తెలంగాణలో బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ మాటల యుద్ధం నడుస్తోంది. నిత్యం సోషల్ మీడియా వేదికగా ఇరుపార్టీల నేతలు విమర్శలు చేసుకుంటూనే వుంటారు. తాజాగా మంత్రి కేటీఆర్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాలనపై నిప్పులు చెరిగారు. బీజేపీ పాలనలో బొగ్గు కొరత కరోనా టైంలో ఆక్సిజన్ కొరత పరిశ్రమలకు కరెంట్ కొరత యువతకు ఉద్యోగాల కొరత గ్రామాల్లో ఉపాధి కొరత రాష్ట్రాలకిచ్చే నిధుల కొరత అన్ని సమస్యలకు మూలం PM మోడీకి విజన్ కొరత అంటూ ట్వీట్ చేశారు.…
విశాఖ అంతర్జాతీయ విమానాశ్ర యం కోసం కేటాయించిన భూములను వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సుమారు 800కోట్ల రూపాయల విలువైన ఈ భూములను తిరిగి స్వాధీనం చేయాలని ఏపీ సర్కారు రాసిన లేఖ కేంద్రం పరిశీలన లో ఉంది. నగరం నడిబొడ్డున ఉన్న 74ఎకరాలను భవిష్యత్ అవసరాలకు ఉపయోగించుకోవాలనేది ఆలోచన. విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ సుమారు 375 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇక్కడి నుంచి రోజు పదుల సంఖ్యలో డొమెస్టిక్, ఇంటర్నేషనల్ సర్వీసులు నడుస్తున్నాయి. ఏటి…
కేంద్రప్రభుత్వం ఆధ్వర్యంలోని కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్లకు సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్రీయ విద్యాలయాల్లో ఎంపీ కోట ఎత్తివేస్తూ నిర్ణయం వెలువరించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఎంపీ కోటా సీట్లు ఉండవని కేంద్రీయ విద్యాలయాల ప్రిన్సిపాల్స్ కి ఆదేశాలు అందాయి. ఈ నిర్ణయంపై ఎంపీలు, విద్యార్ధుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. దేశవ్యాప్తంగా లక్షలాదిమంది కేంద్రీయ విద్యాలయాల్లో విద్యను అభ్యసిస్తున్నారు. కేంద్రమంత్రి లెక్కల ప్రకారం గత ఏడేళ్ళలో 12 లక్షలమంది విద్యార్ధులు ప్రవేశాలు పొందారు. గత…
ఢిల్లీలో టీఆర్ ఎస్ దీక్షపై కేంద్రం స్పందించింది. కేంద్ర ఆహార ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ వివరణ ఇచ్చింది. పారా బాయిల్డ్ రైస్ ను కొనలేమని మరోసారి స్పష్టం చేసింది కేంద్రం. 2021-22 రబీ సీజన్ కు సంబంధించి తెలంగాణా ప్రభుత్వం ఇప్పటివరకు ధాన్యం సేకరణ ప్రతిపాదనలు పంపలేదు. ప్రతిపాదనలు పంపాలని కేంద్రం అనేకసార్లు తెలంగాణను కోరింది. రబీ నుంచి ముడి బియ్యం సేకరణపై ప్రతిపాదనల కోసం ఇంకా ఎదురుచూస్తూనే ఉన్నాం అని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.…
దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల పెంపు కొనసాగుతూనే వుంది. పెట్రోలియం కంపెనీలు ఏప్రిల్ 4 సోమవారం పెట్రోల్, డీజిల్ ధరలను విడుదల చేశాయి. పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు 40 పైసలు పెంచాయి. ఇంధన ధరల తాజా పెరుగుదల తర్వాత, ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.103.81కి, డీజిల్ లీటరుకు రూ.94.07కి చేరుకుంది. ముంబైలో లీటర్ పెట్రోల్ రూ. 118.81, డీజిల్ రూ. 103.04. చేరుకుంది. గత 14 రోజుల్లో 12వసారి చమురు పెట్రోల్, డీజిల్ రేట్లు…
తెలంగాణలో యాసంగి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర వాణిజ్య, ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ మరింత స్ఫష్టత ఇచ్చారు. యాసంగి సీజన్ లోనూ కచ్చితంగా తెలంగాణ నుండి రా రైస్ కొనుగోలు చేస్తామని ప్రకటించారు. రైతులను ఆదుకోవడం తమ కనీస బాధ్యతని పీయూష్ గోయల్ చెప్పారు. దురదృష్టవశాత్తు రాష్ట్ర ప్రభుత్వమే ఈ విషయంలో కేంద్రానికి సహకరించకుండా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందన్నారు. ఈరోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి…
మనదేశంలో సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలు ఎక్కువే. అందులోనూ గోమాతకు మనం ఎంతో ప్రాధాన్యత ఇస్తాం. ఇంట్లోనే ఆవుల్ని పెంచుకుంటాం. మన చుట్టూ తిరిగే ఆవు దూడలు మన పిల్లలతో సమానంగా పెంచుతాం. ఆవు ఇంట్లో తిరిగితే అది ఎంతో శుభదాయకం అంటారు. ఒక ఆవు జాతి వల్ల ప్రపంచంలోనే ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. అదే చిత్తూరు జిల్లా పుంగనూరు గ్రామం. పుంగనూరు ఆవుకు అనేక ప్రత్యేతలు ఉండడంతో ఎక్కువమంది ఈ ఆవుని పెంచుకోవడానికి ఎంతైనా ఖర్చుపెడతారు. పుంగనూరు…
ఏపీకి జీవనాధారం అయిన పోలవరం ప్రాజెక్ట్ ని త్వరగా పూర్తిచేయాలని, అంచనా వ్యయాన్ని ఆమోదించాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్రాన్ని కోరారు. రెండున్నర గంటలపాటు కొనసాగిన సమావేశంలో కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చాయని విజయసాయి రెడ్డి తెలిపారు. గత పర్యటన సందర్బంగా ప్రధానమంత్రికి ముఖ్యమంత్రి ఇచ్చిన వినతిపత్రం లోని అన్ని అంశాలను ఈ సమావేశంలో చర్చించాం. పరిష్కార మార్గాలను అన్వేషించాం. సమావేశం చాలా సానుకూలంగా జరిగింది. త్వరలోనే కేంద్రం నుంచి మంచి సమాచారం వస్తుందని ఆశిస్తున్నామన్నారు. కేంద్ర…
తెలంగాణ రైతాంగం అంత కూడా మోడీ చేస్తున్న చర్యలతో ఆందోళన లో ఉన్నారు. తెలంగాణ రైతులు, ప్రజల పట్ల పూర్తిగా మోడీ వివక్ష చూపుతున్నారు అని టీఆర్ఎస్ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి అన్నారు. మేము వడ్లు కొనం అంటే ఎం చేస్తారు ? దాన్యం సేకరణ చేయడం కేంద్ర ప్రభుత్వం బాధ్యతనే. వరి ధాన్యంను ఎగుమతి చేసేందుకు వాళ్ళ దగ్గరనే అంతర్జాతీయ పాలసీ ఉంది. ఆహార నిల్వలను ఇతర దేశాలకు పంపించే బాధ్యతమిదేగా అని గుర్తు…