టీడీపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. టీడీపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని.. పార్టీ ఫిరాయింపులను టీడీపీ నాయకులు ప్రోత్సహిస్తున్నారన్నారని మండిపడ్డారు. గుంటూరులో అంబటి మీడియాతో మాట్లాడారు. ‘‘కేవలం 11 స్థానాలు గెలిచిన కూటమి ఎలా స్థాయి సంగం ఎన్నికల్లో పోటీ చేస్తుంది. ఇప్పటికే నలుగురికి పచ్చ కండువాలు వేసేశారని.. టీడీపీ పెట్టిన క్యాంప్‌లో ఫ్యాన్ గుర్తుపై గెలిచిన కార్పొరేటర్‌లు ఉన్నారు. మేము కోడి పిల్లలను కాపాడుకున్నట్లు మా కార్పొరేటర్లను కాపాడుకుంటున్నాం. టీడీపీ వాళ్లు మా కార్పొరేటర్లను గద్దలు తన్నుకుపోయినట్టుగా తన్నుకుపోతున్నారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చేస్తున్న పనులు.. చంద్రబాబు గమనించాలి. పెమ్మసానికి ప్రజాస్వామ్య విలువలు చంద్రబాబు నేర్పించాలి. పెమ్మసాని నిజాయితీగా సంపాదించిన రూ.5 వేల కోట్ల సొమ్ముతో అప్రజాస్వామికంగా కార్పొరేటర్లను కొంటున్నారు.’’ అని అంబటి ఆరోపించారు.
ఇది కూడా చదవండి: Rahul Gandhi: ‘‘ బుల్లెట్ గాయాలకు బ్యాండ్ ఎయిడ్ ’’.. బడ్జెట్‌పై రాహుల్ గాంధీ విమర్శలు..
కక్కిన కూడుకు ఆశపడే స్థాయికి టీడీపీ నేతలు దిగజారిపోయారు. ఎత్తుగడలు వేరు.. విలువలు వేరు. మద్దాలి గిరి మా పార్టీలోకి ఎలా వచ్చారో ఆ దేవుడికే తెలుసు. కానీ కార్పొరేటర్లను కొనేశాం అని కేంద్ర మంత్రి పెమ్మసాని ఒప్పేసుకున్నారు. గుంటూరులో కూటమి నాయకుల రాజకీయాలు.. కక్కిన కూటికి ఆశపడుతున్నట్లుగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఫ్యాన్ గుర్తుపై గెలిచిన కార్పొరేటర్లతో టీడీపీ నాయకులు క్యాంపు రాజకీయాలు నడుపుతున్నారని.. స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో వైసీపీ కార్పొరేటర్లు అంతరాత్మ ప్రబోధనతో ఓటు వేయాలని సూచించారు. జగన్ పెట్టిన భిక్షతోనే కార్పొరేటర్ అయ్యామనే విషయాన్ని.. కూటమికి వెళ్లిపోయిన వైసీపీ కార్పొరేటర్లు గుర్తుపెట్టుకోవాలని చంద్రబాబు సూచించారు.
ఇది కూడా చదవండి: Vemula Prashanth Reddy : ఏనుముల రేవంత్ రెడ్డి కాదు రేవంత్ రెడ్డి అంటున్నారు..!