లు ప్రభుత్వానికి అందించాము, సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఏపీ అభివృద్ధి జరుగుతోంది అన్నారు.
KP Chowdary: డ్రగ్స్ కేసు దెబ్బకి గోవాలో తేలిన కేపీ.. కొంప ముంచిన గోవా టూరిజం!
తెలుగు ప్రజలు నన్ను మంచి నటుడిగా తయారు చేశారు, ఇక్కడ ఉన్న ప్రేమ ఎక్కడా దొరకదు అన్నారు. ఇక కోవిడ్లో కూడా కొన్ని సేవా కార్యక్రమాలు చేసాము. అప్పుడే నా పై తెలుగు ప్రజలు ప్రేమ చూపించారు అని సోనూ సూద్ అన్నారు. ఇక సోనూ సూద్ దర్శకుడిగా హీరోగా చేసిన ఫతేహ్ సినిమా గత నెలలో రిలీజ్ అయింది.